DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పాత్రికేయులకూ కేంద్ర ప్రభుత్వ పథకాలు అమలు చెయ్యాలి: ఏఐఎన్ఈఎఫ్. 

(DNS report: P Raja, Bureau chief, Amaravati)  

అమరావతి: జూన్ 10, 2022 (డిఎన్ఎస్):  దేశంలోని అన్ని రాష్ట్రాల్లో అర్హులైన పాత్రికేయులకి కేంద్ర ప్రభుత్వం గృహ నిర్మాణం,ఆరోగ్య భీమా కల్పించాలని ఈ విషయం లో అనేక రాష్ట్రప్రభుత్వాలు సరిగ్గా స్పందించకుండా కాలయాపన చేస్తూన్నందున ప్రధాని వెంటనే స్పందించి ఈ విషయంలో సహాయం చెయ్యాలని అల్ ఇండియా

 న్యూస్ పేపర్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (ఏ ఐ ఎన్ ఈ ఎఫ్) ప్రధానమంత్రి నరేంద్రమోడీ కి విజ్ఞప్తి చేసింది.  ఏ ఐ ఎన్ ఈ ఎఫ్ జాతీయ ఉపాద్యక్ష్యులు చలాది పూర్ణచంద్రరావు ఒక ప్రకటనలో   జర్నలిస్టుల సంక్షేమానికి ,వారిపై జరుగుతున్న దాడులకు చట్టాలున్న సరిగా అమలు జరగటం లేదని, భవిష్యత్ లో చట్టాలను మరింత పటిష్టంగా అమలయ్యేలా చూడాలని

ఆయన కోరారు. దశాబ్దాలపాటు ప్రముఖ మీడియా హౌసుల్లో పనిచేసి రిటైర్  అయిన అనేకమంది పాత్రికెయులకు పెన్షన్ సదుపాయంలేక వృద్ధాప్యంలో తీవ్ర ఆర్ధిక,ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని అలాంటి రిటైర్ అయిన జర్నలిస్టులకు జాతీయ పెన్షన్,ఆరోగ్య భీమా పధకాలు ప్రవేశపెట్టాలని విజ్ఞప్తి చేశారు. జర్నలిస్టుల సంక్షేమంలో ఒక్కొక్క

రాష్ట్రంలో ఒక్కొక్క విధానం అవలంభిస్తుండగా కొన్ని రాష్ట్రాలు అసలు పట్టించుకోవటం లేదని కనుక ఒకే విధానం ద్వారా కేంద్రమే జాతీయ స్థాయిలో పాత్రికేయుల సంక్షేమానికి  దేశవ్యాప్తంగా "అజాదీ కా అమృత మహోత్సవ్" జరుపుకుంటున్న సందర్భంగా ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం పెద్ద మనసుతో చర్యలు వెంటనే తీసుకుని

జర్నలిస్టులకు,రిటైర్డ్ జర్నలిస్టులకు భరోసా పధకం ప్రవేశపెట్టాలని పూర్ణచంద్ర రావు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
ఒక వార్తా సంస్థ షుమారు 60 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడం తో అసంస్థలో ఆర్ధిక సమస్యలు తాళలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని,దీన్ని నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం వెంటనే ఆ సంస్థను జాతీయంచేసి ఉద్యోగులను,ఆ

సంస్థకు చెందిన మరియు ఏళ్లతరబడి లీజుకు ఇచ్చిన వందల కోట్ల విలువైన ప్రముఖ నగరాల్లోని  స్థలాలు   పరులు పాలు కాకుకుండా వాటిని వెంటనే స్వాధీనం చేసుకోవాలని కోరారు.కేంద్ర,ఆయా రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో పెద్దపత్రికలకు జారీచేడుతున్న ప్రకటనల సారాంశాన్ని చిన్నపత్రికలు వార్తలుగా రాసి మారు మూల గ్రామాల పాఠకుల దృష్టికి

నిస్వార్థంగా తీసుకెళుతున్నాయని అయితే వాటికి కేంద్రం డి ఏ వి పి ద్వారా నిబంధనలు ప్రకటనలు సడలించి నెలకొక ప్రకటన జారీ చేసేలా చర్యలు చేపట్టిచిన్న,మధ్యతరహా పత్రికలను ఆదుకోవాలని పూర్ణచంద్ర రావు కోరారు.
త్వరలో అసోం రాజధాని గౌహతిలో నిర్వహించ తలపెట్టిన ఏ ఐ ఎన్ ఈ ఎఫ్ సెంట్రల్ వర్కింగ్ కమిటీ సమావేశాల్లో ఈ అంశాలు కూడా

చర్చించి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేయనున్నట్లు పూర్ణచంద్ర రావు ఈ ప్రకటనలో తెలిపారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam