DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఈ నెల 29 నుంచి వారిజలో శ్రావణ మాసోత్సవాలు, శ్రీ యాగం ఆరంభం 

*దేశాభివృద్ధి, కోసం  ప్రతిరోజూ హోమం, మంత్రం హవనం పూర్ణాహుతి*  

*దేవనాథ జీయర్ స్వామి పర్యవేక్షణలో హోమాలు, అందరూ పాల్గొనవచ్చు* 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*   

*విశాఖపట్నం, జులై 28, 2022 (డిఎన్ఎస్):* ఈ నెల 29 నుంచి శ్రావణ మాసం ఆరంభమవుతున్న తరుణంలో విశాఖపట్నం - భీమిలి బీచ్ రోడ్ లోని

వారిజ ఆశ్రమంలో శ్రావణ మాసోత్సవాలతో పాటు, శ్రీ ( లక్ష్మి ) యాగం నిర్వహిస్తున్నట్టు పరమహంస పరివ్రాజకులు త్రిదండి దేవనాథ రామానుజ జీయర్ స్వామి తెలియ చేసారు. విశాఖ లో చాతుర్మాస్య దీక్ష నిర్వహిస్తున్న వారు గురువారం భక్తులనుద్దేశించి అనుగ్రహ భాషణం అందించారు. 
ఈ సందర్బంగా వారిజ ఆశ్రమం ( విశాఖపట్నం నుంచి భీమిలి బీచ్

రోడ్ లో గల చిన్న జీయర్ స్వామి వారి వేద పాఠశాల ) లో శ్రావణ మాసం లో భాగంగా ఈ నెల 29 నుంచి ఆగస్టు 26 వరకూ 27 రోజుల పాటూ శ్రీ యాగ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ యాగ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనవచ్చని, విద్యార్థులు, యువతి యువకులు, మహిళలు, ఉద్యోగులు, అందరూ పాల్గొని, అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కావాల్సిందిగా

ఆహ్వానిస్తున్నారు. 

దేశ అభివృద్ధి కోసం, లోక కళ్యాణం కోసం మూల మంత్రం హవనం, శ్రీ సూక్త హోమం, భక్తుల విద్య, వ్యాపార, తదితర రంగాల్లో అభ్యున్నతి కోసం నక్షత్ర హోమాలను, వారిజ ఆశ్రమం వేదం పండితులచే నిర్వహిస్తున్నట్టు తెలియచేసారు. ఈ యాగ కార్యక్రమాలను దేవనాథ జీయర్ స్వామి వివరించారు. 

శ్రావణ మాసం - శ్రీ

యాగం వివరాలు. .

సనాతన హైందవ సంప్రదాయంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి అత్యంత ప్రాధాన్యత ఉందని, ప్రత్యేకించి శ్రావణ మాసం లో అమ్మవారి అనుగ్రహం కోసం ఆరాధన చెయ్యడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు. ఈ శుభ సందర్బంలో 27 రోజుల పాటు వారిజ వేదిక గా శ్రీ సూక్త, మూలమంత్ర హవనం, నక్షత్ర హోమం నిర్వహిస్తున్నామన్నారు.  ఈ నెల 29 న

అంకురారోపణ, మృత్సంగ్రహణ జరుగుతుందని, 30 వ తేదీ ఉదయం అగ్ని ప్రతిష్ఠా మహోత్సవం వైదిక పరంగా సాగుతుందన్నారు. 

శ్రీ యాగంలో భాగంగా ప్రతి రోజూ హోమ కార్యక్రమం జరుగుతుందని, మూలమంత్రం, ఆయా నక్షత్రాల్లో జన్మించిన వారికీ అభివృద్ధి కలగాలని నక్షత్ర శాంతి హోమం, శ్రీ సూక్త హోమం, నిత్యా పూర్ణాహుతి జరుగుతుందని తెలిపారు.

అనంతరం భక్తులందరికీ ప్రసాద వితరణ నిర్వహించడం జరుగుతుందన్నారు.   

శ్రావణ మాసోత్సవాల్లో భాగంగా ప్రతి శుక్రవారం సామూహిక కుంకుమ పూజలు నిర్వహించడం జరుగుతుందని, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులు కావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు. 

శ్రావణ మాసంలో వచ్చే

పర్వదినోత్సవాలను అత్యంత వైభవంగా వారిజ శ్రీ లక్ష్మి హయగ్రీవ మందిరం లో నిర్వహించడం జరుగుతుందన్నారు. 

ఆగస్టు 1 : ఆండాళ్ తిరునక్షత్రం, సమాజానికి ఒక మంచి మార్గనిర్దేశం చేసి, తిరుప్పావై వ్రతాన్ని అందించిన మహిళా మూర్తి అన్నారు. ఈమె తిరునక్షత్రం దేశ విదేశాల్లో వైభవంగా ఇంటింటా జరుపుకోవడం జరుగుతుందన్నారు. 
/>  
ఆగస్టు 3 : బదరి నారాయణ పెరుమాళ్ తిరునక్షత్రం,
ఆగస్టు 5 : శ్రీ వరలక్ష్మి వ్రతం, శ్రావణ మాసం లో ప్రతి ఇంటా వైభవంగా నిర్వహించుకునే ఈ వ్రతాన్ని వేదపాఠశాల ఆవరణలో జరుపుకోవడం ద్వారా మరింత ఉత్తమ ఫలితం లభిస్తుందన్నారు. 

ఆగస్టు 11 : శ్రీ హయగ్రీవ జయంతి, విద్యార్థులకు  ఉత్తమ జ్ఞానాన్ని అందించే స్వామి లక్ష్మి

హయగ్రీవుడని, వారి జయంతి రోజున విద్యార్ధులందరితో హయగ్రీవ పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతి ఆదివారం వారిజ ఆశ్రమం లో ఉచితంగానే హయగ్రీవ పూజలు నిర్వహిస్తున్నామన్నారు. 

ఆగస్టు 15 : పెద్ద జీయర్ స్వామి తిరునక్షత్రం. విశిష్టాద్వైత సంప్రదాయాన్ని ప్రస్తుత తరాలకు విస్తృతంగా ప్రచారం చేసిన మహనీయులు

త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి వారని, సమాజ సేవ చేయడంలో అందరికి ఆదర్శం వీరే అన్నారు. 

ఆగస్టు 20 : శ్రీ కృష్ణాష్టమి. శ్రీ కృష్ణ జన్మదిన వేడుకలు సాయంత్రం అత్యంత వైభవంగా జరుగుతాయన్నారు. 
 
ఆగస్టు 26 : మహా పూర్ణాహుతి. శ్రీ యాగ మహాపూర్ణాహుతి తో శ్రావణ మాసోత్సవాలు, యాగం పూర్తి

అవుతుందన్నారు. 

ఈ వేడుకల్లో పాల్గొనేందుకు అందరికి ఆహ్వానం పలుకుతున్నామన్నారు. ప్రతి ఒక్కరూ వారిజ ఆశ్రమానికి వచ్చి, యాగ కార్యక్రమాల్లో పాల్గొని, అనంతరం తదియారాధన లో ప్రసాదం తీసుకుని వెళ్ళవలసిందిగా ఆహ్వానిస్తున్నారు. వివరాలకు ఆశ్రమ వేదపండితులు శ్రీకాంత్ స్వామి (ఫో: 92472 17901 )  ని సంప్రదించవచ్చని

తెలిపారు. 


Latest Job Notifications

Panchangam - Dec 4, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam