DNS Media | Latest News, Breaking News And Update In Telugu

లంచం తీసుకుంటూ ఏసీబీ కి చిక్కిన రాజాం  సబ్ ట్రెజరర్ 

*(DNS report: P Raja, Bureau chief, Amaravati)*  

*అమరావతి: జూన్  13, 2022 (డిఎన్ఎస్):* విజయనగరం జిల్లా రాజాం పట్టణము లో సబ్ ట్రెజరర్ గా పనిచేస్తున్న గోవిందరాజు రూ. 10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పకడ్బందీగా చిక్కాడు.  రాజాం నియోజకవర్గం లోని సంతకవిటి మండలం లో వ్యవసాయ శాఖ అధికారిగా పనిచేస్తున్న ఆర్. శ్యామల కు 6 సంవత్సరాల

ఇంక్రిమెంట్లు రావలసి ఉన్నాయి. అదే విధంగా రెండు నెలల ఏరియల్స్ రావలసి ఉన్నాయి. దీంతో ఆమె సబ్ ట్రెజరీ గోవిందరాజు ను కలిసి అవి వచ్చే విధంగా చేయాలని తెలిపింది. దీంతో సి ఎఫ్ ఎం ఎస్ బిల్స్ కోసం రూ. 15 వేలు లంచం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. దీంతో ఆమె ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. శ్రీకాకుళం ఏసీబీ డి వి ఎస్ ఎస్ రమణమూర్తి

ఆధ్వర్యంలో గోవింద రాజులు ఆమె వద్ద నుండి అక్రమంగా డబ్బులు తీసుకుంటుండగా పకడ్బందీగా సోమవారం  ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. దీంతో ఆయనను అరెస్టు చేసి మంగళవారం ఏసీబీ కోర్టు విశాఖపట్నంలో ప్రవేశ పెట్టనున్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam