DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కమిషనర్ గారూ ప్లాస్టిక్ బ్యాన్ రూల్స్ ప్రజలకేనా? నాయకులకు కాదా?

మొదటి రోజే బ్యాన్ చేసిన సింగల్ యూజ్ బ్యానర్లతో నిండిన విశాఖ వీధులు 

(DNS Report: ఇదీ రాజకీయం , Satya Ganesh BVS, Visakhapatnam)  

*విశాఖపట్నం, జులై 01, 2022 (డిఎన్ఎస్):* సింగల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తులను దేశ వ్యాప్తంగా జూలియా 1 నుంచి నిషేధం విధించిన విషయం తెలిసిందే. దీనిపై ప్రజల్లో ఆవగాహన కల్పించేందుకు మహా విశాఖనగరం

మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రతి రోజూ వీధి వీధిలోనూ తిరుగుతున్నారు. ప్రతి ఒక్కరిని కలిసి, ప్లాస్టిక్ వినియోగం ఎంత ప్రమాదకరమో వివరిస్తున్నారు. ప్రతి రైతు బజార్ లోనూ తిరుగుతూ వ్యాపారులను, ఖాతాదారులను కలిసి పాలిథిన్ సంచిలా బదులుగా గుడ్డ సంచీ వాడవలసిందిగా సూచిస్తున్నారు. ఈయన ఇంత కష్ట పడుతుంటే. . . ఈయన పరిధిలోనే

ఉన్న జివిఎంసి నగర పాలక సంస్థ పాలక మండలి సభ్యులు మాత్రం దీన్ని ఏమాత్రం పట్టించుకున్న దాఖలాలు కనపడడం లేదు. ఈ రూల్స్ మాకు కాదు, కేవలం ప్రజలు మాత్రమే అనే విధంగా ఉన్నట్టుగా ఉన్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

కేంద్ర ప్రభుత్వ్గం నిషేధించిన సింగల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల్లో పాలిథిన్ సంచీలతో పాటు,

ఆహ్వాన బ్యానర్లు కూడా ఉన్నాయి. ఈ నిషేధం జులై 1 నుంచి అమలులోకి వచ్చింది. విశాఖ నగరంలోని అత్యంత రద్దీ కూడలి సీతమ్మధార - హెచ్ బి కొలని వెళ్లే రోడ్డు మొత్తం ఒక దుకాణం ప్రారంభోత్సవం సందర్భంగా ఆహ్వాన బ్యానర్లతో నింపేశారు. దీనిపై నగర మేయర్ పేరిట బ్యానర్లు, ఎమ్మెల్సీ పేరిట బ్యానర్లు, సహా ఇతర కార్పొరేటర్లు, అధికార పార్టీ

ప్రతినిధులతో ఉన్న ఆహ్వాన బ్యానర్లు నింపేశారు. భారీ బ్యానర్ ఫ్లెక్సీ లను అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గరే రోడ్డు మీదే పెట్టేసారు. ఇక్కడే పోలిసి చెక్ పోస్ట్ కూడా ఉండడం గమనార్హం.  

ఇదే సమయంలో సింగల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తులు వాడవద్దు, వాడితే కఠిన చర్యలు తీసుకుంటాం అంటూ ప్రభుత్వ హెచ్చరికలు జారీ

చేస్తున్న ప్రచారం కూడా జరుగుతోంది. మరోప్రక్క నగర మేయర్ సహా ఇతర ప్రజా ప్రతినిధుల పేరిట బ్యానర్లు రోడ్డు మీద కట్టడం పై ప్రజలు మండిపడుతున్నారు. ప్రభుత్వం విధించిన నిషేధం కేవలం ప్రజలకు మాత్రమే వర్తిస్తాయా, ప్రజా ప్రతినిధులు, ఇతర పెద్దలకు వర్తించవా అని ప్రశ్నిస్తున్నారు. 

ఈ బ్యానర్లు ప్రజా ప్రతినిధులకు

తెలిసి ముద్రించి ఉండక పోవచ్చు. అయితే వీటిపై ప్రభుత్వం నిషేధం విధించినప్పుడు నిర్వాహకులను హెచ్చరించవలసిన భాద్యత వీళ్లపై ఉంది.  

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam