DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దేశం లో నిరుద్యోగ యువతను భారత ప్రధాని నరేంద్ర మోడీ బంపర్ ఆఫర్

*వచ్చే యేడాదిన్నర లో మిషన్ మోడ్ ద్వారా 10 లక్షల నియామకాలు:మోడీ* 

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, జూన్  14, 2022 (డిఎన్ఎస్):* భారత దేశంలోని నిరుద్యోగ యువత కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ భారీ బంపర్ ఆఫర్ ప్రకటించారు. రానున్న ఏడాదిన్నర కాలంలో అన్ని కేంద్ర ప్రభుత్వ

విభాగాల్లో భారీ నియామకాలు జరపనున్నట్టు తెలిపారు. మిశన్ మోడ్ లో భాగంగా రానున్న ఒకటిన్నర సంవత్సరాల లో 10 లక్షల మంది నియామకాన్ని కేంద్ర ప్రభుత్వం చేపట్టనుందని భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. మంగళవారం సోషల్ మీడియా వేదికగా ఆయన ప్రకటించారు. అన్ని మంత్రిత్వ శాఖలు మరియు విభాగాల లో మానవ వనరుల స్థితి ని

సమీక్షించారు. రాబోయే ఒకటిన్నర సంవత్సరాల లో ప్రభుత్వం మిశన్ మోడ్ లో 10 లక్షల మంది ని నియమించవలసింది గా కూడా ఆయన ఆదేశించారు. ఈ విషయాన్నీ ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో అధికారికంగా ప్రకటించింది. ఈ నియామకాలలో దేశం లోని నిరుద్యోగ యువతలో ఎంతో ఉత్సాహం వచ్చింది. భారతీయ జనతా పార్టీ ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకు

వెళ్లేందుకు ఇప్పడి నుంచే ప్రచారాన్ని చేపట్టనుంది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam