DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఇందిరా అధికార దాహానికి కోట్లాది ప్రజలపై  ప్రతీకారం ఫలితమే ఎమర్జెన్సీ

*అలహాబాద్ హైకోర్టు తీర్పు కు నిరసన ఫలితమే. . దేశ వ్యాప్త  ఎమర్జెన్సీ.*

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS. బ్యూరో, విశాఖపట్నం)*

*విశాఖపట్నం,  జూన్  24, 2022 (డిఎన్ఎస్):* 1975 జూన్ 25 , భారత దేశ చరిత్ర లో చీకటి లోకం. నాటి ప్రధాని ఇందిరా కేవలం తన పదవి ని కాపాడుకోవడం కోసం పదవి దాహంతో కోట్లాది మంది ప్రజల జీవితాలను

చిన్నాభిన్నం చేసి, ప్రత్యక్ష నరకం చూపించడానికి అత్యయిక పరిస్థితి  ( ఎమర్జెన్సీ ) ని ప్రవేశ పెట్టిన రోజు. 

అధికార దుర్వినియోగం చేసి, ఎంపీ ఫలితాల్లో అక్రమాలు చేసిన కారణంగా ఆమెను 6 ఏళ్ళ పాటు ఎన్నికల్లో పోటీ చెయ్యకుండా హై కోర్ట్ ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ సుప్రీం కోర్టు లో కేసు వేస్తె. . అక్కడ కూడా ఎదురు

దెబ్బ తగలడం తో రాజీనామా చెయ్యడం మానేసి, తన గుప్పెట్లో మనిషిలా ఉన్న నాటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ తో రాత్రి కి రాత్రి దేశ వ్యాప్తంగా ఎమర్జెన్సీ ప్రకటింపచేసింది. దీంతో దేశం యావత్తు అల్లకల్లోలం అయ్యింది. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకూ యే ఒక్కడికి ప్రశాంతత లేకుండా చేసిన రాక్షసిగా ప్రతిపక్షాలు

అభివర్ణించాయి. పత్రికలకు అశనిపాతంగా మారింది.   

ఎంపిక చెల్లదు అని కోర్టు తీర్పు కు నిరసనే. . .:

న్యాయస్థానం తన ఎంపీ ఎన్నిక చెల్లదు అని 1975 లో తీర్పు ఇవ్వడంతో సహించలేని నాటి  ప్రధానిగా ఉన్న ఇందిర దేశం మొత్తం అత్యయిక పరిస్థితి ( ఎమర్జెన్సీ) ని ప్రకటించారు.  దాంతో దాదాపు రెండేళ్ల కాలం పాటు దేశాన్ని

అతలాకుతలం చేసేసిన రోజు జూన్ 25. ఆ నాటి చీకటి రోజులను పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా ప్రతి ఏటా చర్చలు, సమావేశాలు జరుగుతూనే ఉన్నాయి. 

నాటి చీకటి దుర్దినా కోణాన్ని గుర్తు చేసుకుంటూ సీనియర్ పాత్రికేయులు, ప్రముఖులు ఇచ్చిన వివరణలు. .: 

అధికార దాహం కోసం మనిషి ఎంత నీచానికైనా పాల్పడతాడు అనడాని ఇందిరే

ప్రత్యక్ష నిదర్శనం అని నాటి బాధితులు తెలియచేస్తున్నారు. 

1971 రాయబరేలి లోక్ సభ ఎన్నికల్లో ఇందిరా గాంధీ చేతిలో ఓడిపోయిన రాజ్ నారాయణ్ అలహాబాద్ హైకోర్టులో ఇందిరా గాంధీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారని, ప్రభుత్వ యంత్రాంగాన్ని ఎన్నికల కోసం వినియోగించుకున్నారని కేసు దాఖలుచేశారు. నారాయణ్ తరఫున రాజకీయ

నాయకుడు, న్యాయవాది శాంతి భూషణ్ వాదించారు. ఇందిరా గాంధీ ఈ కేసు విచారణలో భాగంగా విచారణకు హాజరుకావాల్సివచ్చింది. ఓ ప్రధాని కేసు విచారణలో ప్రశ్నించబడడం అదే తొలిసారి. 

1975 జూన్ 12న అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జగ్మోహన్ లాల్ సిన్హా ప్రధాని మీద ఆరోపణలు వాస్తవమని తేలిందంటూ కేసు తీర్పునిచ్చారు. ఆమె ఎన్నిక

చెల్లదంటూ తీర్పునివ్వడమే కాక, ఆరేళ్ళపాటు ఎన్నికల్లో పోటీచేసే అవకాశాన్ని రద్దుచేశారు. దీంతో కేవలం తన స్వార్థం కోసమే ఇందిరా దేశాన్ని మొత్తం నరక కూపం లోకి నెట్టేసారన్నారు. 

ఓటర్లకు లంచాలివ్వడం, ఎన్నికల అక్రమాలు వంటి ఆరోపణలు కోర్టు లో వీగిపోయాయి, కానీ ఆమె ప్రభుత్వ యంత్రాగాన్ని తప్పుగా వినియోగించుకున్న

అంశంలో నేరస్తురాలని తేలింది. ఈ నేరాల్లో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సభలకు వేదికలు నిర్మించడం, వాటికి రాష్ట్ర విద్యుత్తు విభాగం నుంచ విద్యుత్తు వినియోగించుకోవడం, పూర్తిగా దుర్వినియోగం చేసారు. 

ఇందిరపై మరింత తీవ్రమైన ఆరోపణలు ఉన్నా అవి తొలగి వాటితో పోలిస్తే అల్పమైన ఆరోపణల వల్ల ఆమెను పదవి నుంచి

తొలగించారు. వ్యాపార, విద్యార్థి, ప్రభుత్వ ఉద్యోగ యూనియన్లు చేసిన ఆందోళనలతో దేశంలోని పలు ప్రాంతాలు స్తంభించిపోయాయి. జెపి, రాజ్ నారాయణ్, సత్యేంద్ర నారాయణ్ సిన్హా, మొరార్జీ దేశాయిల నాయకత్వంలో ఢిల్లీలో చేసిన ఆందోళనలో పార్లమెంట్ భవనం, ప్రధాని నివాసాలకు దగ్గర్లోని రోడ్లన్నీ జనసంద్రమయ్యాయి. ప్రధానికి వ్యతిరేకంగా

జస్టిస్ సిన్హా తీర్పునివ్వడానికి దాదాపు నాలుగేళ్ళు పట్టడంతో నారాయణ్ నిరంతర ప్రయత్నాలు, పట్టుదల ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందాయి.

ఇందిరా గాంధీ హైకోర్టు నిర్ణయాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానంలో సవాలుచేశారు. జస్టిస్ వి. ఆర్. కృష్ణ అయ్యర్ 1975 జూన్ 24న హైకోర్టు తీర్పును సమర్థిస్తూ, ఎంపీగా ఇందిర పొందుతున్న

అన్ని సౌకర్యాలను ఆపివేయాలని, ఓటింగు నుంచి నిరోధించాలని ఆదేశించారు. ఐతే ఆమె ప్రధానిగా కొనసాగడానికి అనుమతించారు.

కానీ భారతదేశం లో జరిగిన ఎమర్జెన్సీ వ్యతిరేక ఉద్యమం వల్ల దేశం నిరంకుశత్వ పాలనలోకి వెళ్లకుండా అప్పటి ఉద్యమకారులు, ప్రజలు నిరోదించారని తెలిపారు. 

1971 బాంగ్లాదేశ్ విమోచనతో శక్తి మంతమైన

నాయకురాలుగా ఎదిగిన ఇందిరా గాంధీ 1975 లో ఎమర్జెన్సీ విదించటానికి దారి తీసిన పరిస్థితులను వివరించారు.లోకనాయక్ జయప్రకాశ్ నారాయణ్ సంపూర్ణ క్రాంతి ఉద్యమం, ఇందిరా గాంధీ ఎన్నిక రద్దు, విద్యార్థుల ఉద్యమం, జయప్రకాశ్ నారాయణ గారి విజయవాడ పర్యటన, అత్యవసర పరిస్థితి విధింపు తదితర విషయాలు వివరించారు. 

అలాగే

ఎమర్జెన్సీ కాలం లో కొన్ని వ్యవస్థలు సక్రమంగా నడిచినట్లు జరిగిన ప్రచారాన్ని, అరెస్ట్ అయి జైలు లో ఉన్నపుడు కల్పించిన వసతులు, ఎమర్జెన్సీ ఎత్తివేయటానికి కారణమైన ఇంటలిజెన్స్ రిపోర్ట్ గూర్చి, జనతా పార్టీ ఆవిర్భావం, ఎన్నికలలో గెలుపు తదితర విషయాలను తెలిపారు. 

తన నిర్ణయాన్ని వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ

ప్రతినిధులతో సహా, కనిపించిన ప్రతి వ్యక్తినీ జైళ్ల పాలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనన్నారు. లక్షలాది మంది ఉసురు పోసుకున్న కాంగ్రెస్ పార్టీ నాటి చీకటి రోజులకు, నేటికీ దేశ ప్రజలకు క్షమాపణ చెప్పలేదన్నారు. నాడు జైలు పాలైన వారిలో పత్రికాధిపతులు, న్యాయదేశులు, ఉన్నత ఉద్యోగులు లక్షలాదిగా

ఉన్నారన్నారు. 

ఎమర్జెన్సీ డిక్లేర్ చేసింది ఇలా:. .

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సిద్ధార్థ శంకర్ రే "అంతర్గత అత్యవసర పరిస్థితి" విధించాలని ప్రధానికి ప్రతిపాదించారు. "అంతర్గత అలజడుల వల్ల భారతదేశ భద్రతకు ముప్పు పొంచి ఉంది" అని ఇందిరకు అందిన సమాచారం ఆధారంగా రాష్ట్రపతికి ప్రకటన జారీ చేయాలని

ఆయన ఒక లేఖను రూపొందించారు.


"జూన్ 25 అర్ధరాత్రి దాటినా తర్వాత నాటి ప్రధాని ఇందిరా ( తెల్లవారితే జూన్ 26 ) ఆల్ ఇండియా రేడియో స్టూడియో కు వెళ్లి అక్కడ నుండి ఈ భారత దేశంలో రాష్ట్రపతి ఎమర్జెన్సీని ప్రకటించారు. భయపడాల్సిన పనిలేదు. అని నేరుగా ప్రకటించేసారు."  

భారత రాజ్యాంగంలోని 352వ ఆర్టికల్‌ను అమలు

చేస్తూ, ఇందిరా గాంధీ తనకు అసాధారణ అధికారాలను కల్పించారు మరియు పౌర హక్కులు మరియు రాజకీయ వ్యతిరేకతపై భారీ అణిచివేతను ప్రారంభించారు.

అయితే ఇలాంటి భయంకర నిర్ణయం తీసుకునే ముందు ప్రధాని కేంద్ర క్యాబినెట్ తో చర్చించాల్సి ఉంటుంది. వాళ్లకి కూడా ఈమె రేడియో లో ప్రకటించే ముందే చెప్పడం గమనార్హం. దీన్ని

వ్యతిరేకించిన తన పార్టీ నాయకులను కూడా ఈమె జైలు పాలు చేసారు.  

రేడియో స్టూడియోకి వెళ్లే ముందు. ఎమర్జెన్సీ ప్రకటనపై రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ అంతకుముందు రాత్రి సంతకం చేయించేశారు. ప్రకటన చేసిన వెంటనే, ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ను నిలిపి వేశారు. విద్యుత్త లేని కారణంగా దీనికి

సంబంధించిన ఎటువంటి వార్త యే పత్రిక లోనూ రాకుండా ఉక్కుపాదం మోపేసారు. 

అప్పడికే దేశ వ్యాప్తంగా వివిధ అంశాలపై ఉద్యమాలు చేస్తున్న విపక్ష రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు, విద్యార్థి సంఘాలు, తదితర అన్నితరహాల ఉద్యమ కారులను, తనను ప్రశ్నించే ప్రతి ఒక్కరినీ అరెస్ట్ చేసి జైలు పాలు చేసారు.  

విజయరాజే

సింధియా, జయప్రకాష్ నారాయణ్, రాజ్ నారాయణ్, మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్, జీవత్రామ్ కృపలానీ, అటల్ బిహారీ వాజ్‌పేయి, లాల్ కృష్ణ అద్వానీ, అరుణ్ జైట్లీ, సత్యేంద్ర నారాయణ్ సిన్హా, జైపూర్ డోవజర్ రాణి గాయత్రీ దేవి మరియు ఇతర నిరసన నాయకులను వెంటనే అరెస్టు చేశారు.

పార్టీలు, సంస్థల నిషేధం:.

కొన్ని రాజకీయ

పార్టీలతో పాటు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) మరియు జమాతే ఇస్లామీ వంటి సంస్థలు నిషేధించబడ్డాయి. ఎమర్జెన్సీ సమయంలో ఆర్‌ఎస్‌ఎస్ మరియు సిక్కు సమాజం నుండి బలమైన ప్రతిఘటన కనిపించింది.

18 జనవరి 1977న, గాంధీ మార్చిలో తాజా ఎన్నికలకు పిలుపునిచ్చారు మరియు రాజకీయ ఖైదీలందరినీ విడుదల చేశారు, అయితే ఎమర్జెన్సీ

అధికారికంగా 23 మార్చి 1977న ముగిసింది. ప్రతిపక్ష జనతా ఉద్యమం యొక్క ప్రచారం భారతీయులను "ప్రజాస్వామ్యం మరియు నియంతృత్వం మధ్య ఎంచుకోవడానికి ఎన్నికలే చివరి అవకాశం అని హెచ్చరించింది. "

చారిత్రాత్మకంగా కాంగ్రెస్ కంచుకోట అయిన ఉత్తరప్రదేశ్‌లోని ఓటర్లు గాంధీకి వ్యతిరేకంగా మారారు మరియు ఆమె పార్టీ రాష్ట్రంలో

ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. అలాగే పశ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్‌ ఆల్‌టైమ్‌ కనిష్ట స్థాయికి చేరుకుంది.

Recent News

Latest Job Notifications

Panchangam - Apr 8, 2025

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam