DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అహోబిలం దర్శనానికి వెళితే అడుగడుగునా వంద కొట్టాల్సిందే.

*టోల్ గేట్ మొదలు నుంచి గుడి వరకూ కాంట్రాక్ట్ పేరిట పెచ్చుమీరిన దోపిడీ* 

*కాంట్రాక్టర్ల గుప్పెట్లో దేవాదాయ శాఖ, మండిపడ్డ విహెచ్పి నేత పూడిపెద్ది* 

*(DNS Report: Sairam CVS, Bureau Chief, Visakhapatnam)*  

*విశాఖపట్నం, జూన్ 25, 2022 (డిఎన్ఎస్):* ఆంధ్ర ప్రదేశ్ దేవాలయాలను పరిరక్షించేందుకు, భక్తులకు ఎటువంటి ఇబ్బందులు

కలుగకుండా తగు చర్యలు తీసుకోవాల్సిన దేవాదాయ శాఖ పూర్తిగా గాడి తప్పిందని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ప్రతినిధి పూడిపెద్ది శర్మ మండిపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తాము ఎన్నో దేవాలయాలను సందర్శించామని, దేవాలయంను ఉద్ధరిస్తాం అంటూ తన హయాంలోకి స్వాధీనం చేసుకున్న ఏ దేవాలయం చూసినా దేవాదాయ శాఖ పనితీరు ఘోరంగా వైఫల్యం

చెందిందన్నారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా తమ బృందం చేసిన పర్యటనలో కొన్ని దేవాలయాల్లో ఎదురైనా సంఘటనలను ఆయన వివరించారు. వాటిల్లో మొదటగా అహోబిల క్షేత్రం గురించి తెలియచేసారు.  

నంద్యాల జిల్లా, ఆర్లగడ్డ కు 25 కీమి దూరంలో ఎగువ అహోబిలం, దిగువ అహోబిలం క్షేత్రాలు రెండు ఉన్నాయి. ఈ కొండలలో తొమ్మిది నారసింహ క్షేత్రాలు

ఉన్నాయి. వాటినే నవ నారసింహ క్షేత్రాలు అని పేరు. వీటిని దర్శించుకోడానికి చాల వరకూ కాలి నడకే శరణ్యం. మరొక వర్గం లేదు. వీటిని దర్శించేందుకు ఎగువ అహోబిలం క్షేత్రం కు చేరుకోవాలి. కొండపైకి వెళ్లేందుకు ఘాట్ రోడ్డు ఉంది. 
 
అహోబిలం అత్యంత దారుణం. . .:

నంద్యాల జిల్లా లోని అహోబిలం క్షేత్రంలో ఏర్పాట్ల సంగతి సరే

సరి, ఈ ఇబ్బందులతో పాటు, అక్కడ ఆలయం నుంచి కాంట్రాక్టు లు పొందిన కాంట్రాక్టర్ల నుంచి భక్తులు నిలువు దోపిడీ కు గురవుతున్నారన్నారు. కొండ ఎక్కడంతో టోల్ గేట్ దగ్గర ఒక వాహనానికి రూ. 150 టికెట్ ( గతంలో ఇది కేవలం  రూ. 100 మాత్రమే ఉండేది).  తో బాదుడు బోణి మొదలవుతుందన్నారు. తదుపరి కొండ ఎక్కాక ప్రధాన ప్రవేశ ద్వారం నుంచి 2 కిలో మీటర్ల

దూరంలోనే వాహనాలను నిలిపి వేస్తారని, అక్కడ మరొక రూ. 100 పార్కింగ్ ఫీజు కట్టాలన్నారు. నిజానికి ఈ పార్కింగ్ స్థలం  ఎవ్వరికి కాంట్రాక్టు ఇవ్వలేదని , అయినప్పడికి ఈ ప్రాంతంలో కూడా పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్నారన్నారు. .అక్కడ నుంచి కల్యాణ కట్ట భక్తులు స్వామి కోసం తలనీలాలు సమర్పించే వేదిక ఇక్కడ దేవస్థానం టికెట్టు రూ.10

మాత్రమే ఉంటుందని, అక్కడ కేశ ఖండన చేసే వ్యక్తికీ రూ. 100 సమర్పించనిదే చెయ్యి ముందుకు కదలదన్నారు. గట్టిగా అడిగితె కాంట్రాక్టు పడుకున్నాం, ఇవ్వాల్సిందే అనే సమాధానం వస్తుందన్నారు. తదుపరి పూజ సామాగ్రి, కొబ్బరి కాయల విక్రయాల దుకాణాలు దగ్గర నోరెత్తే  అవకాశమే లేదని మండిపడ్డారు.  ఇది పూర్తిగా హిందూ సాంప్రదాయ క్షేత్రమని,

అక్కడ ము  అన్యమతస్తులకు ఏమి పని అని ప్రశ్నించారు. కొబ్బరి కాయ ఉన్న ఒక సంచి రూ. 100 , తులసి ఉన్న సంచి రూ. 100 కచ్చితంగా వసూలు చేస్తున్నారన్నారు.  ఇక్కడ అన్యమతస్తుల దోపిడీ, దౌర్జన్యం అంతా ఇంతా ఉండదన్నారు. ఎవ్వరికి చట్టాలు, కేసులు,  దేవాదాయ శాఖ అంటే లెక్కేలేదన్నారు. తాము కాంట్రాక్టు పాడుకున్నాం, నచ్చితే తీసుకో,.. లేదంటే

లేదు, ఇక్కడ బేరాలుండవు అనే గదమాయింపులు కూడా వినిపిస్తున్నాయన్నారు. వీళ్ళకి హిందూ సంప్రదాయం, దేవి దేవతలు అంటే నమ్మకం, లేదని, అలాంటప్పుడు ఇక్కడ దుకాణాలు ఎందుకు పెట్టుకున్నారని శర్మ మండిపడ్డారు.  

ఇక్కడ దేవాదాయ శాఖ పరిధి నుంచి దేవుని పేరిట దోపిడీ శాఖగా మారిపోయిందన్నారు. తక్షణం అన్యమతస్తులను ఈ కాంట్రాక్టు

పరిధి నుంచి తప్పించాలని, హిందూ దేవాలయాల పరిధిలో కేవలం హిందూ  వ్యాపారస్తులే ఉండాలని డిమాండ్ చేసారు.

ఈ దోపిడీ పై ఆలయ ఈఓ తక్షణం స్పందించి, ఈ మితిమీరిన రేట్లను కుదించాలని డిమాండ్ చేసారు. భక్తుల సేవకోసమే దేవాదాయ శాఖ ఉంది తప్ప,  దేవాదాయ శాఖ, దాని కాంట్రాక్టుల దోపిడీ కోసం భక్తులు లేరన్నారు. 

ఇది

కొండల్లో ఉన్న క్షేత్రం కనుక పావన నరసింహ క్షేత్రం దగ్గర జంతు బలి కూడా జరుగుతున్నందున భక్తులు భయపడుతున్నారని, తక్షణం వాటికి పరిష్కారం చూడాలన్నారు.

ఈ అహోబిలం క్షేత్రం లో  దేవాదాయ శాఖ పరిధిలో కాంట్రాక్టులు, దళారులు లేరని, వీళ్ళ అదుపులోనే దేవాదాయ శాఖ ఉందనే విషయం కాంట్రాక్టుల తీరు చూస్తే తెలుస్తోందన్నారు.

 తక్షణ దేవాదాయ శాఖ తన దిశా దశ మార్చుకుని భక్తులను దోపిడీ నుంచి రక్షించాలని డిమాండ్ చేసారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam