DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సమాజ శ్రేయస్సు భాద్యత కూడా ధార్మిక పీఠాలపై ఉంది. .: దేవనాథ జీయర్ స్వామి

*జిమ్స్ ఆసుపత్రి . .నేత్రదానం, అవయవదాన అవగాహనా సదస్సులు*
 
*సమాజ సేవే ధ్యేయంగా చిన్న జీయర్ స్వామి వికాస తరంగిణి, ఆరోగ్య వికాస్ శాఖలు*

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*   

*విశాఖపట్నం, జులై 27, 2022 (డిఎన్ఎస్):* సమాజ్ శ్రేయాస్ భాద్యత కూడా దైవ చింతనతో ధార్మిక కార్యక్రమాలు చేపట్టే ఆధ్యాత్మిక

ధార్మిక పీఠాలపై ఉందని త్రిదండి దేవనాథ జీయర్ స్వామి తెలియచేసారు. విశాఖ నగరంలోని బీచ్ రోడ్ లో గల వారిజ ఆశ్రమంలో చాతుర్మాస్య దీక్ష నిర్వహిస్తున్న స్వామి సమాజ శ్రేయస్సులో ధార్మిక పీఠాల పాత్ర పై బుధవారం ఆయన భక్తులకు సందేశాన్ని అందించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ ఉభయవేదాంత పీఠాన్ని స్థాపించిన త్రిదండి పెద్ద జీయర్

స్వామి వారు  సమాజ్ శ్రేయస్సులో భాద్యత గా పూర్వాశ్రమంలోనే స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్నారని, తమ సొంత భూమిలో దళితులకు ఇళ్ళు కట్టించి , ఒక కోలనీ ఏర్పాటు చేశారన్నారు. వారి బాటలోనే నడుస్తున్న చిన్న జీయర్ స్వామి వారు ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడినప్పుడు ప్రతి సమయంలోనూ తమ ట్రస్ట్ ద్వారా అవసరమైన సేవా కార్యక్రమాలను

అందిస్తున్నారన్నారు. హుదూద్ తుఫాన్ వచ్చిన సమయంలో ఉత్తరాంధ్ర ప్రాంతంలోనూ, కోనసీమ తుఫాన్ లోను, గుజరాత్ లోని కచ్ లో భారీ భూకంపం వచ్చినప్పుడు ఏకంగా 108 ఇళ్ళు కట్టించి, కోలనీ ఏ ఏర్పాటు చేశారన్నారు. ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ తెలంగాణ ప్రాంతాల్లో వరద ముంపు కు గురైన బాధితులకు ఆహార పదార్ధాలను 5000 ల మందికి పైగా

అందిస్తున్నారన్నారు. 

ఏ మత, ఆగమ సంప్రదాయమైనా పరమాత్మా ఒక్కరే అని విశ్వసిస్తారని, పరమాత్మా వేరు - జీవుడు వేరు కాదని సమాజం లోని జీవులకు సేవ అందిస్తే. . పరమాత్మకు చేరుతుందన్నారు. 

విశిష్టాద్వైత రామానుజ సంప్రదాయంలో లోకా సమస్తా సుఖినో భవంతు , సర్వే జానా సుఖినో భవంతు అని ప్రతి రోజూ తిరువారాధనలో

పలుకుతామని, దాన్నే చిన్న జీయర్ స్వామి వారు ఆచరించి చూపిస్తున్నారన్నారు. 
 
సమాజ సేవలే ధ్యేయంగా వికాస తరంగిణి. . .:

చిన్న జీయర్ స్వామి సంస్థల ద్వారా ఒకప్రక్క వేదవిద్య,  వైదిక ప్రచారం చేస్తూనే. .మరో ప్రక్క సమాజంలోని వారికి అండగా నిలబడుతున్నారన్నారు. సంఘంలోని వారికీ మంచిని పంచాలి అనే సంకల్పంతో నాలుగు

విభాగాలను జీయర్ స్వామి వారు నిర్వహిస్తున్నారన్నారు. 
వాటిలో మొదటిది సంస్కార వికాస్, దీని ద్వారా పెద్దలకు మంచి  విషయాలు బోధించేందుకు, ధార్మిక ప్రవచనాలు అందించడం జరుగుతోందన్నారు. 
రెండవది ప్రజ్ఞ వికాస్, దీని ద్వారా చిన్న పిల్లలకు మంచి వైదిక విద్య, నీతి కథలు, శ్లోకాలు, గ్రంధాలూ బోధించడం జరుగుతోందన్నారు. 
/> మూడవ విభాగం లో యువ వికాస్, దీని ద్వారా సమాజానికి ఎంతో మేలు జరుగుతోందన్నారు. సమాజానికి ఆయువుపట్టు యువతి యువకులేనని, వారికి ఉత్తమ జీవనాన్ని తెలియచేసేందుకు, సేవ కార్యక్రమాలు నిర్వహించేందుకు, సమాజం భాద్యత తెలియచేయడం జరుగుతోందన్నారు. 
నాల్గవ విభాగం లో మహిళా ఆరోగ్య వికాస్, దీనిలో ప్రధానంగా మహిళ లు ఎదుర్కొనే

ఆరోగ్య పరమైన సమస్యలను వైద్యుల ద్వారా పరిశీలన జరిపి, వారికి తగు నివారణ చర్యలను అందించడం జరుగుతుందన్నారు. ప్రధానంగా మహిళల్లో క్యాన్సర్ తలెత్తుతోందని, గమనించే సరికే వ్యాధి ముదురు అవకాశం ఉందన్నారు. దీన్ని నివారించేందుకు గ్రామా స్థాయిల్లో మహిళా ఆరోగ్య వికాస్ ద్వారా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి, మహిళలకు వైద్య

పరీక్షలు నిర్వహించి, ఎవరికైనా క్యాన్సర్ వంటి వ్యాధి లక్షణాలు కనపడితే నివారణ మార్గాలు సూచించడం జరుగుతోందన్నారు. ఇప్పడి వరకూ ఉచిత వైద్య శిబిరాల ద్వారా   సుమారు 15 లక్షల మంది మహిళలకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు. 

జిమ్స్ ఆసుపత్రి . . వైద్య అవగాహనా సదస్సులు 

చిన్న జీయర్ స్వామి

వారి సారధ్యంలో జీయర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ( జిమ్స్ ) ఆసుపత్రిని భాగ్యనగరం లో నిర్మించారని, ఆయుర్వేదం, హోమోయోపతి విభాగాల్లో వైద్య సదుపాయాలు ఉచితంగానే అందిస్తున్నారన్నారు. యువతలో చైతన్యం కల్గించి వికాస తరంగిణి శాఖల ద్వారా వివిధ ప్రాంతాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించడం, నేత్రదానం, అవయవదానం పై అవగాహనా

సదస్సులు నిర్వహించడం, వేలాది మందితో ఇప్పడికే నేత్రదానం, అవయవదానం పై అంగీకరింపచేయడం జరిగిందన్నారు.    

దేశ భక్తి - భాద్యత. .. 

భారత దేశ స్వాతంత్ర్య దినోత్సవ, గణతంత్ర దినోత్సవ సమయాల్లో స్వామివారి ప్రతి సంస్థలోనూ తప్పని సరిగా భారత జాతీయ త్రివర్ణ పతాకం ఎగురవేసి, వందేమాతరం, జనగణమన గీతాలను ఆలపించి,

వేడుకలు జరుపుకోవడం జరుగుతుందన్నారు. 

భారత సైనికులకు సంఘీభావంగా ప్రతి సందర్భంలోనూ వారికి మేలు జరగాలని, ఆయుష్షు లభించాలని, అన్ని వేళలా విజయం లభించాలి అనే సంకల్పంతో స్వామిని ప్రార్ధించడం జరుగుతుందన్నారు. కార్గిల్ యుద్ధ సమయంలో సైనికుల విజయాన్ని కోరుతూ మంగళ తరంగిణి ( లక్ష మందితో దీపారాధన), అమర వీరుల

కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 50 వేల ఆర్థిక ప్రోత్సాహం అందించడం జరిగిందన్నారు.  

కొరోనా సమయంలో:. .
కొరోనా మహమ్మారి అతలాకుతలం చేసిన సమయంలో సంపూర్ణ నిబంధనలు పాటించి, అన్ని సంస్థలనూ తాత్కాలికంగా ప్రవేశాలను నిలిపివేశారన్నారు. సమాజ శ్రేయస్సు కోసం సుందరకాండ పారాయణ, విరాట్ హనుమాన్ చాలీసా పారాయణ, నిర్వహించడంతో

పాటు, ఆయా ఆశ్రమాల ప్రాంతాల్లోని పేదలకు, నిరాశ్రయులకు ఆహారాన్ని ఉదయం, రాత్రి వేళల్లో నిరంతరంగా అందించడం జరిగిందన్నారు. 

నేటికీ స్వామి వారి ట్రస్టు ల పరిధిలో నిర్వహించే ప్రతి సంస్థలోనూ నిత్యం పేదలకు అన్న ప్రసాదం వితరణ జరుగుతూనే ఉంటుందన్నారు. 

1999 లో కార్గిల్ యుద్ధ సమయంలో సైనికుల విజయం కోసం మంగళ

తరంగిణి, వీరుల కుటుంబాల కోసం  అమర సేవతరంగిణి కార్యక్రమాలను చిన్న జీయర్ స్వామి వారు నిర్వహించారన్నారు.

మంగళ తరంగిణి :.

యుద్ధ సమయంలో సైనికులకు మనో బలం అందించేలా భాగ్య నగరం లోని జింఖానా మైదానంలో మంగళ తరంగిణి నిర్వహించామన్నారు. సుమారు లక్షమంది భక్తులతో సైనికులకు మనోధైర్యం లభించాలి అని శ్రీ

విష్ణుసహస్ర నామ స్తోత్ర పారాయణ, అనంతరం దీపోత్సవం నిర్వహించామన్నారు. ఈ సందర్బం గా సైనికులకు శిబిరాల్లో చికిత్స పొందుతున్న సైనికులకు రక్త నిల్వలు అవసరం పడితే అందించేందుకు రక్తదాన శిబిరాలు నిర్వహించి, రక్త యూనిట్లు అందించాలని పిలుపు నిచ్చారన్నారు. స్వామిజి పిలుపు కు స్పందించిన యువత పెద్ద సంఖ్యలో రక్తదాన శిబిరాలు

నిర్వహించారన్నారు.

అమర సేవా తరంగిణి :.

సైనికులు చేసిన పోరాట స్ఫూర్తి శక్తి ఫలితంగా 1999 జులై 26  లో భారత సైనికులు కార్గిల్ విజయోత్సవ వేడుకలు జరుపుకున్నాం అన్నారు. అయితే ఈ క్రమంలో ఎందరో సైనిక వీరులు ఈ యుద్ధంలో వీరోచితంగా పోరాడి అమరులవ్వడం చాల బాధాకరం అన్నారు. అయితే అమర వీరులు అందరికి నివాళి

అందించడమే కాక, వీరి కుటుంబాలకు తమ వంతు సహకారం అందించాలి అని అమర సేవా తరంగిణి కార్యక్రమాన్ని నిర్వహించారన్నారు. ఈ కార్యక్రమం  ద్వారా ప్రతి కుటుంబానికి రూ. 50 వేలు చొప్పున చిన్న జీయర్ స్వామి వారి ట్రస్ట్ తరపున అందించారన్నారు.

దీక్షలోనూ సమాజ భాద్యత. . .

ప్రస్తుతం తాము విశాఖ నగర పరిధిలో చాతుర్మాస్య

దీక్ష నిర్వహిస్తున్నప్పడికి వివిధ దేవాలయాలు, విద్య సంస్థలు పర్యటిస్తున్నామని, ప్రతి చోట. . ముందుగా దేశ భక్తి, సమాజం పట్ల భాద్యత మరింతగా ఏర్పడే విధంగా ధార్మికుల్లో చైతన్యం కల్గించడం జరుగుతోందన్నారు. 

తమ సంస్థల ద్వారా సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకూ సేవలు అందించడం జరుగుతుందని, ఎవరి ధర్మం వాళ్ళు ఆచరించాలి

అనేదే రామానుజ సంప్రదాయమని, అదే చిన్న జీయర్ స్వామి తెలియచేస్తున్నారన్నారు. వారి ఆదేశాల మేరకే  సంస్థల్లోని ప్రతి వ్యక్తి నిస్వార్ధంగా సేవ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారన్నారు. 

 


Latest Job Notifications

Panchangam - Dec 4, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam