DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దేవాదాయ శాఖా నిర్లక్ష్యానికి  నిదర్శనం దాసన్న పేట దేవాలయం 

*(DNS Report: Sairam CVS, Bureau Chief, Visakhapatnam)*  

*విశాఖపట్నం, జులై 02, 2022 (డిఎన్ఎస్):* దేవుని పేరిట దేవాలయాలకు భక్తులు ఇస్తున్న విరాళాలను స్వాహా చెయ్యడమే తమ హక్కుగా పెట్టుకున్న దేవాదాయ శాఖా నిర్లక్ష్యానికి ప్రత్యక్ష నిదర్శనం విజయనగరం లోని దాసన్న పేట జగన్నాధ స్వామి దేవాలయం. శుక్రవారం జరిగిన రథయాత్ర లో జరిగిన మహా అపచారం పై విశ్వ

హిందూ పరిషత్ విశాఖ ప్రాంత సంయుక్త కార్యదర్శి పూడిపెద్ది శర్మ, హైందవ శక్తి అధ్యక్షురాలు విజయ లక్ష్మి లు దేవాదాయ శాఖపై మండిపడుతున్నారు. వివరాల్లోకి వెళితే. . . 

శుక్రవారం ఆషాఢ శుద్ధ విదియ రోజున దేశ, విదేశాల్లో ఎంతో వైభవంగా నిర్వహించిన రథయాత్ర జరిగితే. . .ఈ దాసన్న పేట జగన్నాధ స్వామి ఆలయంలో మాత్రం రధాన్ని

మూలాన పెట్టేసి, ఒక డిసిఎం ట్రక్ ల్లో స్వామిని పెట్టి ఒక ట్రిప్ వేసేసారు. ఇది పూర్తిగా దేవాదాయ శాఖా నిర్లక్షానికి, బాధ్యతారాహిత్యానికి నిదర్శనం అన్నారు. 
ఈ ఆలయంలో రధం చక్రాలు విరిగి పోయి, ఇరుసుకు ముక్కలైపోయి, రధం ముందు భాగం పుచ్చ్చి పోయి ఉండి ముక్కలు గా రధం నుంచి విడిపోయింది.  

రధం లో పెట్టవలసిన

విగ్రహాలను ఒక షామియానా వేసి, టెంట్ లో పెట్టడం బాధాకరం అన్నారు. విగ్రహాలను ఊరేగింపు కోసం ఒక డిసిఎం వ్యాన్ ను పెట్టి, రథయాత్ర లేకుండా ఉత్సవాలు కానిచ్చేద్దాం అనుకున్నారు. అయితే భక్తులు నిలదియ్యడంతో ఈ అపచారం బయటకు వచ్చింది. 

ఏడాదికి రూ.4 లక్షల ఆదాయం వస్తున్నా ఈ ఆలయంలో ఏడాదికి జరిగేది ఒక్క ఉత్సవం. అది కూడా

రధోత్సవం. కనీసం ఈ ఒక్కరోజైనా ఈ ఆలయం లో రధాన్ని సిద్ధం చెయ్యలేక పోవడం దేవాదాయ శాఖా బేఖాతరు తనమేనన్నారు. ఆలయానికి ఆదాయం ఉన్నా లేకున్నా అదే ఆలయం పై పడి ఏడాది గా ఆదాయం తింటున్నప్పుడు ఏడాది లో ఒక్కరోజు ఉత్సవం చెయ్యడానికి వీళ్ళకి చేతులు రాలేదన్నారు. 

ఈ ఆలయానికి సంబంధించిన ఇద్దరు సహాయ కమిషనర్లు వి ఎస్ ఎన్

కిషోర్ కుమార్, వినోద్ కుమార్ లు  భాద్యత వహించాల్సి ఉందన్నారు. ఈ ఆలయానికి ఆదాయం లేనప్పుడు దీన్ని దేవాదాయ శాఖా తన పరిధిలోకి ఎందుకు తీసుకుంది. హుండీ లో వచ్చే ఈమాత్రం ఆదాయాన్ని కూడా స్వాహా చెయ్యడానికేనా అని ప్రశ్నిస్తున్నారు. 
 
ఈ ఆలయం పై పర్యవేక్షణ ఇద్దరు సహాయ కమిషనర్లకు అప్పగించారన్నారు. ఒకరు వి ఎస్ ఎన్

కిషోర్ కుమార్ ఇక్కడ ఈఓ గా ఉండగా, మరొకరు వినోద్ జిల్లా సహాయ కమిషనర్ పర్యవేక్షకునిగా ఉన్నారు. 

ఈ ఆలయానికి ఏడాది ఆదాయం ఎంతో ఈఓ గా ఉన్న కిషోర్ కుమార్ కి తెలియదని, పూడిపెద్ది శర్మ మండిపడ్డారు. అసలు రధం పనికిరాదు అనే విషయం మీ కెప్పుడు తెలుసు అని అడిగితె ఈఓ ఇచ్చిన సమాధానం రెండు ఏళ్లుగా రధం వాడడం లేదని, రెండు నెలల

క్రితం పరిశీలించామన్నారు. అయితే అప్పడికే రధం భిన్నమైందన్నారు. రథయాత్ర చెయ్యవలసి ఉన్న చోట నిమ్మకు నీరెత్తినట్టు ఉండడం తో . . భక్తులు మండిపడుతున్నారన్నారు. రధం ఇంచార్జి ఎవరు అని అడిగితె సమాధానం చెప్పలేని సేతిలో ఈఓ ఉన్నదన్నారు. 
ఇక మరొక ఏసీ వినోద్ మాట్లాడుతూ ఆలయంకు ఆదాయం రూ.  4 లక్షలు ఉందని, నాటి నిబంధనల ప్రకారం ఈ

గుడి 6 బి గ్రేడ్ లో ఉన్న ఆలయం అన్నారు. అలాంటిది  గుడిలో ఉత్సవాలు ఆచార ప్రకారం జరిపేందుకు ముందస్తుగానే ప్రణాళిక వేసుకోవాల్సి ఉందని విజయలక్ష్మి అన్నారు. కనీసం ఈ రథయాత్ర కూడా చెయ్యలేసి దేవాదాయ శాఖా ఉండి ఉపయోగం ఏంటని ప్రశ్నించారు. దీంతో రధాన్ని త్వరలోనే బాగుచేయించి రథయాత్ర చేస్తామన్నారు. దాంతో హైందవ శక్తి

అధ్యక్షురాలు మండిపడ్డారు. మీ ఇష్టానుసారంగా ఉత్సవాలు జరపడానికి ఇది మీ ఆఫీసు లో మీటింగ్ కాదన్నారు. దీనికి ఒక ఆచారం, ఆనవాయితీ, సంప్రదాయం ఉంటుందని, దాన్ని పాటించవలసిన భాద్యత ఈఓ పైనే ఉందన్నారు. 

పూడిపెద్ది శర్మ కిషోర్ కుమార్ తో మాట్లాడుతూ రధం పనికి రాదు అని ఎప్పుడు గమనించారు ఆంటే. . .రెండు రోజుల క్రితం అని, ఈ

దేవస్థానం లో  ఉద్యోగులకు జీతాలు ఎలా చెల్లిస్తున్నారు అని ప్రశ్నించారు. తక్షణం దీనిపై దేవాదాయ శాఖా ఆర్ జె సి కి, కమిషనర్ కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఈయనే ప్రముఖ్ పైడితల్లి అమ్మవారి దేవస్థానం ఈవోగా కూడా ఉన్నారు. విఎస్ఎన్ కిశోర్ కుమార్  వచ్చి ఏడాదిన్నర గా భాద్యతలు స్వీకరించి జగన్నాధ స్వామి ఆలయం లో పరిస్థితి ఎలా

ఉందొ తెలియదు అంటే ఉద్యోగులు ఎంత భాద్యతగా ఉన్నారో తెలుస్తోందని శర్మ అన్నారు.  
వినియోగానికి పనికి రాదు అని తెలుసునని,  శిథిలావస్థకు వచ్చిన రధం మార్చాలి అంటే ముందుగానే చూసుకోవాల్సిన అవసరం ఉందని విజయ లక్ష్మి అన్నారు. .రెండేళ్లుగా హిందూ పండగలకి ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఇతర మతస్థులకు మాత్రం ఎటువంటి ఇబ్బందులు,

వైరస్ లు అడ్డంకి రావు. కేవలం హిందువులకు మాత్రమే ఈ ఇబ్బంది వచేస్తుందన్నారు.  

ఏసీ వినోదు ఇచ్చిన వివరణలో ఈ రాశాం దుస్థితి సిబ్బంది, ఏసీ కి, అర్చకులకు ఏడాది క్రితమే తెలుసునన్నారు. దీన్ని మరమత్తు చేయించాలి ఆంటే దేవాదాయ శాఖా ఒక్క రూపాయి కూడా ఇవ్వదని, భక్తులనుంచే దండుకోవాల్సి ఉందన్నారు. దీనికోసమే అర్చకులు

కూడా ప్రయత్నించారు. భక్తుల నుంచి విరాళాలు తెచ్చేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదన్నారు. 

8 ఏళ్ళ క్రితం తయారు చేసిన రథం ఇది. రధం షెడ్ పైన రేకులు వేశారు. ముందు వైపు వర్షం కారణంగా రధం కర్ర పుచ్చి పోయిందన్నారు. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam