DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కాళీని అవమానించిన హిందూద్వేషి చిత్ర నిర్మాత లీనా మణిమేకలైకి ఢిల్లీ కోర్టు సమన్లు 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*    

*విశాఖపట్నం, జులై 12, 2022 (డిఎన్ఎస్):* హేతువాద, హిందూద్వేషి సినీ దర్శక నిర్మాత లీనా మణిమేకలై కి ఢిల్లీ కోర్టు సమన్లు ​​జారీ చేసింది. కోట్లాదిమంది హిందువుల ఆరాధ్యదైవమైన కాళీ మాతను కించపరుస్తూ విడుదల చేసిన పోస్టర్ పై ఢిల్లీ కోర్టు లో కేసు దాఖలైన నేపథ్యంలో ఈ సమన్లు

జారీ అయ్యాయి. హేతువాద విధానాల ద్వారా కేవలం హిందూ సంప్రదాయాన్ని కించపరిచే చిత్రాలు తీస్తూ. . .సోషల్ మీడియా లో అవమానకరంగా ప్రచారం చేయడంపై దేశవ్యాప్తంగా పోలీస్ కేసులు దాఖలయ్యాయి. 
లీనా తన రాబోయే చిత్రం యొక్క పోస్టర్‌ను షేర్ చేసింది, ఇందులో ఆమె ఒక చేత్తో కాళీ దేవత సిగరెట్ తాగుతున్నట్లు, రెండవ చేత్తో LGBTQ (లెస్బియన్

గే బై సెక్సువల్ ట్రాన్స్ జెండర్ కీర్ ) జెండాను పట్టుకున్నట్లు చూపించింది. పైగా కెనడాలోని ఒక యూనివర్సిటీ లో దీన్ని ప్రదర్శించింది. 

ఈ తరహా హిందూ ద్వేషాన్ని చిత్రం రూపంలో ప్రదర్శించడం పై లీనా మరియు ఇతరులపై శాశ్వత మరియు తప్పనిసరి నిషేధం కోసం వాది దావా వేశారు. సినిమా పోస్టర్ మతపరమైన మనోభావాలను దెబ్బతీసేలా

ఉందని, నైతికత, మర్యాదలకు విరుద్ధమని వాది పేర్కొన్నారు. ఈ కేసు తదుపరి విచారణను ఆగస్టు 6న కోర్టు వాయిదా వేసినట్లు సమాచారం.

ఈమెపై కేసు వెయ్యడానికి మరో బలమైన కారణంకూడా ఉంది. ఈ చిత్రం పై ఆమెకు వ్యతిరేకత వస్తోందని, తనకి ఎక్కడా రక్షణ లేదు అని చెప్పింది. ఇది చెప్పిన రెండో రోజే శివ పార్వతుల వేష ధారణలో ఉన్న ఇద్దరు

సిగరెట్ కలుస్తూ, దమ్ము పీలుస్తున్నట్టుగా మరోఫోటో ప్రదర్శించింది. 
పైగా తన కాళీ జనాన్ని చంపుతుందని, అస్సలు మానవతా లేదంటూ ట్వీట్ చేసింది.  ఈమె విచ్చలవిడి హిందూ ద్వేషం పై ఆగ్రహం వ్యక్తం చేసిన హిందూ సమాజం ఈమె పై చట్ట ప్రకారం చెర్యలు తీసుకునేందుకు సిద్ద పడింది. 

పైగా ఈమెకు మద్దతుగా దేశంలోని హిందూ

వ్యతిరేకశక్తులన్నీ ఏకమై తానాతందనా అనడంతో వాళ్లపై కూడా పొలిసు కేసులు నమోదయ్యాయి , కోర్టులో వ్యాజ్యాలు దాఖలు అయ్యాయి.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam