DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వేద పఠనం చేస్తే ఆ ప్రాంతమంతా తరించిపోతుంది: దేవనాథ జీయర్

*వారిజ లో స్వామిని దర్శించిన సప్తఋషి వేదపాఠశాల విద్యార్థులు*

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*   

*విశాఖపట్నం, జులై 14, 2022 (డిఎన్ఎస్):* వేదపఠనం చేయడం ద్వారా దైవత్వం విశ్వాంతరాళాల్లో వ్యాప్తి చెందుతుందని, పరమహంస పరివ్రాజకాచార్యులు త్రిదండి దేవనాథ జీయర్ స్వామి తెలియచేసారు. విశాఖపట్నం -

భీమిలి బీచ్ రోడ్ లోని మంగమారిపేటలో గల చిన్న జీయర్ స్వామి వారి వేద పాఠశాల ప్రాంగణం (వారిజ ఆశ్రమం) లో చాతుర్మాస్య దీక్ష నిర్వహిస్తున్నారు. గురువారం సాయంత్రం విశాఖ నగరానికి చెందిన సప్త ఋషి చారిటబుల్ ట్రస్ట్ ( వేద పాఠశాల) నిర్వహకులు మవళ్ల పల్లి మాధవ శర్మ తమ పాఠశాల  విద్యార్థులతో కలిసి జీయర్ స్వామిని దర్శించారు. ఈ

సందర్బంగా వేద విద్యార్థులనుద్దేశించి జీయర్ స్వామి  అనుగ్రహ భాషణం చేసారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ వేద విద్య ప్రపంచంలోనే ఎంతో ఉన్నతమైనదని, వేద పఠనం చెయ్యడం ద్వారా పరిసర ప్రాంతాల్లో దివ్య తరంగాలు వ్యాప్తి చెందుతాయన్నారు. చిన్నతనంలో నేర్చుకున్న విద్య పూర్తి జీవింతం జ్ఞాపకం ఉండేలా సాధన

చేయాలన్నారు.

వేదవిద్య వ్యాప్తికోసం కృషి చేస్తున్న సప్త ఋషి చారిటబుల్ ట్రస్ట్ ( వేద పాఠశాల) నిర్వహకులు మవళ్ల పల్లి మాధవ శర్మ ను అభినందించారు. వారు చేస్తున్న వేద మాత సేవ నిరంతరం ఎటువంటి అవాంతరాలు కలుగకుండా మరింత వైభవంగా జరగాలి అని మంగళశాససనం అందించారు. 

సప్తఋషి పాఠశాల మాధవ శర్మ తాము నిర్వహించిన

వేద యాత్రలను స్వామి వారికీ వివరించారు. ఆదిశంకరాచార్యులు నిర్వహించిన భారత పర్యటన స్ఫూర్తిగా  శ్రీకాకుళం నుంచి కాశ్మీర్ వరకూ వారు విజయం చేసిన అన్ని ప్రాంతాల్లోనూ  తాము పర్యటించి, చతుర్వేద పారాయణ చేయడం తమ పూర్వజన్మ సుకృతంగా తెలియచేసారు. ఈ నెల 4 వ తేదీన అత్యంత క్లిష్టమైన కాశ్మీర్ రాష్ట్రంలోని శ్రీ నగర్ లో  వేద

దివస్ నిర్వహించామని,  దేశ వ్యాప్తంగా 108 మంది వేదపండితులు  పాల్గొని వేదపఠనం చేయడం జరిగిందన్నారు. ఈ ప్రాంతంలో గత 70 ఏళ్ళ కాలంలో వేదపఠనం జరగడం ఇదే తొలిసారి అని స్థానికులు తెలియ చేయడం మా అదృష్టంగా తెలిపారు. 

అంతకు ముందు వారిజ ఆశ్రమం లోని విద్యార్థులు శ్రీ లక్ష్మి హయగ్రీవ మందిరంలో స్వామిని దర్శించుకుని, వేద

పఠనం చేశారు.

ఈ కార్యక్రమం లో వారిజ వేద పండితులు ముడుంబై శ్రీకాంత్ స్వామి, శేషగిరి స్వామి, ఆశ్రమ విద్యార్థులు పాల్గొన్నారు. 


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam