DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వాళ్ళు హిందూ తలలు కోస్తున్నారు.. హిందూ డాక్టర్లు తలలు నిలబెడుతున్నారు 

*90 డిగ్రీలు మెడ వంగిన పాక్ బాలిక కు ఢిల్లీ లో హిందూ వైద్యుడు రాజగోపాలన్ ఉచిత చికిత్స*

*ఈమే భారత్ కు రాడానికి అనుమతిచ్చిన ప్రభుత్వాలకు నీతిపాఠం చెప్పిన హిందూ డాక్టర్*

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*   

*విశాఖపట్నం, జులై 30, 2022 (డిఎన్ఎస్):* ఉగ్రవాద మతోన్మాద ప్రేరేపిత ముస్లిం వర్గాలు

భారతీయ హిందువుల తలలు తెగనరుకుతుంటే (శర్ తన్ సే జూదా)  కళ్లప్పగించి చూస్తున్న ప్రపంచానికి బుద్ది వచ్చేలా గట్టి గుణపాఠం చెప్పారు ఢిల్లీ కి చెందిన హిందూ డాక్టర్ రాజగోపాలన్ కృష్ణన్. వివరాల్లోకి వెళితే. . 

పాకిస్తాన్‌కు చెందిన 13 ఏళ్ళ అఫ్షీన్ గుల్  సెరిబ్రల్ పాల్సీ అనే అనారోగ్య కారణంగా మెడ 90 డిగ్రీలు

వంగిపోయింది. దీంతో ఆమె కు బయట అందరిలాగా తిరగలేని దుస్థితి వచ్చింది. పాకిస్తాన్ లో దీనికి వైద్యం చేసే సదుపాయం లేకపోవడం తో ఇతర ప్రాంతాల్లో ఎందరో వైద్యులను సంప్రదించాడు ఆమె సోదరుడు యాకూబ్. ఏ ఒక్కరూ కూడా దీనికి పూర్తి విజయవంతమైన చికిత్స చేస్తామని చెప్పకపోగా, వ్యాధి కి సరైన శస్త్ర చికిత్స చెయ్యకపోతే మనిషి బ్రతికే

అవకాశం లేదు అని కూడా చెప్పేసారు ట. 

పాకిస్తాన్ నటుడు ఒకరు ఈమె వ్యాధి గురించి తెలిపి, చికిత్స చేయమని సోషల్ మీడియా లో పెట్టిన పోస్ట్ ద్వారా ఒక బ్రిటన్ పాత్రీకీయుడు స్పందించి, డాక్టర్ రాజగోపాలన్ కృష్ణన్ కు సమాచారాన్ని అందించేలా ట్వీట్ చేసారు. 

అయితే రోగి శత్రు దేశాలకు చెందినవాళ్ళైనా వ్యాధికి

చికిత్స చేయవలసిన భాద్యత వైద్యులపై ఉంది అని భారతీయ హిందూ ధర్మం చెప్పింది. దీన్ని పూర్తిగా అవలోకనం చేసుకున్న డాక్టర్ రాజగోపాలన్ కృష్ణన్, వీళ్ళ ఆర్థిక పరిస్థితి తెలుసుకుని, ఈమెకు పూర్తిగా ఉచితంగా శస్త్ర చికిత్స చేసేందుకు ముందుకు వచ్చారు. 

యాకూబ్ తన సోదరి అఫ్షీన్‌తో కలిసి గత సంవత్సరం నవంబర్ 16న మళ్లీ

భారతదేశాన్ని సందర్శించారు మరియు డాక్టర్ కృష్ణన్ ఆమెను కలుసుకున్నారు మరియు అఫ్షీన్‌కు పూర్తిగా ఉచితంగా శస్త్రచికిత్స చేయడానికి తన సేవలను అందించారు.

ఆమెను కలిసిన తర్వాత, చికిత్స చేయకపోతే ఆమె స్వల్ప లేదా మధ్యస్థ కాలంలో చనిపోయే అవకాశం ఉందని డాక్టర్ కృష్ణన్ చెప్పారు. 

ఈ కేసు

వివరాలు:

ప్రపంచంలోనే ఇలాంటి కేసు ఇదే తొలిసారి అని ఆయన అన్నారు. ఆమె మస్తిష్క పక్షవాతం కారణంగా, అఫ్షీన్ ఆరేళ్ల వయసులో నడవడం మరియు ఎనిమిదేళ్ల వయసులో మాట్లాడటం నేర్చుకుంది, కానీ ఆమె ఒక సంవత్సరం వయస్సులో ఉన్నప్పుడు ఆమె మెడ వంగడం ప్రారంభించింది.

మొట్టమొదట ఆమె కొంత సమయం వరకు ఆమె మెడ నిటారుగా ఉండేందుకు

డిసెంబరు ప్రారంభంలో హాలో-గ్రావిటీ ట్రాక్షన్‌ను తిరిగి అమర్చాల్సి వచ్చింది. డాక్టర్ మనోజ్ శర్మ, మత్తుమందు వైద్యులు డాక్టర్ జయలలిత, డాక్టర్ చేతన్ మెహ్రా మరియు డాక్టర్ భాను పంత్‌లతో కూడిన డాక్టర్ కృష్ణన్ బృందం ఫిబ్రవరి 28న ఆరు గంటలపాటు జరిగిన ఆపరేషన్‌లో అఫ్షీన్ పుర్రెను ఆమె వెన్నెముకకు కలిపారు. వైద్యులు నోటి

ద్వారా ఆపరేషన్ చేసి మెడలోని డిస్క్‌లను తొలగించారు. మెడ నిటారుగా ఉంచడానికి రాడ్ మరియు స్క్రూలను ఉపయోగించి గర్భాశయ వెన్నెముకకు పుర్రెను పరిష్కరించారు.

అఫ్షీన్ ఈ నెలలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ కానున్నారు. అయితే, ఆమె మెడ కు నేక్ బ్యాండ్ పెట్టుకోవడం కొన్నాళ్ళు కొనసాగించాలని

తెలిపారు. 

ప్రపంచానికి గుణపాఠం లాంటి  ఈ అద్భుతమైన ఉచిత వైద్య సేవ ను పాకిస్తాన్ బాలిక పొందిన తర్వాతే (2021 డిసెంబర్ లో ). . భారత దేశంలో ఐదుగురిని తలలు నరికి మరీ చంపారు (మే, జూన్ 2022 ల్లో)  పాక్ ప్రేరేపిత మతోన్మాదులు.  

పాక్ మతోన్మాదులు భారతీయ హిందువుల తలలు నరికి చంపి మరీ వీడియోలు తీసి భారతీయ

హిందువులను హెచ్చరిస్తూ ఉంటె. .అదే దేశానికి చెందిన పౌరులకు భారతీయ హిందూ వైద్యులు విజయవంతమైన ఆపరేషన్లు చేస్తున్నారు. ( ఇప్పడికే కొన్ని వందల మంది పాక్ పౌరులకు భారత్ లో శస్త్రచికిత్సలు జరిగాయి )

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam