DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దేశ పటిష్టత కోసం ఆర్ ఎస్ ఎస్ బలోపేతం కావాలి : RSS చీఫ్ మోహన్ భగవత్ 

వైభవంగా సాగిన ఆర్ ఎస్ ఎస్ మహా నగర్ సాంఘిక్

విశాఖపట్నం, ఆగస్టు 11 , 2018 (DNS Online ): భారత దేశం పటిష్టం గా ఉండాలి అంటే రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ (ఆర్ ఎస్ ఎస్ ) మరింత

పటిష్టంగా బలోపేతం కావాలని ఆర్ ఎస్ ఎస్ సర్ సంఘ్ చాలక్ ( చీఫ్ ) మోహన్ భగవత్ పిలుపునిచ్చారు. శనివారం విశాఖపట్నం నగరం నడిబొడ్డులో ఉన్న సిరిపురం లో గల గురజాడ

కళాక్షేత్రం లో నిర్వహించిన ఆర్ ఎస్ ఎస్ మహా నగర్ సాంఘిక్ కార్యక్రమానికి అయన ముఖ్య అతిధిగా విచ్చేసారు. ఈ సందర్బంగా ఈ సాంఘిక్ సమావేశం లో పాల్గొన్న వందలాది మంది

ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలనుద్దేశించి ఉత్తేజిత ప్రసంగం చేశారు. ఆద్యంతం నిశ్శబ్దం గా సాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత దేశం పటిష్టంగా ఉండాలి అంటే దేశ

హితాన్ని కోరుకునే వారి సంఖ్యా అధికంగా ఉండాలి అన్నారు. హిందుత్వ, హిందూవాదం ఈ దేశంలో కొనసాగడానికి ఆర్ ఎస్ ఎస్, ఇతర సంఘ్ పరివార్ కుటుంబాలు మరింత బలోపేతం కావాలి

అని పిలుపునిచ్చారు. దేశాన్ని సక్రమ మార్గంలో తీసుకువెళ్లాలి అంటే సమాజ హితాన్ని నిత్యం కోరుకునే సంఘ్ పరివార్ మరింత శక్తివంతం కావాలన్నారు. ఈ దేశం లో

ఎక్కడికైనా ప్రజలకు ఆపద వచ్చింది అంటే ముందుగా వారిని రక్షించేందుకు వచ్చేవారు ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలేనన్నారు. దీనికి నిదర్శనం ఎన్నో తుఫాన్లు, కరువు కాటకాలు,

యుద్ధ వాతావరణాల్లోనూ ప్రజలకు సన్నిహితంగా ఉంటూ, వారికి తగిన సహాయాన్ని అందిస్తున్నామన్నారు. ప్రస్తుతం కేరళ లో వేస్తున్న వరదలలో ప్రజలకు సహాయం అందించేందుకు

ఎందరో ఆర్ ఎస్ ఎస్ కార్యకర్తలు సేవా విధుల్లో ఉన్నారన్నారు. 

అత్యంత పటిష్టంగా జరిగిన ఈ కార్యక్రమం లో పాల్గొనేందుకు సైతం చాలా నిబంధనలు అమలు చేశారు. పది

రోజుల శాఖ శిక్షణ పొందిన వారికి, à°’à°• గుర్తింపు కార్డు ఇచ్చారు, వీరు విధిగా à°† కార్దు ఉండాలని సూచించారు. à°ˆ ధ్రువ పత్రం ఉన్నప్పటికీ  à°¤à°²à°ªà±ˆ టోపీ, తెల్లని చొక్కా,

కాఫీపొడుం రంగు ఫాంట్, బూటు ధరించిన వారిని మాత్రమే సభ ప్రాంగణం లోకి అనుమతించారు. సుమారు 1400 మంది సుక్షితులైన కార్యకర్తలతో గురజాడ కళాక్షేత్రం ప్రాంగణం

సుందరంగా మారిపోయింది. నాలుగురోజుల నగర పర్యటనకు వచ్చిన మోహన్ భగవత్ శుక్రవారం సాయంత్రం à°…à°–à°¿à°² భారత విద్యార్థి పరిషత్  ( ఏబీవీపీ) స్తానిక భవనం ప్రేరణ ను

ప్రారంభించారు. ఈ నాలుగు రోజుల్లో ఎందరో నగర ప్రముఖులు ఆయనను కలిశారు. శనివారం సాయంత్రం భగవత్ ను కలిసిన వారిలో ఆంధ్ర విశ్వ కళాపరిషత్ ఉపకులపతి డాక్టర్ జి.

నాగేశ్వర రావు, సెంచూరియన్ విశ్వ విద్యాలయం ఉపకులపతి డాక్టర్ జి ఎస్ ఎన్ రాజు తదితరులున్నారు. 

 

 

#dns  #dns news  #dnsnews  #dns live  #dnslive  #dnsmedia  #dns media  #RSS  #rastriya swayam sevak  #ABVP  #mohan bhagavat  #vizag  #visakhapatnam  #mahanagar sanghik  #shakha

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam