DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సర్వ మానవాళి శ్రేయస్సుకే శయన (తొలి) ఏకాదశి వ్రతం 

నాలుగు నెలలూ అమ్మవారికి ఆరాధనలు ఫుల్. అయ్యవారికి నిల్, 

జులై 10 న శయన ఏకాదశి సందర్బంగా ప్రత్యేక కధనం. . . 

*(DNS Report: Sairam CVS, రాష్ట్ర వాది పత్రకార్, Visakhapatnam)*  

*విశాఖపట్నం, జులై 09, 2022 (డిఎన్ఎస్):* ఆషాఢ మాసం లో వచ్చే శుద్ధ ఏకాదశి కి హైందవ సంప్రదాయంలో అత్యంత ప్రాధాన్యత ఉంది. దీనికే తొలి ఏకాదశి లేదాశయన

ఏకాదశి లేదా ప్రధమ ఏకాదశి అని కూడా పేరు. ఈ రోజున నుంచి నాలుగు నెలల కాలం పాటు శ్రీ మహ విష్ణువు క్షీరాబ్ధి యందు శయనిస్తాడు. గనుక దీన్ని శయన ఏకాదశి  అంటారు. సమస్త లోకాలనూ పరిరక్షించే ప్రక్రియ నుంచి కొంత విశ్రాంతి అవసరం కనుక అయన ఈ కాలం లో కాస్త ఉపశమనం పొందుతారు. 

ఆరాధనలు అమ్మవారికి ఫుల్, అయ్యవారికి నిల్:. .

.: 

శ్రీమహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్లడంతో ఆలయాల్లో ఈ నాలుగు నెలల కాలం పాటు ఆయనకు విశిష్టమైన ఆరాధనలు జరగవు. కేవలం అమ్మవారికి ఆరాధనలు జరుగుతాయి. ఆంధ్ర ప్రదేశ్ లో గ్రామదేవతలకు జాతరలు, తెలంగాణ ప్రాంతాల్లో బోనాలు, ఇలా కేవలం అమ్మవారికి జరుగుతుంటాయి. 
ఈ సమయంలో ఆలయాల్లో అయ్యవారికి అంతగా ఆరాధనలు

ప్రత్యేకించి జరగవు. కేవలం అమ్మవారికి సంబంధించిన ఉత్సవాలు, జాతరలు, వేడుకలు మాత్రమే జరుగుతుంటాయి. 

నాలుగు నెలలకు ప్రత్యేకం :
 
ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున యోగనిద్రకు ఉపక్రమించే శ్రీమహావిష్ణువు నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడంటారు. దానిని ఉత్థాన ఏకాదశి లేదా క్షేరాబ్ది ఏకాదశి

అని అంటారు. ఆ తర్వాత రోజు వచ్చే ద్వాదశినే క్షీరాబ్ధి ద్వాదశి అంటారు. ఈ నాలుగు నెలల కాలాన్నీ పవిత్రంగా పరిగణించి అందరూ చాతుర్మాస్యదీక్ష చేసేవారు.

పురాణం ప్రాధాన్యత: 

తాళజంఘుడు అనే రాక్షసుని కుమారుడగు మురాసురునితో యుద్ధంలో గెలవలేక అలసిపోయిన విష్ణువు, తన శరీరము నుంచి జనింపజేసిన కన్యక నే ఏకాదశి

అంటారు. ఏకాదశీ వ్రతాన్ని ఆచరించే రుక్మాంగదుడు - మోహిని రూపంలో వచ్చి ఏకాదశిపూట పొందుకోరిన రంభను తిరస్కరించాడట. ప్రస్తుతం మఠాధిపతులూ, సన్యాసం తీసుకున్నవారు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నారు. చతుర్మాస్యదీక్ష చేపట్టినవారు నాలుగునెలలపాటు ప్రయాణాలు చేయరు. కామ క్రోధాదులను విసర్జిస్తారు. ఆహారం విషయంలో కొన్ని

నిషేధాలు పాటిస్తారు.

మంచి పనికి మారుపేరు ఏకాదశి : . .. 

ఏ మంచిపని ప్రారంభించినా దశమి ఏకాదశులకోసం ఎదురుచూడటం ప్రజలకు అలవాటు. ఏడాది పొడుగునా ఉండే 24 ఏకాదశుల్లో, ఆషాఢ శుక్ల ఏకాదశి తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. పూర్వకాలంలో ఈ రోజునే సంవత్సరారంభంగా పరిగణించేవారు. వానకారు మొదలైతే అనారోగ్యాలు తలెత్తడం

సహజం. శరదృతువు యమ దంష్ట్రిక (యముడి కోర). ఉత్తరాయణం కన్నా దక్షిణాయనంలో పండుగలూ పబ్బాలూ ఎక్కువ. లంఖణం పరమ ఔషధం అనే ఉపవాస దీక్షకు నాంది తొలి ఏకాదశి.

పురాణ నేపథ్యం:

ఆషాఢమాసము శుక్లపక్ష ఏకాదశి నాడు విష్ణుమూర్తి పాలకడలిపై యోగనిద్రలోకి వెళ్ళే సందర్భాన్ని తొలిఏకాదశిగా పరిగణిస్తారు. స్వామి నిద్రించే

రోజు కాబట్టి దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు. సతీ సక్కుబాయి ఈ శయన ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందింది. తొలిఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి, రాత్రికి జాగారం చేసి, మర్నాడు ద్వాదశినాటి ఉదయం విష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలను స్వీకరించి ఆ తర్వాత భోజనం చేస్తే జన్మజన్మల పాపాలు ప్రక్షాళనమవుతాయని నమ్మకం. ఆ రోజు

యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేల్కొంటాడంటారు.
జొన్న పేలాలు బెల్లం కలిపి దంచి పిండి చేస్తారు. రైతులు ఆరోజున కచ్చితంగా పేలపిండి తింటారు. ఏకాదశినాడు ఉపవాస నియమం లోకంలో స్థిరపడింది.

సాంకేతిక ప్రాధాన్యం,  :

ఈ కాలంలో పురాణం ప్రాధాన్యతతో పాటు

సాంకేతిక ప్రాధాన్యం కూడా ఉంది. ఈ నాలుగు నెలల కాలం పాటు వర్షాలు అధికంగా పడుతుంటాయి. ఈ సమయంలో దేశాటనలు, ఇతర కార్యక్రమాలు చేసుకోవడం ద్వారా ప్రజలు నానా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. తద్వారా అంటువ్యాధులు ప్రబలే అవకాశం కూడా ఉంది. ఈ కాలంలో ఒకే చోట ఉండి తమ కార్యాచరణ నెరవేర్చుకోవడం ద్వారా సురక్షితంగా ఉండవచ్చు. ఏ కారణం చెప్పిన

ప్రజలకు ఆరోగ్యమే ప్రధానం కావడంతో ఈ రోజు నుంచి అందరూ తగు జాగ్రత్తగా ఉంటారు. 
ఆరోగ్య పరమైన చర్యలు ప్రధాన లక్ష్యం: . .. 
వర్ష కాలం కావడం తో మన శరీరానికి జడత్వం వచ్చి, అనేక రోగాలు చుట్టుముడతాయి. ఉపవాసం వల్ల జీర్ణకోశం పరి శుభ్ర మై, దేహం నూతనోత్తేజాన్ని సంతరించుకుంటుంది. ఇంద్రియనిగ్రహాన్ని కలిగిస్తుంది. ఇంతేకాక

కష్టపరిస్థితుల్లోను, భయంకరమైన రోగాలు వచ్చినప్పుడు విపరీతమైన పరిస్థితులను ఎదుర్కోవడం కోసమే ఈ కఠిన ఉపవాసాలు, ఆచారాలు ఏర్పడ్డాయి. ఇందువలన కామక్రోధాదులను విసర్జించగలుగుతారు. ఆహారం విషయంలో కొన్ని నిషేధాలు పాటిస్తారు. 

పేలాలు - బెల్లం ప్రాధాన్యత : . . 

పేలాలలో బెల్లాన్ని, యాలకులను చేర్చి దంచి ఈ

పిండిని తయారుచేస్తారు ఈ దినాన ప్రతి దేవాలయంలోను పేలా పిండిని ప్రసాదం కూడా ఇస్తారు.ఆరోగ్యపరంగా కూడా ఈ పిండి చాలా మంచిది. బాహ్య ఉష్ణోగ్రతలకు అనుగుణంగా దేహం మార్పులు చెందుతుంది. గ్రీష్మ ఋతువు ముగిసి వర్ష ఋతువు ప్రారంభమయ్యే సమయం. కావున శరీరానికి ఈ పిండి వేడిని కలుగజేయడమేగాక, వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది.

వర్షాకాలంలో వ్యాధి బారిన పడటానికి ఉన్న అనేక అవకాశాలను ఇది తిప్పికొడుతుంది.

రాత్రి వేళలు అధికం : . .

భూమిపై రాత్రి సమయాలు పెరుగుతున్నాయని చెప్పటానికి సూచన. అంటే ప్రజలలో నిద్రా సమయాలు పెరుగుతాయన్నమాట. వానాకాలంలో వచ్చే మొదటి ఏకాదశి కనుక దీనిని తొలి ఏకాదశి అని లౌకికంగా చెబుతారు పండితులు. ఏకాదశి అంటే

పదకొండు. అయిదు జ్ఞానేంద్రియాలు, అయిదు కర్మేంద్రియాలు, మనస్సు కలిపి మొత్తం పదకొండు. వీటిని మనిషి తన అధీనంలోకి తీసుకువచ్చి వాటినన్నటినీ ఒకటిగా చేసి, అప్పుడు దేవునికి నివేదన చేయాలి. దీనివలన మనిషికి సహజంగా అలవడే బద్దకం దూరమవుతుందని, రోగాలు దరిచేరకుండా ఉంటాయని, ఇంద్రియ నిగ్రహం పెరుగుతుందని ఒక

నమ్మకం.

సూర్యుడే - విష్ణువు అని తెలిపే మాంధాత - ప్రాశస్త్యం: . .. 

సూర్య వంశంలో మాంధాత అనే రాజు ఉండేవాడు.  అతడు ధర్మము తప్పడు, సత్యసంధుడు. అతని రాజ్యంలో ఒకసారి తీవ్ర కరువు వచ్చింది. దానితో ప్రజలు పడరాని పాట్లు పడుతుంటే అంగిరసుడు సూచన పై ఈ శయనైక ఏకాదశి వ్రతాన్ని భక్తితో చేస్తాడు దానితో వర్షం వచ్చి

కరువు తీరి ప్రజలు సుఖంగా వున్నారని పురాణాలు చెపుతున్నాయి. విష్ణుమూర్తి యోగనిద్రలోకి వెళతాడని పెద్దలు చెప్పగానే, నిజంగానే దేవుడు నిద్రపోతాడా అని ఒక సందేహం కలుగుతుంది. విష్ణువు అంటే సర్వవ్యాపి అని అర్థం. అంటే విష్ణువు అనే పదానికి అంతర్లీనంగా సూర్యుడు అని అర్థం అన్నమాట. ఇప్పటివరకు ఉత్తర దిక్కుగా ప్రయాణించిన

సూర్యుడు, ఈ రోజు నుంచి దక్షిణదిక్కుకు వాలుతాడు. అంటే ఈ రోజు మొదలుగా దక్షిణ దిక్కుగా ప్రయాణిస్తాడు. దానినే సాధారణ పరిభాషలో నిద్రపోవడం అని అభివర్ణించారు. సాక్షాత్తు భగవంతుడే నిద్రిస్తుంటే ఈ పూజలు ఎవరికి చేయాలి అనుకోవచ్చు. ఈ నెలలోనే ప్రకృతిలో, పర్యావరణంలో మార్పులు వస్తాయి.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam