DNS Media | Latest News, Breaking News And Update In Telugu

డిఆర్సీ నుంచి మీడియా బయటకి దయచేయండి: మంత్రి సిదిరి, ఎమ్మెల్యే 

*(DNS report: P Raja, Bureau chief, Amaravati)*  

*అమరావతి: జూన్  14, 2022 (డిఎన్ఎస్):* 

*విశాఖపట్నం, జూన్  14, 2022 (డిఎన్ఎస్):* జిల్లా సమీక్షా కమిటీ సమావేశం (డి ఆర్సీ సమావేశం) నుంచి మీడియా వాళ్ళు మొత్తం బయటకు పోవాలి. . . ఇదీ  కాకినాడ..జిల్లా సమీక్షా కమిటీ సమావేశానికి (డి ఆర్సీ సమావేశం) మొట్ట మొదటగా హాజరైన జిల్లా ఇంఛార్జి,మత్య్సశాఖ

మంత్రి సీదిరి అప్పలరాజు జారీ చేసిన ఆదేశాలు. జిల్లా కేంద్రం లో జరిగిన తోలి సమావేశంలో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గతంలో మీడియా తనపై చేసిన ప్రచారానికి ఆగ్రహం తో ఊగిపోయారు. ఒక్కసారిగా మీడియా ప్రతినిధులను సమావేశంలో చూడగానే మంత్రి ముందు ఆగ్రహాన్ని ప్రదర్శించారు. దీంతో సభ నడపడం కోసం మంత్రి

మీడియా వాళ్ళను తక్షణం బయటకు పోవాలని, ఆ తర్వాతే సభ జరుగుతుందని హుకుం జారీ చేసారు. 

ఇరకాటం లో పడ్డ సమాచార శాఖా అధికారులకు ఎమ్మెల్యే గట్టి హెచ్చరికే జారీ చేసారు. మీడియా ని బయటికి పంపుతారా లేక ప్రైవేట్ మనుషులని పెట్టుకుని బయటకు గెంటెయ్యాలా అంటూ సమాచార శాఖ అధికారులపై ఎమ్మెల్యే ఆగ్రహం ప్రదర్శించడం

గమనార్హం. 

ఈ సమావేశానికి  ప్రారంభంలోనే మీడియాకి అనుమతి లేదంటూ ఎమ్మెల్యేలు బయటకి పొమ్మని హెచ్చరిక చేయడం జరిగింది. అయితే సమాచార శాఖా ఇచ్చిన సమాచారం తోనే తాము మీటింగ్ వచ్చినట్టు కొందరు మీడియా ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.   

ఈ సమావేశం కారణంగా మీడియా కు కాకినాడ జిల్లాలో అధికార

పార్టీకి ఉన్న విభేదాలు జిల్లా ఇంచార్జి మంత్రికి ప్రత్యక్షంగా తెలిసి వచ్చాయి. 


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam