DNS Media | Latest News, Breaking News And Update In Telugu

13 నుంచి వీఎండీఏ - కళాభారతి వార్షికోత్సవాలు, అందరికి ఆహ్వానం

*డా. సోనాల్ మాన్ సింగ్ కి నాట్య విద్యా భారతి పురస్కారం* 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*   

*విశాఖపట్నం, ఆగస్టు  08, 2022 (డిఎన్ఎస్):* ఈ నెల 13 వ తేదీ నుంచి విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ - కళాభారతి 36 వ వార్షికోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్టు సంస్థ అధ్యక్షులు మంతెన సత్యనారాయణ

రాజు, కార్యదర్శి జి ఆర్ కె  రాంబాబు లు తెలియచేసారు. సోమవారం కళాభారతి లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గత 35 సంవత్సరాలుగా విశాఖ పట్నం కేంద్రంగా అనేకరకాల కళాకారులను ఆహ్వానించి కళలను ప్రోత్సహిస్తూ కళాకారులకు సహాయం చేస్తున్నట్టు తెలిపారు.  

దీనిలో భాగంగా జాతీయ పురస్కారం బహుమతి లక్ష

రూపాయల క్యాష్ అవార్డు, ప్రశంసా పత్రం, నూతన వస్త్రాలు, వాటితోపాటు ప్రతిష్టాత్మకమైన "నాట్య విద్యా భారతి" బిరుదు ప్రధానం ఈ నెల అంటే ఆగస్టు 13 వ తారీకు శనివారం నాడు సాయంత్రం 6 గంటల 15 నిమిషాలకు జరుగుతుందన్నారు. 

ఈ సంవత్సరం ఎక్స్పర్ట్ కమిటీ మరియు విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ ట్రస్టు బోర్డు పద్మవిభూషణ్

డాక్టర్ సోనాల్ మాన్ సింగ్ ఒడిస్సి మరియు భరతనాట్య రీతులలో ఎంతో ప్రావీణ్యత పొంది గత ఆరు దశాబ్దాల పైన కృషి చేసి పట్టు సంపాదించి అనేక శిష్య ప్రశిష్యులను తయారుచేసి 94 దేశాలలో నృత్య  ప్రదర్శనలిచ్చి భారతదేశానికి గర్వకారణమైన సోనాల్ మాన్ సింగ్ కి ఈ సంవత్సరం" నాట్య విద్యా భారతి బిరుదు" ప్రదానం జరుగుతుంది.



బిరుదు ప్రధానోత్సవం కి ముఖ్య అతిథిగా వైస్ అడ్మిరల్ దాస్ గుప్తా, ఏవిఎస్ఎం,  వైఎస్ఎం,  ఎస్ఎంఎస్  చేతుల మీదుగా ఈ  బిరుదు ప్రదానం జరుగుతుంది.

సత్కార సభ అనంతరం అవార్డు గ్రహీత Dr. సోనాల్ మాన్సింగ్ వారి శిష్య బృందంతో" క్రిష్ణ కాలియా" నిత్య ప్రదర్శన చేసి అందరినీ అలరించి ఉన్నారు ఈ మొదటి రోజు కార్యక్రమానికి

వదాన్యులు కళాభారతి అధ్యక్షులు మంతెన సత్యనారాయణ రాజు గారు 2.5 లక్షలు సాయం అందించారు. ఈ అవార్డు లో భాగంగా  రమారమి మూడు లక్షల రూపాయలు విలువచేసే స్వర్ణకమలంని వైభవ్ జ్యువెలర్స్ గత 19 సంవత్సరాలుగా ఇస్తున్నారు.

రెండో రోజు కార్యక్రమంలో భాగంగా సంగీత కళానిధి"  నైవేలీ సంతానగోపాలన్ , చెన్నై వాస్తవ్యులు అద్భుతమైన

గాత్ర సంగీత కచేరి ని చేయనున్నారు.

మూడవ రోజు ఆగస్టు 15 నాడు "సంగీత కళా భారతి" డాక్టర్ పంతుల రమ గాత్ర సంగీత కచేరి ఉంటుంది.

నాలుగవ రోజు అంటే బుధవారం 16 వ తారీఖున ప్రముఖ గాత్ర సంగీత విద్వాంసులు చెన్నై వాస్తవ్యులు మధురై  కృష్ణ టిఎన్ శేషన్ గోపాలన్ గాత్ర కచేరీ ఉంటుంది.

ఐదో రోజు 17. 8. 22 బుధవారం నాడు

సితార్  హిందుస్తానీ- వయొలిన్ కర్ణాటక instrumental జుగల్బందీ ఉంటుంది .

ఆరవ రోజున అంటే 18 గురు వారం నాడు ప్రముఖ గాత్ర విద్వాంసురాలు బెంగళూరు వాస్తవ్యులు M.S.షీలా గాత్ర కచేరీ ఉంటుంది.

చివరి రోజు అంటే ఏడవ రోజు  శుక్రవారం నాడు ప్రస్తుత కాలమాన పరిస్థితుల్లో తెలుగుని మరిచిపోయి పద్యాలను పూర్తిగా మర్చిపోయి

కొనసాగుతున్న ఈ సమాజంలో తెలుగు పద్య నాటకం" అల్లసాని పెద్దన" కార్యక్రమం ఉంటుంది.

ఈ కార్యక్రమాలకు ఆర్థిక సహాయం అందించి విజయం చేకూరాలని సహకరించిన వారు ఎస్.ఆర్.కె Infra ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్, వైభవ్ జ్యువెలర్స్ , సి ఎస్ న్ రాజు,  డి.ఎస్.ఎన్ రాజు అండ్ లక్ష్మీకాంతం , ది కనకమహాలక్ష్మి కోఆపరేటివ్ బ్యాంక్,

కంకటాల సిల్క్స్, మహామారుతి లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ , సాముద్రిక సాఫ్ట్వేర్ , ఎం ఆర్ సి అధిపతి శ్రీ రాంబాబు వీరందరికీ కూడా పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు 

 ముఖ్యంగా సంగీతం నాటకం సాహిత్యం ఇలాంటివన్నీ మరుగున పడి పోకుండా ప్రోత్సహించే సదుద్దేశంతో,  గురువుల దగ్గర ముఖతః గానే కాకుండా చూసి కూడా

చాలా నేర్చుకోవాల్సి ఉంటుందని ఈ జెనరేషన్ వాళ్ళు అందరికీ అవకాశం కల్పించాలని విశాఖ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీ అన్ని కార్యక్రమాలకు ఉచితంగా ప్రవేశం కల్పిస్తూ అందరిని ఆహ్వానిస్తోంది.

గురువులు, శిష్యులు ప్రశిష్యులు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అధిక సంఖ్యలో విచ్చేసి చూసి ఆనందించి

విజయవంతం చేయాలని కోరుతున్నాం.

ముందుగా కార్యక్రమాల ఆహ్వాన పత్రికను అధ్యక్షులు M.S.N. రాజు, కార్యదర్శి గుమ్ములూరి రాంబాబు, పైడా కృష్ణ ప్రసాద్, మల్లిక మనోజ్ గ్రంధి , నరసింగరావు, మోహన్ దాస్ విడుదల చేశారు.
 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam