DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తీర ప్రాంత రక్షణపై పోర్టు లో సీఐఎస్ఎఫ్ కీలక వర్క్ షాప్

విశాఖపట్నం, ఆగస్టు 10 , 2018 (DNS Online ): భారత దేశపు సముద్ర తీర రవాణాలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నది విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ అని, అక్కడ జరిగే ప్రతి అంశం రక్షణ విభాగంతో

అనుబంధం కల్గియుందని దీన్ని పరిరక్షించుకోవాల్సిన భాద్యత అందరిపై ఉందని విశాఖపట్నం పోర్టు చైర్మన్ ఎంటి కృష్ణబాబు పిలుపునిచ్చారు. విశాఖపట్నం పోర్టు ట్రస్టు

పరిధిలోని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ( సీఐఎస్ఎఫ్ ) ఆధ్వర్యంలో శుక్రవారం పోర్టు విభాగానికి సంబంధించి పరిశ్రమలకు ప్రత్యేకించిన సదస్సు లో

నిర్వహించారు. ఈ కార్యక్రమం లో పాల్గొన్న అయన మాట్లాడుతూ ప్రస్తుతం సిఐ ఎస్ ఎఫ్ అందిస్తున్న సేవలు అద్భుతమని, మరింత జాగరూకత అవసరమన్నారు. దేశంలోని పోర్టు

విభాగాలకు సంబంధించిన 17 సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ విభాగాల ఉన్నతాధికారులు ఈ సెమినార్ కు హాజరయ్యారు.
ముంబై తీరంలో 2008లో తీవ్రవాదుల దాడుల

నేపధ్యంలో తీర ప్రాంత రక్షణకు తీసుకోవలసిన మరిన్ని ముఖ్యమైన అంశాలను ఈ సదస్సులో ప్రధానంగా చర్చించారు. భవిష్యత్తులో తీర ప్రాంతాల్లో తలెత్తనున్న సమస్యలు

వాటిని ఎదుర్కోవలసిన విధానంపై అధికారులు సూచనలు చేశారు. తీర ప్రాంత రక్షణ కోసం తీసుకోవలసిన అంశాలపై కూలంకషంగా చర్చించారు. సమావేశంలో చర్చించిన కీలకమైన

అంశాలను సంబంధింత విభాగాలకు అందజేయనున్నారు. తద్వారా భవిష్యత్తులో అవసరమైన సమయంలో ఆలచనలను ఆచరణలో పెట్టేందుకు అవకాశం కలుగనుంది. ఈ సదస్సులో సీఐఎస్ ఎఫ్

దక్షిణవిభాగం ఐజి ఆనంద మోహన్ , సీఐఎస్ ఎఫ్ దక్షిణ విభాగం హెడ్ క్వార్టర్స్ డిఐజి హరదీప్ సింగ్, విశాఖపట్నం పోర్టు ట్రస్ట్ డిప్యూటి చైర్మన్ పిఎల్ హరనాధ్ , ఇండియన్

కోస్ట్ గార్డ్ ఐజి ఎ.కె హరబోల, రిటైర్డ్ డిజిపి ఎపి శ్రీ సాంబశివరావు, విశాఖపట్నం పోర్టు ట్రస్ట్ కమాండెంట్ జెపి అజాద్ , వంటి ముఖ్యమైన అధికారులు ఈ వర్క్ షాప్ లో

పాల్గొన్నారు.


Latest Job Notifications

Panchangam - Dec 4, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam