DNS Media | Latest News, Breaking News And Update In Telugu

యువతకు విద్యే సమాజంలో ఉన్నత గౌరవం అందిస్తుంది : దేవనాథ జీయర్ స్వామి  

*గుడిలోవ విజ్ఞాన విహార్ స్కూల్ పిల్లలకు జీయర్ స్వామి మార్గదర్శక అనుగ్రహ భాషణం*

*సంస్కారాన్ని అందించే స్కూళ్ళు దేశ వ్యాప్తంగా అన్నిచోట్లా నెలకొల్పాల్సిన అవసరం ఉంది*

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*   

*విశాఖపట్నం, ఆగస్టు  05, 2022 (డిఎన్ఎస్):* ఉత్తమమైన విద్య ఒక్కటే  యువత కు

సమాజంలో అత్యుత్తమ గౌరవం, ఉన్నత భవిష్యత్ కు రాజమార్గం అందిస్తుందని పరమహంస పరివ్రాజకులు, త్రిదండి దేవనాథ రామానుజ జీయర్ స్వామి తెలియచేసారు. విశాఖ శివారు ప్రాంతమైన గుడిలోవలో గల విజ్ఞాన విహార స్కూల్లో విద్యార్థులను ఉద్దేశించి దేశ భక్తి - విద్య శక్తి అంశం పై అనుగ్రహ భాషణం చేసారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ  వేదం లో

చెప్పబడిన ఒక సంస్కృత శ్లోకాన్ని తెలియచేసారు. ఈ శ్లోకం ప్రకారం విద్యార్థి కి ఉండవలసిన లక్షణాలు ఏంటో వివరించారు. 

విద్యార్థి దశలో సరైన నిర్ణయం తీసుకోకుండా, విలువైన సమయాన్ని వృధా చేస్తే భవిష్యత్ అగమ్యగోచరం అవుతుందన్నారు. విద్యతో పాటుగా దేశ గౌరవ ప్రతిష్టలను కూడా నిలబెట్టవలసిన భాద్యత విద్యార్థులు, యువతపై

ఉందన్నారు. దేశ  వ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్యాచరణ చేయగలుగున్నయి అంటే పాలకుల వెనుక ఉండి కార్యాచరణ చేసేది కేవలం విద్యావంతులైన ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నత అధికారులేనన్నారు. పాలకులు మారినా, కార్యాచరణ చేసే అధికారి తన హోదా లోనే పదవి విరమణ చేసేవరకూ కొనసాగుతారన్నారు. ప్రతి విద్యార్థి ఒక ఉన్నతమైన

లక్ష్యాన్ని పెట్టుకుని, ఉపాధ్యాయులు, గురువులు చెప్పే విషయాలను కూలంకషంగా అవలోకనం చేసుకోవాలన్నారు. గతంతో పోలిస్తే.. నేటి సమాజంలో ఉన్నతమైన డిగ్రీ లు పొందుతున్న వారు ఎక్కువగానే ఉన్నారు కానీ వారికి తగిన దిశా నిర్దేశం లేకపోవడం వలన దేశ భవిష్యత్ కన్నా సొంత భవిష్యత్ వైపే అధిక శ్రద్ధ పెడుతున్నారన్నారు. అయితే విద్యార్థి

దశ నుంచి దేశం పట్ల వీరి బాధ్యతలను తెలియచేయవలసిన భాద్యత ఉపాధ్యాయులపై ఉందన్నారు. 
నేటి విద్యార్థులు భవిష్యత్ లో ఇంజనీర్లుగా, డాక్టర్లు, ఐఏఎస్ లు, ఐపీఎస్ లుగా, శాస్త్రవేత్తలుగా, సైనికులుగా ఇలా ఎన్నో రంగాల్లో అడుగు పెట్టె అవకాశం ఉందని, వీరందికీ తమ వృత్తి పట్ల బాధ్యతతో పాటు, దేశం పట్ల అభిమానం, గౌరవం తప్పనిసరిగా

ఉండవలసిన అవసరం ఉందన్నారు. వీరందరూ క్రమశిక్షణతో ఉంటెనే. దేశం పురోగతి సాధిస్తుందన్నారు. 

గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి గా సేవలు అందించిన ఒక నాయకుడు విద్యావంతుడు కానందున, నాటి పరిపాలన మొత్తం వెనుక ఉన్న విద్యావేత్తలైన అధికారులే నడిపించారన్నారు. రాష్ట్రం అభివృద్ధిలో ఎక్కడ కూడా వెనుక అడుగు పడకుండా

కాపాడిన ఘనత నాటి అధికారులదే నన్నారు. 

విదేశాలకు వెళ్లినా సంస్కారం వదిలి పెట్టొద్దు . . .

ఉన్నత విద్య కోసం భారత్ దేశాన్ని వదిలి, విదేశాలకు వెళ్లినా భారతీయ సనాతన సంస్కృతిని వదిలిపెట్టవద్దు అని స్వామిజి విద్యార్థులకు సూచించారు. మన సంస్కృతే మనకు మార్గదర్శకంగా మారుతుందన్నారు. కొత్త ప్రాంతాల్లో

కొత్త పరిచయాల వలన అందరికి మంచి కలిగే విధానాన్నే అలవర్చుకోవాలన్నారు. 

సంస్కారాన్ని అందించే స్కూళ్ళు అన్నిచోట్లా రావాలి :

ఒక మంచి సంస్కారవంతమైన విద్యను అందిస్తున్న విజ్ఞాన విహార్ వంటి స్కూళ్ళు రాష్ట్ర వ్యాప్తంగాను, దేశ వ్యాప్తంగానే మరిన్ని నెలకొల్పవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. క్రమ శిక్షణతో

కూడిన ఒక ఉన్నత విద్య విధానాన్ని అందిస్తున్న పాఠశాల నిర్వాహకులను స్వామిజి అభినందించారు.

హైందవ సంప్రదాయం ప్రకారం కార్యక్రమమని జ్యోతి ప్రజ్వలన చేసి, స్వామి వారి గురించిన వైభవాన్ని విద్యార్థులకు తెలియచేసారు. ఈ కార్యక్రమం లో పాఠశాల చైర్మన్ పివి నారాయణ రావు,  స్వచ్ఛ్ భారత్ నిర్వహణలో రికార్డు గ్రహీత ఆడారి

కిషోర్ కుమార్, పాఠశాల ప్రిన్సిపాల్ రమణయ్య, తదితరులు పాల్గొన్నారు. 

స్వామీజీకి విద్యార్థుల అపురూప స్వాగతం.. .

అంతకు ముందు పాఠశాలలోకి ప్రవేశించిన దేవనాథ స్వామిజి కి పాఠశాల విద్యార్థిని విద్యార్థులు వేద శ్లోక పఠనం తోనూ, బ్యాండ్ తోనూ, త్రివర్ణ పతాకం తోనూ, నృత్యం తోనూ ఘన స్వాగతం పలికారు.

 కార్యక్రమం వందన సమర్పణలో శాంతి మంత్రం జపించడం తో కార్యక్రమం పూర్తి అయ్యింది. తదుపరి వరుస క్రమంలో విద్యార్థులు స్వామి వారి ఆశీస్సులు అందుకున్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam