DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఋగ్వేదీయులు ఉపాకర్మ ఈ నెల 11 న కాదు, సెప్టెంబర్ 8 నే ఆచరించాలి 

  *(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*   

*విశాఖపట్నం, ఆగస్టు  09, 2022 (డిఎన్ఎస్):* ఋగ్వేద సంప్రదాయ పరులు ఉపాకర్మను ఈ నెల 11 వ తేదీన కాకుండా, సెప్టెంబర్ 8 న జరుపుకోవాలని త్రిదండి చిన్న జీయర్ స్వామి వారి పంచాంగం తెలియచేస్తోంది.  
 
యజ్ఞోపవీధారి అయిన బ్రహ్మచారులు తప్పనిసరిగా ఆచరించవలసిన

కార్యక్రమాల్లో ప్రధానమైనది ఉపకర్మ. అయితే ఒక్కో వేదం సంప్రదాయం విద్యార్థులు నిర్ణిత రోజున ఆచరించవలసి ఉంటుంది. అందరికి ఆమోద యోగ్యమైన విధానం ప్రకారం యజుశాఖ వారు నిర్వహించుకునే శ్రావణ పౌర్ణమి రోజున, యజుశాఖ వారి తో పాటు, తాము ఏ వేదశాఖ కు చెందిన వారో తెలియని వారు ఎవరైనా నిర్వహించుకోవచ్చు అని సంప్రదాయ వాదులు

తెలియచేస్తున్నారు. 

ఈ క్రమంలో ఋగ్వేదీయులు శ్రావణ మాసంలో శ్రవణ నక్షత్రం రోజున ఋగ్వేద సంప్రదాయం వారు ఉపాకర్మ ఆచరిస్తారన్నారు. అయితే సూర్యోదయ సమయంలో ఉత్తర ఆషాఢ నక్షత్రం ఉండకూడదు. దీని ప్రకారం ఈ నెల 11 వ తేదీన శ్రవణ నక్షత్రం సూర్యోదయం తర్వాత ఉండడంతో ఈ రోజున ఋగ్వేదీయులు చెయ్యకూడదని, భద్రపదమాసం లో శ్రావణ

నక్షత్రం ( సెప్టెంబర్ 8 వ తేదీన ) సూర్యోదయం నాటికి ఉండడంతో ఆ రోజునే ఉపాకర్మ జరుపుకోవాలని త్రిదండి చిన్న జీయర్ స్వామి వారి పంచాంగం తెలియచేస్తోంది.  

యజుర్వేద సంప్రదాయం వారు యధావిధిగా శ్రావణ మాసం లో పౌర్ణమి రోజున (ఆగస్టు 12 న)  ఉపాకర్మ జరుపుకోవాలని తెలియచేసింది. 

సామ వేద సంప్రదాయ విద్యార్థులు ఉపా

కర్మను  శ్రావణ అమావాస్య తర్వాత  భాద్రపద శుక్లపక్షంలో హస్తా నక్షత్రం నాడు ఉపాకర్మ ను జరుపుకోవాలని తెలిపింది. దీని ప్రకారం ఆగస్టు 30 న ఆచరించడం జరుగుతుంది. 

అథర్వవేదం: సూర్యోదయ సమయంలో పూర్ణిమ వచ్చే రోజున ఉపాకర్మ ను చేస్తారు. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam