DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కాంగ్రెస్ కు పెద్ద షాక్, అగ్నిపథ్ మంచి నిర్ణయం : కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారి

*రాహులు వ్యతిరేకిస్తే, నువ్వు సమర్ధిస్తావా? ఎంపీ తీరుపై విపక్షాలు విమర్శలు* 

*(DNS రిపోర్ట్: సాయిరాం CVS,  బ్యూరో చీఫ్, విశాఖపట్నం)*  

*విశాఖపట్నం, జూన్  19, 2022 (డిఎన్ఎస్):* భారత కేంద్ర ప్రభుత్వం యువత భవిషత్ ను తీర్చిదిద్దెందుకు, భారత సైన్యాన్ని బలోపేతం చేసేందుకు ప్రవేశ పెట్టిన అగ్నిపథ్ పథకం పట్ల

అధిక శాతం విపక్షాలకు చెందిన ఎంపీలు సైతం మద్దతు ప్రకటిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ప్రతినిధులు సోనియా, రాహుల్ ఈ పధకాన్ని పూర్తి గా వ్యతిరేకించిన విషయం తెలిసిందే. అయితే అదే పార్టీ కి చెందిన లోక్ సభ సభ్యుడు మనీష్ తివారి ఈ అగ్నిపథకాన్ని పూర్తిగా సమర్ధిస్తూ సరైన సమయంలో సరైన నిర్ణయం ఇది అంటూ ఆయన ట్వీట్ ద్వారా

ప్రకటించారు. అయితే సాయుధ దళాలు ఉపాధి హామీ కార్యక్రమం కాకూడదని మనీష్ తివారీ అన్నారు. 

దశాబ్దాల నాటి ఎంపిక ప్రక్రియలో ప్రధాన సవరణలో భాగంగా ఆర్మీ, నేవీ మరియు వైమానిక దళంలో సైనికుల నియామకం కోసం నాలుగు సంవత్సరాల స్వల్పకాలిక ఒప్పంద ప్రాతిపదికన ప్రభుత్వం మంగళవారం ఈ పథకాన్ని

ఆవిష్కరించింది.

దీనిపట్ల వ్యతిరేకిస్తూ ప్రతిపక్షాల సహకారంతో దేశ వ్యాప్తంగా నిరసనలు జరిగాయంటూ అధికార పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు. అయితే మాజీ సైనిక అధికారులు ఈ పథకం పట్ల ప్రజల్లో పూర్తి అవగాహనా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం తీవ్రంగా వ్యతిరేకించిన

కేంద్ర పథకాన్ని అదే పార్టీకి చెందిన ఎంపీ సమర్ధించడం పై పార్టీ నేతలు, కార్యకర్తలు, అర్బన్ నక్షల్స్ సహా కొందరు పాత్రికేయులు, బీజేపీ యేతర పార్టీల ప్రతినిధులు పెద్ద ఎత్తున మనీష్ తివారి పై సోషల్ మీడియా లో మండిపడుతున్నారు. ఇదే విషయాన్నీ టీవీ ప్రసార మాధ్యమాల్లో ప్రత్యక్షంగా ప్రకటించడం గమనార్హం. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam