DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బిక్కవోలు సుబ్రహ్మణ్య స్వామి గుళ్లో సర్ప రూపంలో స్వామి దర్శనం

*(DNS Report: P Raja, Bureau Chief, Amaravati)*  

*Amaravati, July 22, 2022 (DNS Online):*  

*అమరావతి, జులై 22, 2022 (డిఎన్ఎస్):* కాకినాడ జిల్లాలోని బిక్కవోలు గ్రామంలో గల సుప్రసిద్ధ ప్రఖ్యాత గోలింగేశ్వర దేవాలయంలో వెలసిన స్వయంభూ కుమార సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ఎన్నో  విశేషాలకు ఆలవాలం. ఈ ఆలయంలో స్వామి ఒక సర్పం రూపంలో నివాసం  ఉండేవారు అనే నిదర్శనాలు

ఎందరికో పరిచయం. అయితే గత కొంత కాలంగా ఈ సర్పం ఆలయంలో కన్పించడం లేదనే ప్రచారం భక్తుల్లో ఉండేది. మంగళవారం జులై 26 వ తేదీ ఒక్కసారిగా తిరిగి ఆలయ గోపురం పై భారీ సర్పం దర్శనం లభించడంతో భక్తుల్లో ఆనందం వ్యక్తం అయ్యింది. ఈ సందర్బంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ స్వామి ఇక్కడ బ్రహ్మచారిగా వెలిశారని  సర్ప రూపంలో దర్శనం లభించడం

ఇక్కడ ఆనవాయితీ అన్నారు. గతంలో ప్రతి పౌర్ణమికి లభించేది అని, ఈ ఆలయం 300  ఏళ్ళు పురాతన క్షేత్రం అన్నారు. ఇక్కడ సుబ్రహ్మణ్య షష్టి వేడుకలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకున్నాయన్నారు. 

 


Latest Job Notifications

Panchangam - Dec 4, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam