DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జ్ఞానవాపి లో బయల్పడింది శివలింగమే: న్యాయవాది విష్ణు జైన్  

*కోర్టు ఆదేశంతో తీసిన వీడియోలో న్యాయవాదులకు అప్పగింత. .*

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, మే 30, 2022 (డిఎన్ఎస్):* ప్రసిద్ధ జ్ఞానవాపి ప్రాంగణంలో ఇటీవల జరిగిన పరిశీలనలో బయల్పడిన విగ్రహం శివలింగమేనని వారణాసి భక్త కమిటీ న్యాయవాది విష్ణు శంకర్ జైన్ ప్రకటించారు. ఈ నెల లో

కోర్టు ఆదేశాల ప్రకారం చిత్రీకరణ జరిగిన వీడియోలను అధికారికంగా సోమవారం న్యాయవాదులకు అందించారు. ఈ వీడియోలను కొన్ని మీడియా ఛానెళ్ల ద్వారా యావత్ భక్తులకు ప్రకటించడం జరిగింది. ఈ వీడియోల్లో కోర్టు అధికారులు, ఇరుపక్షాల వాదీ, ప్రతివాదులు, న్యాయవాదులు వీడియో బృందం మొత్తం అందరూ ఈ వీడియో లో కనపడుతున్నారు. ప్రతి అంశాన్ని

కూలంకషంగా వీడియో తీయడం జరిగింది. దీనిలో బయల్పడిన ప్రధాన అంశం శివలింగం దీన్ని విరగగొట్టె ప్రయత్నాలు కూడా జరిగినట్టు అధరాలు ఉన్నాయని విష్ణు జైన్ తెలిపారు. దీనిపై కోర్టు కు ఫిర్యాదు చేస్తామన్నారు. ముస్లిం వర్గాలు చెప్తున్నట్టుగా ఇది ఫౌంటెన్ కాదని, ప్రపంచంలో ఏ మసీదులోని నీళ్ల ఫౌంటెన్ ఈ ఆకారం లో ఉండదన్నారు. దీనిపై

మౌలానాలు కొందరు వివిధ టీవీ ఛానెళ్లలో అతిగా స్పందిస్తూ. విపరీత వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. దీనిపై తాము కోర్టుకి ఫిర్యాదు చేయడం జరుగుతోందన్నారు. ఈ వీడియోలో లభ్యమైన అంశాల్లో మసీదు లోని గోడలపై త్రిశూలం గుర్తులు ప్రతి గడప గడపకు ఉన్నాయన్నారు. మసీదుల్లో త్రిశూలం బొమ్మలు ఎందుకు పెట్టుకుంటారన్నారు. ఇంతవరకూ సోషల్

మీడియాల్లో వైరల్ అయినా వీడియో గతంలో ఎప్పుడో చిత్రీకరించాడని, నేడు విడుదలైన వీడియో తాము ప్రత్యక్షంగా పాల్గొన్న వీడియో అని తెలిపారు. ప్రతి అంశాన్ని కోర్టుకు తెలియచేస్తామన్నారు. శివ భగవానుని లీలలు ప్రపంచానికి బహిర్గతమయ్యాయన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam