DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆచార్య అనుగ్రహం ఉంటె ఎంతటి కష్టాన్నైనా అధిగమించవచ్చు 

*గురుపౌర్ణమి వేడుకల్లో త్రిదండి దేవనాథ జీయర్ స్వామి వెల్లడి* 

విశాఖ వారిజ లో వైభవంగా గురు పౌర్ణమి వేడుకలు

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*    

*విశాఖపట్నం, జులై 13, 2022 (డిఎన్ఎస్):* *ఆచార్య అనుగ్రహం ఉంటె ఎంతటి కష్టాన్నైనా అధిగమించవచ్చునని  పరమహంస పరివ్రాజకాచార్యులు త్రిదండి

దేవనాథ జీయర్ స్వామి తెలియచేసారు. బుధవారం విశాఖపట్నం - భీమిలి బీచ్ రోడ్ లోని మంగమారిపేటలో గల చిన్న జీయర్ స్వామి వారి వేద పాఠశాల ప్రాంగణం (వారిజ ఆశ్రమం) లో శ్రీ లక్ష్మీ హయగ్రీవ మందిరంలో వ్యాస పౌర్ణమి వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ త్రిదండి దేవనాధ జీయర్ స్వామి వారి నిర్వహణ లో... జగదాచార్యులు,. అపర రామానుజులు

త్రిదండి చిన్న జీయర్ స్వామివారి పాదుకలకు ఆచార్య వందనం నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ గురు పౌర్ణమి ఒక మంచి ఆలోచన విధానాన్ని గురువు ద్వారా అందిస్తుందన్నారు సమాజంలో ప్రతి ఒక్కరూ మంచి లక్షణాలు ఆలోచనలు కలిగి ఉండే విధంగా ఒక మార్గదర్శకాన్ని గురువు అందిస్తారన్నారు సాధారణంగా చాతుర్మాస్య దీక్ష ప్రతి

ఒక్కరూ నిర్వహించవచ్చని అయితే ప్రస్తుత కాలానుగుణంగా కేవలం యతీశ్వరులు సన్యాసులు పీఠాధిపతులు సమంత తప్పకుండా ఈ దీక్షను ఆచరిస్తున్నారన్నారు వర్షాకాలం కారణంగా జీవచరాలు ఇబ్బంది పడకుండా ఉండేందుకు సంధ్యా సమయం తర్వాత పాదయాత్ర కానీ పర్యటనలు గాని చెయ్యరాదు అన్నారు ఆహార నియమాలతో పాటు గ్రంథం పఠనం

జరుగుతుందన్నారు.*

అంతకుముందు త్రిదండి శ్రీ దేవనాధ రామానుజ జీయర్ స్వామివారు చాతుర్మాస్య దీక్ష స్వీకారం చేపట్టారు. రానున్న రెండు నెలల కాలం ఉత్తరాంధ్ర ప్రాంతాల్లోని గ్రామా గ్రామాన సనాతన హైందవ ధర్మ  pracharam నిర్వహించడం జరుగుతుందని, యువతి యువకుల్లో దేశ భక్తి, సమాజం పట్ల భాద్యతలను పెంపొందించే  విధంగా పలు

కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. 

ఈ వేడుకల్లో వారిజ ఆశ్రమ వేద పండితులు ముడుంబై  శ్రీకాంత్,  సంతోష్ కుమార్ లు కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ, ప్రకృతి వైద్య శాల నిర్వాహకులు, వేద విద్యార్థులు,  పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam