DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దేవేంద్ర మంత్రాంగం ముందు అందరూ బోల్తా, మహా సీఎం గా షిండే 

*(DNS Report: Sairam CVS, Bureau Chief, Visakhapatnam)*  

*విశాఖపట్నం, జూన్ 30, 2022 (డిఎన్ఎస్):* మహారాష్ట్ర సీఎంగా ఏక్ నాధ్ షిండే ప్రమాణ స్వీకారం చేస్తారు అని మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ప్రకటన చేయడంతో మొత్తం రాజకీయ విస్లషకులు, మీడియా. ప్రతిపక్షాలు అందరూ షాక్ కు గురయ్యారు. దేవేంద్ర మంత్రాంగం ముందు అందరూ బోల్తా పడ్డారు. 

గత

వారం రోజులుగా మహారాష్ట్ర రాజకీయాల్లో జరుగుతున్నా ఉత్కంఠ కు సూపర్ ట్విస్ట్ లతో బ్రేక్ పడింది. శివసేన నేత  ఏక్ నాధ్ షిండే తన 49 మద్దతు దార్లతో మహారాష్ట్ర నుంచి ఇతర రాష్ట్రాల్లో తలదాచుకుని గురువారం ముంబై కు తిరిగి వచ్చారు.  ఈ వారం రోజుల పాటు జరిగిన హంగామా చూసిన ప్రతి ఒక్కరూ బీజేపీ మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్

తిరిగి మరోసారి ముఖ్యమంత్రి అవుతారని, షిండే ఉప ముఖ్యమంత్రి అవుతారని అంటా ఊహించారు. అయితే గురువారం దేవేంద్ర ఫడ్నవిస్, షిండే లు కలిసి సంయుక్తంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో మొత్తం  దేశ రాజకీయాలకు షాక్ ఇచ్చే ట్విస్ట్ ఇచ్చారు దేవేంద్ర ఫడ్నవిస్. 

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్ నాధ్ షిండే మాత్రమే

గురువారం రాత్రి ప్రమాణ స్వీకారం చేస్తారని, ఆయనకు  బయట నుంచి బీజేపీ మద్దతు ప్రకటిస్తుందన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam