DNS Media | Latest News, Breaking News And Update In Telugu

హిందుత్వ కి చేసిన తప్పిదానికి ఫలితం ఉద్దవ్ అనుభవించక తప్పేలా లేదు

*(DNS Report: Sairam CVS, Bureau Chief, Visakhapatnam)*  

*విశాఖపట్నం, జూన్ 21, 2022 (డిఎన్ఎస్):* హిందుత్వ వాదానికి కట్టర్ హిందువుగా అందరికి ఆదర్శంగా  బ్రతికిన బాలాసాహెబ్ ఠాక్రే దేశ, విదేశాల్లోని యావత్ హిందూ సమాజం అభిమానాన్ని పొందగలిగారు. ఆయన ఆశయాలను తుంగలోకి తొక్కుతూ. ..అతని కుమారుడు ఉద్దవ్ ఠాక్రే హిందూ వ్యతిరేక శక్తులైన కాంగ్రెస్, సహా ఇతర

రాజకీయ పార్టీలతో చేతులు కలపడమే కాకా, వాళ్ళతో కలిసి మహారాష్ట్ర లో గద్దెను కూడా ఎక్కాడు. అధికార దాహం తో ఒకసారి తప్పుడు అడుగులు వేసాక, వాళ్ళు ఏమి చెబితే దానికి కళ్ళు మూసుకుని తలూపవలసిన గుటిలోకి చేరిపోయాడు. దీనిలో భాగంగానే అమరావతి స్వతంత్ర్య ఎంపీ నవనీత్ రానా, ఆమె భర్త ఎమ్మెల్యే రవి రానా లు ముఖ్యమంత్రి ఇంటి ఎదురుగా

హనుమాన్ చాలీసా పాడుతాం అని మాట అన్నందుకు వాళ్లపై దేశ ద్రోహం కేసులు పెట్టి, అరెస్టు చేయించడం ఇతని జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు. దాని ఫలితం నేడు అతని అధికారం కోల్పోయే వరకూ తీసుకు వచ్చింది. 

మంగళవారం బాలాసాహెబ్ అనుచరులుగా శివసేన ఎమ్మెల్యేగా, మంత్రి గా ఉన్న ఏక్ నాధ్ షిండే తన అనుచరులు 15 మందితో కలిసి

తిరుగుబాటు బావుటా ఎగురవేయడంతో ఉద్దవ్ ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి వచ్చేసింది. తిరుగుబాటు ఎమ్మెల్యే లకు మద్దతుగా మరో 15 మంది ఎమ్మెల్యే లు కూడా శిబిరంలో చేరిపోయారు. వీళ్ళు చెప్పే విషయం ప్రధానంగా బాలాసాహెబ్ ఆశించిన శివసేన ను పూర్తిగా తుంగలోకి తొక్కి హిందూ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నారన్నది ఆరోపణ. దీనికి తోడు

హిందూ సమాజం నుంచి పూర్తి వ్యతిరేకత రావడం ఉద్దవ్ పదవి లో ఉంటాడా ఊడిపోతాడా అనేది ఒకటి రెండు రోజుల్లో తేలిపోనుంది. 

తిరుగుబాటు ఎమ్మెల్యే లు సూరత్ హోటల్లో శిబిరం పెట్టారు. వీళ్లంతా హోటల్ లో ఖులాసాగా ఎంజాయ్ చేస్తున్న వీడియో లను ఒక హిందూ జాతీయ టీవీ ఛానెల్ ప్రసారం చెయ్యడం ఉద్దవ్ లో మరింత టెన్షన్ రాజుకుంది.

వీళ్ళతో సంప్రదింపులు జరిపేందుకు ఇద్దరు మంత్రులను హోటల్ కు పంపినా, రక్షణ గా ఉన్న పోలీసులు వీళ్ళని లోనికి వెళ్లనివ్వక పోవడం గమనార్హం. ఇదిలా ఉంటె ఒక ఎమ్మెల్యే భార్య తన భర్తను కిడ్నప్ చేసారంటూ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. తిరుగుబాటుదారులందరూ ఫోన్లు స్విచ్ ఆఫ్ చెయ్యడం గమనార్హం. 

అయితే ఈ

అంశాన్ని బీజేపీ దూరం నుంచే వేచి చూస్తోంది. ఎక్కడా ఒక్క వ్యాఖ్య కూడా మహారాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి పై ప్రస్తావన చెయ్యలేదు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam