DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నూపుర్ ని ఆదుకోవాల్సిన బీజేపీ బలిపశువును చేసింది 

*పార్టీ క్యాడర్లో నూపుర్ శర్మకు పెరుగుతున్న మద్దతు.* 

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, జూన్  05, 2022 (డిఎన్ఎస్):* ఒకే ఒక్క టీవీ డిబేట్ లో ఒక వ్యాఖ్య చేసిన బీజేపీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ ను పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్టు బీజేపీ ప్రకటించింది. పార్టీ తరపున

బలంగా వాణిని వినిపించిన కారణంగా ఆమెను బీజేపీ బాలి పశువును చేసింది. దీనికి ప్రధాన కారణం ఈమె చేసిన వ్యాఖ్య ముస్లిం లను కించపరిచినట్టుగా ఉంది అనే కారణం చెప్పింది. దీనిపై బీజేపీ క్యాడర్లోనే  తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈమెను పార్టీ నుంచి బహిష్కరణ చెయ్యడం పట్ల అధినాయకత్వం పై అభిమానులు, క్యాడర్ మండిపడుతున్నారు. తక్షణం

ఈమె సస్పెన్షన్ ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ సోషల్ మీడియాలో ఐ  సపోర్ట్  నూపుర్ శర్మ స్లోగన్లతో క్యాంపైన్ మొదలు పెట్టారు.

హిందువులను, హిందూ దేవీదేవతలను ప్రతి క్షణం దూషిస్తున్న ముస్లిం వర్గాలపై ఎటువంటి చర్యలు తీసుకోక పోగా హిందుత్వ ను బలంగా వినిపిస్తున్న నూపుర్ పై ఈ చర్యలు తీసుకోడవం ఏంటని నేరుగా మోడీనే

ప్రశ్నిస్తున్నారు.  హిందువులకు అండగా నిలిచినా పార్టీ అని పేరు పొందిన బీజేపీ లోనే హిందువులకు అన్యాయం జరుగుతోందని మండిపడుతున్నారు. ప్రతి టీవీ డిబేట్ లోను శివ విగ్రహాన్ని ముందుగా తెలిస్తే ముక్కలు చేసేవాళ్ళం అని ఒక మౌలానా సర్ఫరాజ్ బహిరంగంగానే ప్రకటిస్తే.. కేంద్ర ప్రభుత్వం ఏమి చెర్యలు

తీసుకుందన్నారు. 

ఇన్నాళ్ళకి హిందుత్వ పై తన వాణి ని గట్టిగా వినిపించే యువ నాయకురాలు కు సంఘీభావం ప్రకటించాల్సిన సమయంలో ఆమెను ఒంటరిగా చేసి ఏకాకిగా వదిలి పెట్టడం ద్వారా ఆమెను ఆమెకు ప్రాణ హాని కూడా కలిగే  అవకాశం ఉంది. ఇప్పడికే ముస్లిం వర్గాలు ఆమె తలకు కోటి రూపాయల విలువ కట్టారు. మరికొందరు ఆమెను  చంపితే రూ. 10

లక్షలు బహుమానం, ఆమెను మానభంగం చేస్తే రూ.5 లక్షలు నజరానా ప్రకటించాయి. ఇలాంటి విపరీత వ్యాఖ్యలపై పార్టీ లోని ఎవ్వరూ మాట్లాడక పోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో ఆమెను  భద్రతా లేకుండా తిరగడం అత్యంత ప్రమాదకరం గా మారనుంది.  

ఇప్పడికే హిందూ సమాజంలో అధిక శాతం ప్రజలు బీజేపీ కి దూరంగానే ఉన్నారు. ఇప్ప్డుడు తీసుకున్న

నిర్ణయం తో పార్టీలో ఉండే అభిమానులు సైతం ఆలోచనలో పడే అవకాశం ఉంది. 
రాజకీయ పార్టీలన్ని మైతిరిటీలకు అండగా నిలబడితే.. .హిందూ సమాజానికి రక్షణ కూడా  కరువవుతోందనే భావన ప్రజల్లో కలుగుతోంది.  ఇన్నాళ్లూ బీజేపీ కి మద్దతు ప్రకటించిన హిందూ సమాజం ముస్లిం వర్గాలు  హిందూ దేవి దేవతలపై దూషణలు చేస్తున్నా బీజేపీ గానీ, కేంద్రం

గానీ నోరెత్తక పోవడం ప్రమాదకరంగా పరిణమించే అవకాశం ఉంది.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam