DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నేడు మోడీ ని వ్యతిరేకిస్తున్నారు, నాడు మీ పాలనలో మీరేమి ఉద్దరించారు?

*(DNS ఇదీ రాజకీయం: Ganesh BVS, Staff Reporter, Vizag)*  

*విశాఖపట్నం, జూన్ 21, 2022 (డిఎన్ఎస్):* భారత సైనిక శక్తిని బలోపేతం చేసేందుకు, వయో శక్తి యువకులతో మరింత పటిష్ట పరిచేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వం లోని కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అగ్నిపథ్ స్కీం ను యువత నుంచి, మాజీ సైనికాధికారుల వరకూ దాదాపు గా అన్ని వర్గాలు వారూ

 సమర్ధిస్తున్నారు. ఈ పథకం ద్వారా ఉపాధి తో పాటు క్రమశిక్షణ అలవడుతుంది. 

ప్రతిపక్షాలు పూర్వాపరాలు తెలియకుండా ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రతి విషయాన్నీ గుడ్డిగా విమర్శించడం కాదు. ఒక విమర్శ చేసేముందు ప్రతి పథకాన్ని పూర్తిగా తెలుసుకోవడం సమర్ధవంతమైన పార్టీ చేపట్టవలసిన పని. 

అయితే అవగాహనా రాహిత్యమే లేక,

వీళ్ళకి ఈ పథకం ఏంటో అర్ధం కాలేదో లేక, దేశాన్ని అంతర్జాతీయ  వేదికలపై పరువు తియ్యాలనో మారె ఇతర కారణమో ప్రతిపక్షాలు, అర్బన్ నక్షల్స్, హైందవేతర వర్గాలు దూషించడం తమ జన్మహక్కు అన్నట్టుగా రోడ్డెక్కి, నానా రచ్చ చేస్తున్నారు. వీరిలో గతంలో కేంద్రంలో సుమారు గా 68 ఏళ్ళ కాలం పాటు అధికారం వెలగ బెట్టినవాళ్ళే. వాళ్ళ పరిపాలన

కాలంలో రోజుకొక స్కాం చెయ్యడం జరిగింది. ఒక్కొక్క స్కాం వందల కోట్ల రూపాయల్లో చేతులు మారినట్టు అధికారిక వర్గాలే ఘోషిస్తున్నాయి. వాటిల్లో నేటికీ విచారణ కొనసాగుతోంది. 

అధికారం చేతిలో ఉండగా ఏమి చెయ్యడం చేతగాని వాళ్ళు నేడు మోడీ పరిపాలన బాలేదు, స్కీం లు అన్ని స్కాం లు గానే తయారయ్యాయి, అంటూ దెప్పిపొడుపులు చెయ్యడం

మొదలు పెట్టాయి. అయితే ప్రధానమంత్రి ఇలాంటి తాటాకు చప్పుళ్లకు చలించే రకం కాదు కనుక అంతర్జాతీయ వేదికలపై భారత్ దేశ పు పరువు తియ్యడం కోసం, ఒక ప్రయివేట్ వ్యక్తి ఒక టీవీ ఛానెల్ లో మాట్లాడిన అంశాన్ని సాకుగా చూపించి, యావత్ ముస్లిం సమాజాన్ని రెచ్చగొట్టి, రోజుకొక ప్రాంతంలో భీభత్సం సృష్టింపచేస్తున్నారు. అయితే ఆమె చేసిన తప్పు

ఏమి లేదు. హిందూ దేవి దేవతలను అత్యంత నీచంగా బూతులు తిడుతుంటే సహించలేక, వాళ్ళ మతప్రవక్తలు చెప్పిన విషయాన్నే ఆమె ప్రశ్నించారు. భారత్ లో గొడవలు చెయ్యడం కోసమే ఎదురుచూస్తున్న పని పాటు లేని ప్రతిపక్షాలను ఈ టీవీ ఘటన ఒక పంచభక్ష్య పరమాన్నం గా కనిపించింది. ఆమె ఒక మహిళా అని గానీ, అసలు ఆమె ఏమి మాట్లాడింది, ఎందుకు మాట్లాడింది అనే

విషయం తెలుసుకోలేని నిరక్షరా మూర్ఖులు పార్టీల పేరుతొ రోడ్డెక్కి నానా రగడ చేస్తున్నారు. అయితే ఎంతో విజ్ఞత కల్గిన ఆ మహిళా, సమాజంలో గొడవలు ఎందుకు అనే భావనతో తానూ మాట్లాడిన విషయానికి క్షమాపణ చెప్పింది. అదే సమయంలో హిందూ దేవీదేవతలు కించపరిచిన ఆ మతవాదులు కూడా క్షమాపణ చెప్పాలని హిందూ సమాజం డిమాండ్ చేసింది.
అయితే గొడవలు

చెయ్యడం కోసమే రోడ్లమీద ఎదురు చూస్తున్న ప్రతి పక్షాలను ఈ టీవీ ఘటన పుష్కలంగా తిండి పెట్టింది. ఇతర దేశాలను కూడా రెచ్చగొట్టాయి ఈ ప్రతి పక్షాలు. 

అయితే ఈ గొడవ ముగిసింది అనుకునే సమయంలో మరో అంశం కోసం ప్రతిపక్షాలు కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూశాను. వీరికి మూసుకు పోయిన కళ్ళు తెరిపించేందుకు నరేంద్ర మోడీ ఒక్కో రాష్ట్రం

లోనూ పర్యటిస్తూ. ఒక్కో స్కీం ను ప్రజలకు అంకితం చేస్తున్నారు. దాని లో భాగంగానే యువతకు ఉపాధి, సైనిక శిక్షణ కోసం అగ్నిపథ్ స్కీం ను ప్రవేశ పెట్టింది.. 

దీని లక్ష్యాలు, విధి విధానాలు, ఏమీ తెలియకుండా రాజకీయ పార్టీలు గుడ్డిగా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. దీన్ని అడ్డుకునేందుకు యువతను రెచ్చగొట్టి, ప్రభుత్వ ఆస్తులు

ధ్వంసం అయ్యేందుకు పరోక్షంగా సహకరించి యువత జీవితాలతో ఆటలాడుతున్నాయి 
 
ఇప్పుడు అడ్డుకుంటున్న వాళ్ళు, రోడ్డెక్కి నిరసనలు చేస్తున్నవాళ్లు గతంలో 68 ఏళ్ళ కాలం అధికారం లో ఉండగా యువతకు ఉపాధి పథకాలను ఏమి అందించారో ప్రకటించాలని సామాన్యులు డిమాండ్ చేస్తున్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam