DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విఫల ఈఓ సూర్యకళ సింహగిరికి ప్రపంచ ఖ్యాతి తేవడంలో మాట తప్పారు

*సింహగిరి కి అంతర్జాతీయ ఖ్యాతి తెస్తామన్నారు. . అభివృద్ధి లేక చేతులెత్తేశారు. .*

*సూర్యకళ పాలనపై విమర్శలు గుప్పిస్తున్న విహెచ్ పి నేతలు, ధార్మిక సంఘాలు*

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*   

*విశాఖపట్నం, జులై 28, 2022 (డిఎన్ఎస్):* సింహాచల క్షేత్రానికి ప్రపంచ ఖ్యాతి తీసుకువస్తామంటూ

ప్రగల్బాలు పలికిన ఎంవి సూర్యకళ ఆ మాట నిలబెట్టుకోవడంలో ఘోరంగా విఫలం చెందారని ధార్మిక సంఘాలు, విశ్వ హిందూ పరిషత్ విశాఖ జిల్లా సంయుక్త కార్యదర్శి పూడిపెద్ది శర్మ మండిపోతున్నారు. ఆమె ఫిబ్రవరి 2021 లో పదవి భాద్యతలు చేపట్టిన తొలినాళ్లలో కొంత నానా హంగామా చేసిన ఈమె ఏప్రిల్ 12 , 2021 మీడియా రంగాన్ని తుంగలోకి తొక్కుతూ, అవమానిస్తూ.

..ఒక పిఆర్ఓ ను రూ. 50 ,000 కు, ఫోటోగ్రాఫర్ కు రూ. 25 ,000 చొప్పున  ప్రతి నెలా జీతం ఇస్తూ నియమించారన్నారు. వీళ్లిద్దరి నియామకాన్ని బహిర్గతం చేసేందుకు నిర్వహించిన విలేకరుల సమావేశంలో మీడియా పై ఉక్కుపాదం మోపారన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ మీడియా కెమెరాలను ఆలయ రాజద్వారం దాటి లోపలకి అనుమతి లేదన్నారు. ఆలయ పిఆర్ వ్యవస్థే

సింహగిరికి ప్రపంచ దేశాల్లో మారుమ్రోగే విధంగా సోషల్ మీడియాల్లోను, జాతీయ మీడియాల్లోను విస్తృతంగా ప్రచారం చేస్తారంటూ ఉత్తర కుమార ప్రగల్బాలు పలికారు. అయితే ఈమె చెప్పిన కబుర్లపై నాటి ఆలయవర్గాలు ఎగిరి గెంతులు వేసాయి. దానికి ప్రధాన కారణం తాము ఆలయంలో చేసే తప్పిదాలు ఇకపై బయటకు వచ్చే అవకాశం లేక పోవడమే కారణం

అన్నారు. 

ఈమె నియమించిన పిఆర్ ఓ మూడు నెలలకే చెయ్యలేక తప్పుకున్నారు. ఆ తర్వాత ఓ అపర చాణుక్యుని,   అక్షరం ముక్క రాయడం రాని వ్యక్తిని పిఆర్ ఓ గా నియమించారు. వారికి ఆలయం లో జరిగే కార్యక్రమాలపై ఏమాత్రం అవగాహనా లేకపోగా, ప్రెస్ నోట్ రాయడానికి తీరిక లేకపోవడం గమనార్హం. రాయడం రాకపోయినా పైరవీలు చెయ్యడం లో మాత్రం

పిహెచ్ డి పట్టా ఉందని స్థానిక ఆలయ వర్గాలే గగ్గోలు పెడుతున్నాయి. నేటికీ ఆలయంలో జరిగే కార్యక్రమాలను మీడియా నోట్ రాయవలసిన భాద్యతను ఫోటోగ్రాఫరే యాతన పడుతుండడం గమనార్హం. పైగా సోషల్ మీడియా లో సింహగిరి ప్రచారం సంగతి ప్రక్కనబెడితే. . సాధారణ ప్రచారానికి కూడా నోచుకోక పోవడం ఈఓ పెద్ద ఘనకార్యంగా చెప్పవచ్చు అనే హిందూ ధార్మిక

సంఘాల అభిప్రాయపడుతున్నాయి.

గత ఏడాదిన్నర కాలంలో సూర్యకళ  ఆలయ మూల విరాట్ సేవలో తరించడం కంటే అధికార పార్టీ సేవలోనే ఎక్కువగా తరించారని,  దీనిలో భాగంగా ఆలయ వంశపారంపర్య ధర్మకర్తలుగా ఉన్న పూసపాటి వంశీయులను సైతం పెద్దగా లెక్కచేసింది లేదు. అయితే హైకోర్టు గట్టిగా హెచ్చరికలు జారీచేయడంతో తమ ఉద్యోగానికి ఎసరు

వస్తుందన్న ఏకైక కారణంతో కోటగుమ్మం తొక్కక తప్పని పరిస్థితి వచ్చిందన్నారు. 

స్థానిక అధికార పార్టీ పెద్ద చెప్పుచేతల్లోనే తన పరిపాలన అంతా సాగించింది అనే అపవాదు లాంటి నిజం మూటగట్టుకుని ఆలయ గేటు దాటుతున్నారు. ఈమె హయాంలో ఎన్నో తప్పుడు తడకలు, ఆలయ అప్రదిష్ట పనులు జరిగినా అన్నింటినీ మసిపూసి మారేడు కాయలు చేసిన

ఘనత వీరిదే. సింహగిరి కొండపై కొన్ని ప్రాంతాలను నిబంధనలు విరుద్దంగా కొందరికి అప్పగించారన్న అభియోగం కూడా వీరి ఖాతాలోనే ఉంది. 
అయితే గతంలో పనిచేసిన ఈఓల తో పోలిస్తే అధికార పార్టీ నేతలకు అత్యధికంగా సేవలు చేసిన ఘనత కూడా వీరి ఖాతాలోనే చేరిందన్నారు.
అధికార పార్టీకి చెందిన మాజీ లకు సైతం రాజద్వారా, పూర్ణకుంభ

స్వాగతాలు, పరివేష్ట మర్యాదలు, చాలానే జరిగాయి. వచ్చిన వాళ్ళు తాజాలా, మాజీల అనే తేడాయే తెలియకుండా వ్యవహరించిన ఘనత వీరిదే అన్నారు. 

అన్నింటికంటే ప్రధానంగా పూర్ణకుంభ స్వాగతం అర్హత లేని వారికి అత్యంత ఘనంగా అందించిన ఖ్యాతి వీరిదే. ఒక పీఠాధిపతి అండతో ఆలయం విధుల్లోకి చేరినట్టుగా ప్రచారం లో ఉన్నా, వారికీ కూడా

ఆలయంలో పెద్ద ప్రాధాన్యత ఇచ్చినట్టు ఎక్కడ కనపడలేదు. 

గతంలో చైర్మన్ గా భాద్యతలు చేపట్టిన సంచయిత సంప్రదాయ విరుద్ధంగా ప్రతిసారీ ఆలయంలోకి ప్రవేశించినప్పడికి ఈమె వారించినా దాఖలాలు లేవు. పైగా వైదిక పరమైన కొన్ని అంశాల్లో సైతం తప్పిదాలు జరిగినా చర్యలు తీసుకోక పోవడం తో మీడియాల్లో విస్తృత కధనాలు రావడం, ధార్మిక

సంఘాలు పెద్ద ఎత్తున నిరసనలు చెయ్యడంతో తప్పని పరిస్థితుల్లో వారిపై చర్యలకు లేఖ వ్రాయడం జరిగిందన్నారు. 

తానూ ఆలయ అభివృద్ధి చేస్తున్నట్టుగా అందరి దృష్టికి తెలియాలి అనే ఏకైక సంకల్పంతో పుట్టలు, చెట్లు, గుట్టలు తిరుగుతూ, తమ వెంట ఫోటో, వీడియో గ్రాఫర్లను త్రిప్పుతూ, ప్రతి అంశాన్ని చిత్రీకరించే ప్రయత్నం

మాత్రం విస్తృతంగా చేసారు. చాలా విషయాల్లో ఆలయ అర్చకులతో పొసగక, వారిపై చర్యలు తీసుకునే స్థాయి వరకూ వెళ్లినట్టు తెలుస్తోంది. అయితే అవి వైదిక పరమైన అంశాలు కావడంతో తప్పిదం మొత్తం తనవైపు తిరుగుతుందని భయంతో వెనక్కి తగ్గినా సందర్భాలు కూడా ఉన్నాయి అని ఆలయ వర్గాలే చెప్తున్నాయి. 

ఏది ఏమైనా.. . వీరి హయాంలో కొన్ని

మంచి పనులైతే జరిగాయి అని చెప్పాలి. సిబ్బంది లో ఒక క్రమ పద్దతి అలవాటు అయ్యింది. మొబైల్ ఫోన్లు ఆలయంలోకి అనుమతి ఇవ్వక పోవడం గమనార్హం.


Latest Job Notifications

Panchangam - Dec 4, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam