DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఒక్కణ్ణి ఎదుర్కోడానికి యావత్ యంత్రాంగాన్నే దింపారు అయినా దెబ్బతిన్నారు

*గుజరాత్ గోద్రా అల్లర్ల వెనుక కఠిన సత్యాలు ఇవే ఇదే. .: సంబిత్ పాత్ర*

*(DNS Report: Sairam CVS, Bureau Chief, Visakhapatnam)*  

*విశాఖపట్నం, జూన్ 26, 2022 (డిఎన్ఎస్):* ప్రపంచ దేశాల్లో భారత్ కు ఒక మచ్చగా కాంగ్రెస్, కమ్యూనిస్ట్ లు సృష్టించిన గుజరాత్ అల్లర్ల ప్రచారం వెనుక ఉన్న గుప్తచారుల వివరాలను భారతీయ జనతా పార్టీ  అధికార ప్రతినిధి

సంబిత్ పాత్ర ప్రకటించారు. ఆయన నిర్వహించిన విలేకరుల సమావేశంలో శనివారం ఈ ఘటనలపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా, ఈ ఘటనల వెనుక ఉన్న భయంకర చరిత్రను అయన వివరించారు. 

"ఇది అత్యంత ముఖ్యమైన ప్రెస్‌కాన్ఫరెన్స్ కాబోతోంది. ఎందుకంటే ఇందులో చాలా కఠిన సత్యాలను దేశం ముందుకు భారతజనతాపార్టీ

ప్రవేశపెట్టబోతోంది. 

ఈ కుహనా పార్టీలు, వాళ్ళ నేతలు 2002 నుంచీ గుజరాత్ అల్లర్లపై నరేంద్రమోడీ పై ఎంతగా అపవాదులేసారో, ఆరోపణలు చేసారో ప్రపంచం అంతా చూసింది.  అయితే అత్యున్నత న్యాయస్థానం లో న్యాయం గెలిచిందన్నారు. . భారతీయ సుప్రీంకోర్టు మోడీగారికి క్లీన్‌చిట్ ఇవ్వడం, భారత హోం మినిస్టర్ అమిత్‌షా వివరణ ఇవ్వడం

కూడా మనకి తెలుసు అన్నారు. 

సుప్రీంకోర్ట్ కొన్ని అబ్జర్వేషన్స్ ఇచ్చింది. అబ్జర్వేషన్లేకాకుండా లిఖితపూర్వక తీర్పునిచ్చింది. వాటిల్లో కొన్నింటిని మీ ముందుపెడుతున్నా. 

ఎందుకంటే ఈరోజు న్యూస్ లో కొంతమందిని అరెస్ట్ చేసారని చెప్పారు. తీస్తా సితల్వాదీ, వగైరాలని అరెస్ట్ చేసారు. వాళ్ళెందుకు

అరెస్ట్ చేయబడ్డారో, వాళ్ళ వెనుక ఏ విధమైన యంత్రాంగం పనిచేసిందో, వీటన్నిటినీ ఇక్కడున్న సాఖ్యాధారాల పత్రాలతోపాటు మీముందు భారతీయజనతాపార్టీ పెట్టబోతోంది.

భారతదేశపు అత్యున్నత న్యాయస్థానం చిప్పిన అంశం ఇదే:  16ఏళ్ళుగా ఈ కేసుయొక్క వేడిని తగ్గించకుండా ఉంచడానికి దీనివెనుక యంత్రాంగం నడిచింది. వాళ్ళందరినీ

చట్టం ముందుకు తీసుకురావాల్సి ఉందన్నారు. అంటే, ఇంతకాలం వాళ్ళు చేసినదంతా చేసి తప్పించుకోలేరు, వాళ్ళ ఖర్మఫలం అనుభవించడానికి ఈ దేశ చట్టాల ప్రకారం శిక్ష అనుభవించక తప్పదన్నారు.

సాక్షులు, ఫిర్యాదు దారులు ఈ అంశంలో  వాళ్ళకు చేస్తున్నది ఏమిటో తెలిసే గుజరాత్‌లోని కొందరు ప్రభుత్వాధికారులు, తీస్తా సితల్వాద్

లాంటివాళ్ళూ కలిసి ఒక కట్టుకధని రచించారని న్యాయస్థానం తెలిపిందన్నారు.

తీస్తా సితల్వాద్ పేరుని చెబుతూ సుప్రీం కోర్టు తీర్పులో ఇంకా ఏమి చెప్పిందంటే, " బాధితుల మనోభావాలను ఉపయోగించుకొంటూ ఇన్నేళ్ళపాటుగా తీస్తా సితల్వాద్ ఎలాంటి ప్రణాళికని రచించిందో తెలుసుకోవాల్సిన అవసరముంది." ఆ తెలుసుకొనే సరళిలోనే

చాలా ప్రశ్నలకు సమాధానాలుగా దేశం ముందుకు మేము కొన్ని పత్రాలని తీసుకురాబోతున్నాము. నాదగ్గర అనేక  పత్రాలున్నాయి. సమయాభావంచే అన్నీ చదివి వినిపించలేను. కానీ తీస్తా సితల్వాద్ & కంపెనీ ఎలా గుజరాత్ అల్లర్లని వాడుకొంటూ రెచ్చగొట్టే కుట్రలు చేసారో కొన్ని ఇప్పుడు చెప్పబోతున్నాను.

జాకియా జాఫ్రీ ఎవరి ఆదేశాలపై

పనిచేసేదో, ఆవిడకి డిక్టేషన్ ఎవరిచ్చారో, జాకియాజాఫ్రీయే కాకుండా అలాంటి చాలామంది సాక్షులున్నారో వాళ్ళకి గుజరాత్ అల్లర్లపై ట్యూషన్, డిక్టేషన్ తీస్తా సెతల్వాద్ నడిపే NGO చేసేది. 

తీస్తా గురించి కొన్ని ఆశ్చర్యకరమైన సత్యాలు : 

కౌసర్ భాను పేరు వినే ఉంటారు. కౌసర్ బాను అనే ఆవిడ విషయంలో ఒక కట్టుకధ

సృష్టించారన్నారు. ఆవిడ గర్భవతి అని, ఆవిడ పొట్టని కత్తితో చీల్చి కడుపులో ఉన్న శిసువుని, ఆమెనీ చంపారని. ఈ కట్టుకధ తీస్తా సెతల్వాద్ రాసింది.  పోస్ట్ మార్టంలో అది అబద్ధమని, అవ్విడ కాలినగాయాలతో మృతి చెందిందని తేలిందన్నారు. 

అలాగే, నరోదా గాఁవ్ కేసులో ఉన్న నానుమియ మాలిక్  స్పష్ఠంగా చెప్పాడు. మదీనా అనే

స్త్రీని గ్యాంగ్ రేప్ చేసారు అనేది పూర్తిగా అవాస్తవమని, అది తీస్తా సెతల్వాద్ అల్లిన కట్టుకధ అని సిట్  ముందు ఒప్పుకున్నాడన్నారు.  మదీనా కూడా తనపై మానభంగం జరగడం అవాస్తవస్తవమని విచారణలో అంగీకరించింది. ఇదే విషయాన్ని ప్రముఖ న్యూస్ ఏజెన్సీ వార్తాపత్రికలో కూడా వచ్చిందన్నారు. 

అదే విధంగా బెస్ట్ బేకరీ

కేసులో యాసిన్ బానూ షేక్ అనే ప్రధాన సాక్షి 2010లో ముంబాయ్ కోర్టు చీఫ్ జస్టిస్ కి రాసిచ్చిన ఎఫిడవిట్లో స్పష్ఠంగా రాసింది తీస్తా సెతల్వాద్ తనతో బలవంతంగా అబద్ధపు సాక్ష్యం చెప్పించిందనీ, డబ్బుని ఎరవేసిందనీ, తనని మిస్‌గైడ్ చేసి అబద్ధపు సాక్ష్యాన్ని తీసుకుందని కోర్టు లోనే ప్రకటించిందన్నారు.

ఈ సాక్షులకు

అబద్ధపు కధల్ని నేర్పేపని తీస్తా సెతల్వాద్ & కంపెనీ చేసింది. అలాగే, వడోదరకి చెందిన చేతన్ కుమార్ గోర్ కూడా కంప్లెయింటిచ్చాడు తనతోకూడా అబద్ధం చెప్పించారని తెలిపారన్నారు. 

ఒక ప్రసిద్ధ కేసు రియాజ్ ఖాన్ పఠాన్ మీకందరికీ తెలుసిందే.  రియాజ్ ఖాన్ పఠాన్ ఒకప్పుడు తీస్త సెతల్వాద్ కింద ఆవిడ NGOలో పనిచేసేవాడు. అతను

2010లో అహ్మదాబాద్ పోలీస్ కమీషనర్‌కి ఒక కంప్లెయింట్ రాసిచ్చారు. అందులో అతను చెప్పిందనేమిటంటే, సుప్రీంకోర్టుకు మరియూ ఇతరకోర్టులకూ సమర్పించబడ్డ దాదాపు అన్ని ఎఫిడవిట్లూ సాక్షుల తరఫున తీస్తా సెతల్వాద్ తయారు చేసినవే. ఆవిడ సాక్షులచేత సంతకాలు తీసుకొని కట్టుకధ సృష్టించి తనకు నోటరీ చేయించడానికి పంపి ఎఫిడవిట్లు

తయారుచేసేదని, బాధితులకు ఆ ఎఫిడవిట్ యొక్క ఒక్క కాపీనికూడా ఇవ్వకపోవడంద్వారా సాక్షులకు ఎఫిడవిట్లో ఏముందో తెలుసుకోకుండా జాగ్రత్తపడిందని కంప్లెయింట్ లో రాసాడు.   

జాహిద్ ఖాద్రి కేస్.. ముస్లిం సమాజంలో ఒక ప్రముఖ వ్యక్తి కొడుకు హత్య అల్లర్లలో జరిగింది. దురదృష్టకరం అది. జాహిద్ ఖాద్రి స్వయంగా రాసిచ్చిన

కంప్లెయింట్‌లో తీస్తా సెతల్వాద్ ఎలా తన NGOని ఉపయోగించి పేద ముస్లీంస్‌ని మతం పేరుతో రెచ్చగొట్టి వారి వద్ద అల్లర్లపేరు చెప్పి అబద్ధాలు నూరిపోసి ఆ పేద ముస్లీంవద్ద ఎలా డబ్బు వసూల్ చేసిందో వివరించాడు. 

ఇప్పుడు.. మీకు ఆశ్చర్యమేస్తుంది ఇది తెలుసుకొంటే. సాక్షుల్ని మిస్‌గైడ్ చేస్తూ, వాళ్ళకు తెలీకుండానే

ఎఫిడవిట్స్ సబ్‌మిట్ చేస్తూ న్యాయవ్యవస్థని మోసం చేస్తూ వచ్చింది కేవలం తీస్తా సెతెల్వాద్ యొక్క 
ఎన్ జి ఓ మాత్రమే కాదు, ఇంకో సంస్థ కూడా ఉంది. 

తీస్తా సెతల్వాద్‌కి, ఆవిడ భర్త జావేద్‌కి రెండు ఎన్ జి ఓ లు కూడా ఉన్నాయి. ఒకదానిపేరు సిటిజన్ ఫర్ జస్టిస్ & పీస్. ఇంకో దానిపేరు సబరంగ్ ట్రస్ట్. వీటి ద్వారా

వాళ్ళెంత పెద్ద కుట్ర చేశారో తెలిస్తే షాక్ తింటారు. 
( సంబిత్‌ పాత్రా పత్రికా సమావేశంలో డాక్యుమెంట్ ను చూపించడం జరిగింది.) 

క్రిమినల్ మిస్లేనియస్ అప్లికేషన్ 2014లో అహ్మదాబాద్ హైకోర్ట్ కేసులో హై కోర్ట్ ఏమందంటే.. 

" పేద, అవసరార్ధులకి చెందాల్సిన సొమ్ముని తమ భౌతిక సుఖాలకోసమై భారీగా

ఖర్చుచేస్తూ వైన్, షూస్, హాలిడేస్ రిసార్ట్స్, ఎయిర్‌టీకెట్స్ వగైరాలు కొన్నారు." 
ఇందులో పిటిషనర్ # 1 అంటే తీస్తా సెతల్వాద్, పిటిషనర్ # 2 అంటే జావేద్. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అందిన సమాచారం ప్రకారం భారీగా పిటీషనర్ #2 అంటే జావేద్ ఎలా ఖర్చుపెట్టాడంటే.. షాపింగ్, ఎంటర్టైన్మెంట్, ఫారెన్ గూడ్స్ కొనుగోలు,  ఇంటి

అవసరాలు, హెయిర్ సెలూన్ ఖర్చు, మోనా లక్కీ స్టోన్స్, రిలయెన్స్ ఫ్రెష్, డ్యూటీ స్టొర్స్, కాటేజ్ ఇండస్ట్రీస్, రాయల్ ఫ్యాషన్ కార్నర్, మందులూ, కేకులూ, జెనీవా కంపెనీ షూలు వగైరాలు కొనుగోలుకు కోట్లు కుమ్మరించారు.

అంటే, కోటాను కోట్ల రూపాయలు పేద ముస్లీంస్ కోసమని వసూల్ చేసిన సొమ్ముతో విలాసాలూ, వినోదాలకూ, బౌతిక సుఖాలకూ

ఖర్చు చేసారు. ఇది మేము చెప్పట్లేదు. కోర్టు చెబుతోంది. పేరాగ్రాఫ్ #8, పేజ్ # 37లో హైకోర్ట్ చెప్పింది. " 13మంది బాధితుల సాక్యలని స్పష్టంగా రికార్డ్ చేశిన దాని ప్రకారం వాళ్ళకి ఒక్క రూపాయి కూడా వారికి రాలేదన్నారు. ఆర్ధిక సాయం లభించలేదు, పునరావాసంకోసం కోసం వెచ్చింపబడలేదు. మ్యూజియం కట్టడానికోసం

వినియోగింపబడలేదన్నారు.

ఇక్కడ మ్యూజియం విషయమేమిటంటే, వీళ్ళు మ్యూజియం కడతామని గుల్బర్గ్ సొసైటీ ద్వారా కూడా వీళ్ళిద్దరూ భారీగా సొమ్ములు వసూల్ చేసారు. ఆ డబ్బుతో గుల్బర్గ్ సొసైటీ ప్రజలకు మ్యూజియం కట్టారా, ఒక్క రూపాయైనా వాళ్ళకిచ్చారా  అంటే లేదన్నారు.

కోర్టు చెప్పినదాంట్లో ఇంకా ఇలా కొనసాగింది.. "

విచారణల్లో వెలికితీయబడ్డదేమిటంటే, ఆ వసూల్ చేసిన సొమ్ముని గుజరాత్ అల్లర్లకు సంబంధించిన ఇంటర్వ్యూలు పబ్లికేషన్ చేయడానికీ, ఫోటోగ్రాఫ్స్‌కీ, ఆర్టికల్స్‌కీ ఖర్చు చేశారన్నారు.  ప్రత్యేకంగా 2008లో జరిగిన భారీ కేంపెయిన్ తరువాతనుంచీ గుల్బర్గ్ సొసైటీకోసం మ్యూజియం కట్టడానికై కలెక్ట్ చేసిన కోట్లాది రూపాయల సొమ్ములులో

44% సబరన్ ట్రస్ట్‌లోకి, 35% పర్సనల్ ఎకౌంట్లోకి ట్రాన్స్ఫర్ కాబడ్డాయి." అంటే, పేదల వద్ద వసూల్ చేసిన డబ్బు పర్సనల్ ఎకౌంట్స్ లోకి పోయిందన్నారు. 
  
2010 నుంచీ 2013కి మధ్య సోనియాగాంధీ చెప్పడం వల్ల ఈ సబరంగ్ ట్రస్ట్‌కి యు పి ఏ  సర్కార్ ద్వారా హెచ్ ఆర్ డి  మంత్రిత్వశాఖ దాదాపుగా కోటీ నలభై లక్షలు ఇచ్చింది చదువులకోసం అనే

పేరుతో. ఐతే మీకు ఇక్కడ ఆశ్చర్యం కలిగిస్తుంది ఒక విషయం. ఏదైతే సొమ్ము సోనియాగాంధీ ఇప్పించిందో అది చదువులకోసం వెచ్చించకుండా తీస్తా సెతల్వాద్ ఆ సొమ్ముతో మోడీగారికి వ్యతిరేకంగా పాంప్లెట్లు పంచడానికీ, భారతదేశానికి చెడ్డపేరు తీసుకురావడానికీ ఖర్చుచేసింది. అది కూడా చదివి వినిపిస్తా. పాకిస్తాన్ కూడా వెళ్ళారు ఆ

డబ్బులతో. పాకిస్తాన్ వెళ్ళి అక్కడ భారతదేశానికి చెడ్డపేరు తెచ్చేందుకు పనిచేసారన్నారు. 

కోర్ట్ చివర్లో ఏమందంటే, జడ్జ్ గారు చెప్పారిలా.. " నేను మొత్తం మెటీరీల్స్, రికార్డ్స్ పరిశీలించాను. నాకు చాలా షాకింగ్ అనిపించిందీ ఏమిటంటే.. పేదల దగ్గర వసూల్ చేసిన సొమ్ము పేదలకీ, అవసరార్ధులకీ ఖర్చు చేయకుండా స్వంత

అవసరాలకీ, విలాసాలకీ ఖర్చుచేయడం బాధాకరం అని కోర్టు తెలపడం గమనార్హం అన్నారు. 

చాలా దస్త్రాలు ఉన్నాయని, 20ఏళ్ళనుంచీ ఈ సత్యాలన్నీ పోగవుతూ వస్తున్నాయన్నారు. షాకింగ్ విషయం ఇంకోటేంటంటే, తీస్తా సెతల్వాద్ ఒంటరిగా చేయలేదు ఇవన్నీ. వెనుకనున్న చోదకశక్తి ఎవరో తెలుసా ? ఎవరు ఇదంతా నడిపించారో తెలుసా ? న్యాయవ్యవస్థని

దుర్వినియోగపరచడానికి ప్రయత్నించిన వీళ్ళందరూ, ఇంతపెద్ద కుట్రలకి ప్లాన్ చేసిన వీళ్ళందరూ, సుప్రీంకోర్టుచే నిన్న వ్యాఖ్యానింపబడ్డ వీళ్ళందరూ వెనుకనుంచి ఒక చోదకశక్తి ద్వారా నడపబడ్డారు. 


ఇంట పెద్ద కుట్రను ఏ ఒక్కరో, ఇద్దరో చెయ్యడం అసంభవం అన్నారు. వీళ్ళని నడిపించిన చోదక శక్తి ఆ చోదకశక్తే సోనియా గాంధీ , ఆమె

పరిధిలోని కాంగ్రెస్ పార్టీ అన్నారు. 

ఈ పేరు ఎందుకు చెబుతున్నామంటే, సోనియా గాంధీ తయారు చేసిన NAC ( నేషనల్ ఎడ్వైజరీ కౌన్సిల్ ) అనే ఉందో రాజ్యాంగేతర సంఘం ఉందో అందులో సభ్యురాలే తీస్తా సెతల్వాద్. తీస్తా సెతెల్వాద్ కు సోనియాగాంధీ ఇచ్చిన ప్రత్యేక అసైన్మెంట్ ఏంటంటే ని. అదేంటంటే, మతహింస నిరోధక బిల్ డ్రాఫ్ట్

తయారుచేసిపెట్టమని. ఇన్నికోట్ల స్కేం, ఇంత పెద్ద కుట్ర ఒక కుటుంబం అండ, వాళ్ళచే నడిపింపబడ్డ ప్రభుత్వపు అండ లేకుండానే జరుగుతాయనుకొన్నారా ? అసంభవం అని సంబిత్ అన్నారు. 

ఈ విచారణల్లో గుజరాత్ రాష్ట్రం యొక్క D.G.గా పనిచేసిన R.B. శివ కుమార్ పేరుకూడా వచ్చింది. కొంతకాలం క్రితం సుప్రీంకోర్టులో సంచలనాత్మకమైన ప్రముఖ కేసు

నడిచింది. దేశం కోసం పనిచేసిన ఇస్రో మాజీ సైంటిస్ట్ నంబి నారాయణన్ వెనుక భారీ కుట్ర రచించి ఆయన్ని ఇరికించిన పధక రచనంతా ఈ R.B. షివ్‌కుమార్‌దే. సుప్రీంకోర్ట్ దీనిపై కూడా వ్యాఖ్యానించి ఈ R.B.శివ్‌కుమార్‌ని తనముందు ప్రవేశపెట్టమన్నది. 

ఇలాంటి కుట్రలు గుజరాత్‌ పైనే కాదు, భారతదేశంలో ప్రతీచోటా జరుగుతున్నాయి.

అదే విధంగా ఈ గుజరాత్ అల్లర్లపై భారత అత్యున్నత న్యాయస్థానం ఎవరినైతే గుజరాత్ అల్లర్లవేడి చల్లారకుండా కుట్రచేశారని వ్యాఖ్యానించిందో ఆ కుట్రదారులందరూ కూడా కోర్టుముందుకు రాక తప్పదు, భారతీయ చట్టాలు న్యాయవ్యవస్థ పవరేంటో చవిచూడకా తప్పదన్నారు. 

ఇంతమంది నరరూప రాక్షసుల కుట్ర ల వల్ల నరేంద్రమోడీ ని

ప్రజాజీవితంలోని ఇరవయ్యేళ్ళ పాటు చేయని నేరానికి దోషిగా చూసారు.  ఆయన్ని అసత్యారోపణల్లో ఇరికించడానికి, బెదిరించడానికి, భయపెట్టడానికి వాళ్ళు శ్రమించారు. ఐతే, ఒక్క క్షణమైనా నరేంద్రమోడీ అదరలేదు, బెదరలేదు. వారికి సంపూర్ణ విశ్వాముంది వ్యవస్థపై, సంపూర్ణ విశ్వాసముంచారు న్యాయ వ్యవస్థపై.  

ఆయన్ని S.I.T.

విచారిస్తున్నప్పుడు ఒక్కసారికూడా తన కార్యకర్తలను విచారణ జరుగుతున్న కార్యాలయం బయట టైర్లు తగలెట్టమని, ఆందోళణలూ, అల్లర్లు చేయమని పిలుపునీయలేదు. ఆయన విచారణకు ఒంటరిగానే వెళ్లారని, వ్యక్తితగా సహాయకులు గాని, పార్టీ నేతలు గానీ ఎవ్వరూ లేరని, అయన నిజాయితీ ఆయనకు తెలుసు కనుక ఏంటో ధైర్యంగా విచారణకు వెళ్లారన్నారు.

  

చివరగా విపక్ష పార్టీలకు ఒకే విషయం చెబితామని, సత్యం ఎప్పటికైనా బయటపడక, ఎదురుపడక తప్పదు. సత్యాన్ని దాచలేరు, సత్యాన్ని చెరపలేరు, సత్యాన్ని బెదిరించలేరన్నారు. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam