DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నరేంద్ర మోడీ అధికార ఆగమనంతో ఆంధ్ర  అభివృద్ధి ముఖ చిత్రం మారుతోంది

*2014 ముందు వరకూ అభివృద్ధి ఆమడ దూరంలోనే, నేడు వడివడి అడుగులు*

*విభజన బిల్లులో ఉన్నవి కొన్నే. . మోడీ ఇచ్చిన ప్రాజెక్ట్ లు అంతకు మించి ఎన్నో*   

*ఏపీ..ముఖచిత్రం.. మోడీ కు ముందు.. మోడీ వచ్చాక. .DNS  ప్రత్యేక కథనం*

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*   

*విశాఖపట్నం, ఆగస్టు  17, 2022

(డిఎన్ఎస్):* ఆంధ్ర ప్రదేశ్ ఈ పేరు చెప్పగానే అందరికి ఎక్కడలేని అభిమానం పొంగిపొరలు తుంది. అయితే అభివృద్ధి దిశగా అడుగులు మాత్రం వెయ్యలేకపోయింది. ప్రధాన కారణం కుటుంబ పాలనా, వ్యక్తిగత లాభాలే నాటి పాలకుల ప్రధాన అజెండా గా ఉండడమే. 
అయితే ఈ దుస్థితి నుంచి విముక్తి లభించింది మాత్రం 2014 జూన్ నుంచే అని చెప్పాలి. నరేంద్ర మోడీ

భారత ప్రధానమంత్రి గా భాద్యతలు చేపట్టాక కేంద్రం నుంచి ఆంధ్ర కి లభించవలసిన సంక్షేమ పథకాలు, భారీ ప్రాజెక్ట్ లు ఎటువంటి జాప్యం లేకుండా అందుతుండడంతో ప్రజల్లో కేంద్రం రాష్ట్రాలకు ఏమి ఇస్తుంది అనే విషయం దేశ స్వాతంత్య్రం వచ్చిన  70  సంవత్సరాల  తర్వాతే తెలిసింది. అంతకు ముందు వరకూ అధికారంలో ఉన్న పాలకులు కేవలం ఢిల్లీ

పాలకుల గెట్ దగ్గరే వేచి ఉండడం కోసం తమ పూర్తి సమయాన్ని వెచ్చించాల్సి వచ్చేది. ఇక  పథకాలు వచ్చేది ఎలా, అమలు చేసేది ఎలా? దీనికి ప్రధాన నిదర్శనం భారత దేశంలో అత్యంత దుర్మార్గపు పాలనా ఇందిర దే అని చెప్పాలి. తన అధికార దాహం కోసం 1975 జూన్ 25 రాత్రి దేశవ్యాప్తంగా అత్యయిక పరిస్థితి ప్రకటించింది. ఈ దెబ్బతో తదుపరి ఎన్నికల్లో భారత

దేశం మొత్తం కాంగ్రెస్ ఓడిపోయినా. . .ఆంధ్ర లో మాత్రం 41 ఎంపీ సీట్లు గెలుచుకుంది. ఏ స్థాయిలో పాలకులు ప్రజలను మభ్యపెట్టారో బహిర్గతమవుతోంది. 
నేటి వరకూ ఆంధ్ర లో అభివృద్ధి అంటే ఏంటో మ్యాచుకు కూడా తెలియని స్థితి. అయితే 2014 జూన్ తర్వాత ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి దిశాదశ పూర్తి మారిపోయాయి. దీనికి కారణం రాష్ట్రంలో అధికారంలో ఏ

పార్టీ ఉంది అనే అంశంతో సంబంధం లేకుండా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వం ఏపీ కి ఇచ్చిన ప్రాజెక్ట్ లు, విద్య సంస్థలే ప్రత్యక్ష నిదర్శనంగా కనపడుతున్నాయి. అయితే రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ లో సమర్ధవంతమైన నాయకులూ, విద్యావంతులు, ప్రచారకర్తలు లేని కారణంగా ప్రపంచం మొత్తం ప్రశంసలు పొందిన నరేంద్ర

మోడీ ని ఆంధ్ర రాష్ట్ర ప్రజల ముందు దోషిగా నిలబడవలసిన గతి పట్టించారు.  
అసలు నరేంద్ర మోడీ రాకకు ముందు ఆంధ్ర ప్రదేశ్ అంటే కేవలం హైదరాబాద్ నగరం మాత్రమే అనేలా అన్ని ప్రభుత్వాలు కేవలం హైదరాబాద్ ని మాత్రమే అభివృద్ధి చెందించారు. మిగిలిన ప్రాంతాలు అసలు మాకు పట్టింపు లేదు అనే విధంగా తుంగలోకి తొక్కారు. అందుకే రాష్ట్ర

విభజన సమయంలో హైదరాబాద్ కోసం పోరాటాలే జరిగాయి. దీనిలో ప్రతి ఒక్క పాలకుడూ దోషే.

దీన్ని గమనించిన నరేంద్ర మోడీ పార్టీలతో ప్రమేయం లేకుండా ఆంధ్ర ప్రదేశ్ కు అందించిన పథకాలు, పరిశ్రమలు, నిధులు అన్ని రాష్ట్రాలకంటే అధికంగానే కేటాయించడం జరిగింది. వీటిల్లో రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలతో పాటు, ఆ జాబితాలో లేని

సంస్థలు కూడా డజన్ల కొద్దీ ఆంధ్ర కు కేటాయించడం జరిగింది. 

2014 జూన్ నుంచి నేటి వరకూ భారత ప్రధాని నరేంద్ర మోడీ సారధ్యంలోని కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర ప్రదేశ్ కు ఇచ్చిన ప్రాజెక్ట్ లు ఇవే. . .
 
1. ఐఐటీ తిరుపతి :  ఏపీకి కేటాయించి న ఇండియన్ ఇన్ స్టిట్యూ ట్ ఆఫ్ టెక్నా లజీ (ఐఐటీ)ని తిరుపతి సమీపంలో ఏర్పాటుకి పూను

కున్నారు. 548.11 ఎకరాల స్థ లం కేటాయిం చారు. తొలిదశ పూ్తరయినట్టు ఆధికారికంగా ప్రకటిం చారు. 2015-16 విద్యా సంవత్సరం నుం చే తరగతులు ప్రారంభమయ్యా యి.

2. ఐఐఎం విశాఖపట్నం :  ఇండియన్ ఇన్ స్టిట్యూ ట్ ఆఫ్ మేనేజ్ మెం ట్ (ఐఐఎం) విశాఖపట్నం లో ప్రారంభిం చారు. 2015లోనే కార్యకలాపాలు మొదలయ్యా యి. విశాఖ నగరానికి సమీపంలో గంభీరం గ్రామ

పరిధిలో 241 ఎకరాల భూమి కేటాయిం చారు. క్యాంపస్ నిర్మాణ పనులు పూర్త యి ప్రస్తుతం సొంత భవనాలలోనే తరగతులు జరుగుతున్నాయి.  పూతిర్స్థాయి సౌకర్యాలతో గంభీరంలోని క్యాంపస్ పనిచేస్తోం ది. ప్రస్తు తం ఒక్కో సెక్షన్ లో 75 మంది విద్యార్థు లతో నాలుగు సెక్షన్లలో 300 మంది విద్యార్థు లు చదువుతున్నారు . వీరందరికీ గంభీరంలోని నూతన

క్యాంపస్ భవనాల్లోనే హాస్టల్ వసతి కల్పిం చారు.

3. ఐఐఐటీడీఎం కర్నూలు :  ఇండియన్ ఇన్ స్టిట్యూ ట్ ఆఫ్ ఇన్ఫర్మేష న్ టెక్నా లజీ, డిజైన్ అండ్ మాన్యూఫాక్చరిం గ్ (ఐఐఐటీడీఎం) కర్నూలులో ఏర్పాటయ్యింది. ఇందులో కంప్యూటర్ సైన్స్ ఇంజినీరిం గ్, ఎలక్ట్రాని క్స్ అండ్ కమ్యూనికేష న్స్ ఇంజినీరిం గ్, మెకాని కల్ ఇంజినీరిం గ్,

డిపార్ట్ మెం ట్ ఆఫ్ సైన్సెస్ విభాగాలలో విద్యార్థు లకు ప్రవేశం కల్పిస్తున్నారు . తొలుత తమిళనాడులోని కాంచీపురం ఉన్న ఐఐఐటీడీఎంలో భాగంగా 2015లో ప్రారంభిం చారు. 2018లో కర్నూలుకి తరలిం చారు. కర్నూలులో ఈ విద్యా సంస్థ కోసం ఏపీ ప్రభుత్వం 151 ఎకరాలు కేటాయించిం ది. క్లాసు లు సొంత భవనాల్లో జరుగుతున్నాయి. 

4. ఎన్ఐటీ

తాడేపల్లిగూడెం:  నేషనల్ ఇన్ స్టిట్యూ ట్ ఆఫ్ టెక్నా లజీ, ఆంధ్రప్రదేశ్ (ఎన్ఐటీ)ని పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం లో ఏర్పాటు చేశారు. 2016 లో శాశ్వత భవనాల నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. తొలిదశ నిర్మాణపనులు పూర్తయ్యా యి. సుమారుగా రూ. 416  కోట్లను వెచ్చించి క్లాసు లు, హాస్టళ్లతో పాటు ఇతర వసతుల కల్పన కొం త వరకూ

జరిగింది. రెం డోదశలో మరో రూ. 750 కోట్ల నిధులు సుమారుగా అవసరం అవుతాయని అంచనా వేస్తున్నారు . ఆ మేరకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపిం చారు. ఎన్ఐటీ తాడేపల్లిగూడెం లో 2600 మంది వరకు విద్యార్థు లు ఉన్నారు . వారిలో 150 మంది విదేశీ విద్యార్థు లు సైతం ఉన్నారు . 2019 నుంచి సొంత భవనాల్లో క్లాసు లు జరుగుతున్నాయి. 

5. ఐఐఎస్ఈఆర్

తిరుపతి:  ఇండియన్ ఇన్ స్టిట్యూ ట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేష న్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్ఈఆర్) ని తిరుపతిలో ప్రారంభిం చారు. 2015లోనే తరగతులు ప్రారంభిం చారు. ఏర్పేడు మండలంలోనే ఐఐటీ తిరుపతికి సమీపంలో శాశ్వత భవనాలు 2020 లో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. 540 మంది విద్యార్థులకు తరగతి గదులు, హాస్టల్ వసతి కూడా సొంత భవనాల్లో

నిర్వహిస్తున్నారు. 

6. సెంట్రల్ యూనివర్సిటీ అనంతపురం:  సెం ట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో అనంతపురంలో ఏర్పాటు చేశారు. 2015 నుంచి తరగతులు నిర్వహిస్తున్నారు . జేఎన్టీ యూకి చెం దిన భవనంలో క్లాసు లు, హాస్టల్ ఏర్పాటు చేశారు. శాశ్వత భవనాల నిర్మాణం సాగుతోం ది. 491 ఎకరాల భూమిని 2019లో ఏపీ ప్రభుత్వం

అప్పగించింది. కేంద్ర ప్రభుత్వం ఈ యూనివర్సిటీ నిర్మాణం పూతిర్చేయాలంటే రూ. 1500కోట్లు అవసరం ఉంటుం దని అధికారు లు చెబుతున్నారు. 2020- 21 బడ్జెట్ లో రూ. 60.35 కోట్లు , అంతకుముం దు బడ్జెట్లో రూ. 4.85 కోట్లు వచ్చా యి. ఈసారి బడ్జెట్ లో రూ. 56.66 కోట్లు కేటాయించి నట్టు ప్రకటిం చారు

7. ఐఐపీఈ, వైజాగ్: ఇండియన్ ఇన్ స్టిట్యూ ట్ ఆఫ్ పెట్రోలియం

అండ్ ఎనర్జీ (ఐఐపీఈ) - పెట్రోయూనివర్శిటీ ని విశాఖకి కేటాయిం చారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యం లో వివిధ ప్రభుత్వ రంగ ఆయిల్, నేచురల్ గ్యాస్ సంస్థ లు నడిపే సంస్థ ఇది. అటానమస్ విద్యాసంస్థ గా ఉంటుంది. 2016లో కార్యకలాపాలు మొదలయ్యా యి. ఆంధ్రా యూనివర్సిటీ పరిధిలోని ఇంజనీరిం గ్ కాలేజీలో తాత్కాలికంగా నడుపుతున్నారు. క్యాంపస్

నిర్మాణం కోసం సబ్బవరం సమీపంలో మండలం వంగలి  గ్రామ పరిధిలో 156.36 ఎకరాల భూమి కేటాయిం చారు. 

8. అగ్రికల్చర్ యూనివర్సిటీ : కేంద్రం విభజన చట్టం లో పేర్కొన్న వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని గుం టూరు జిల్లాలో ఏర్పాటు చేశారు. గుం టూరుజిల్లా లామ్ వద్ద వ్యవసాయ పరిశోధనా కేంద్రం ఉంది. అందులోనే కొత్త గా ప్రతిపాదించి న

వ్యవసాయ యూనివర్సిటీ ప్రారంభిం చారు. తరగతులు జరుగుతున్నాయి. 2015లో పలు భవనాలకు శంకుస్థాపన జరిగింది. కొన్ని భవనాలు అందుబాటులోకి వచ్చాయి.

9. ఎయిమ్స్ ఆసుపత్రి మంగళగిరి: ఆలిం డియా ఇన్ స్టిట్యూ ట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) ని మంగళగిరిలో ప్రారంభిం చారు. 2015 నుంచి తాత్కాలికంగా విజయవాడలో నిర్వహిం చారు. 2021 లో మెడికల్

కాలేజీ నిర్వహణ, హాస్టల్ కూడా సొంత భవనంలోకి మార్చారు. ఇక మెడికల్ సేవలకు సంబంధించి ఓపీ అందుబాటులోకి వచ్చిం ది. కొన్ని పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. ‘ప్రస్తు తం కార్యకలాపాలు జరుగుతున్నాయి.

10. గిరిజన విశ్వవిద్యా లయం: - ఆంధ్రప్రదేశ్ లో గిరిజన విశ్వ విద్యాలయం ఏర్పాటు లో తొలుత తీవ్ర గందరగోళం ఏర్పడిం ది.

విజయనగరం జిల్లా సాలూరు సమీపంలో విశ్వ విద్యాలయం ఏర్పాటుకి కేంద్రం అనుమతి లభించిం ది. దుగ్గి సాగరం గ్రామ సమీపంలో 354 ఎకరాల విస్తీ ర్ణం భూమిని ఏపీ ప్రభుత్వం కేటాయించిం ది. 2019లో యూనివర్సిటీ కార్యకలాపాలు ప్రారంభమయ్యా యి. 

11. ఇన్ స్టిట్యూ ట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ ( సదరన్ క్యాంపస్):  నేషనల్ ఇన్ స్టిట్యూ ట్ ఆఫ్

డిజాస్టర్ మేనేజ్ మెం ట్ (ఎన్ఐడీఎం) సదరన్ క్యాంపస్ పేరుతో ఏపీకి సంస్థ ను కేటాయిం చారు. గన్నవరం సమీపం లోని కొం డపావులూరు గ్రామంలో ఈ సంస్థ నిర్మాణం కోసం 2018లోనే శంకుస్థాపన చేశారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి అక్కడ కార్యకలాపాలు మొదలవుతాయని నిర్వాహకులు చెబుతున్నారు. 

- - -

విభజన చట్టం లో లేని మరో పది

సంస్థలు: .

1. అనంతపురంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ అండ్ నార్కోటిక్స్ సంస్థ ను కేంద్ర ప్రభుత్వం అనంతపురం జిల్లా పాలసముద్రంలో ఏర్పాటు చేసిం ది. 500 కోట్ల రూపాయల వ్యయంతో ఏర్పాటు చేస్తు న్న ఈ సంస్థ లో 500  మందికి పైగా ఐఆర్ఎస్ అధికారులకు, 8000 మంది ఇతర అధికారు లకు శిక్షణ ఇస్తారు .

2. నెల్లూరు జిల్లా

తుప్పులిపాలెం గ్రామం వద్ద 250 కోట్ల రూపాయల వ్యయంతో సముద్ర పరిశోధనా సంస్థ ఏర్పాటయ్యింది. ఇక్కడ భవన నిర్మాణాలు కొనసాగుతున్నాయి.

3. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేష న్ రిసెర్చి అండ్ ట్రెయినిం గ్ (ఎన్ సీ ఈఆర్టీ ) రీజనల్ ఇన్ స్టిట్యూ ట్ ఆఫ్
ఎడ్యుకేష న్ (ఆర్ఐఈ) సంస్థ ను నెల్లూరు జిల్లాలో కేంద్రం ఏర్పాటు చేసిం ది.

బీఎస్సీ, బీఎడ్ తో పాటు పరిశోధనా డిగ్రీలకు, ఉపాధ్యాయ శిక్షణ కేంద్రం గా ఈ సంస్థ ఉపయోగపడుతుం ది. ఈ తరహా సంస్థ దక్షిణాదిలో ఇది రెండవది.

4. విశాఖపట్నం లోని అచ్యుతాపురం మండలం పూడి వద్ద ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సంస్థ నిర్మాణమవుతోం ది. స్టీల్, నౌకా నిర్మాణ పరిశ్రమలు, ఇతర ఇంజినీరిం గ్ పరిశ్రమలకు నైపుణ్యం గల మానవ వనరుల

అవసరాలను తీర్చడానికి వీలుగా ఈ సంస్థ నైపుణ్య శిక్షణను అందిస్తుం ది.

5. దక్షిణాది రాష్ట్రాలకు ఉపయుక్త మైన నేషనల్ కామధేను బ్రీడిం గ్ సెం టర్ నెల్లూరు జిల్లా చిం తలదీవి వద్ద 2000 ఎకరాలలో నిర్మాణమవుతోం ది. 

6. విజయవాడలోని సూరంపూడి వద్ద సెం ట్రల్ ఇన్ స్టిట్యూ ట్ ఆఫ్ ప్లాస్టి క్ ఇంజినీరిం గ్ టెక్నా లజీ

సంస్థ ను ఏర్పాటు చేయనున్నారు. 

7. రీజనల్ సెంటర్ ఫర్ హెల్త్ అండ్ రిహాబిలిటేషన్ సంస్థ ను నెల్లూరు జిల్లాలో కేంద్రం త్వరలో ప్రారంభం కానుంది.

8. దివ్యాంగుల కోసం ప్రత్యేక స్టేడియంను విశాఖపట్నం లో ఏర్పాటు చేయనుంది. ఇది ప్రస్తు తం డీపీఆర్ స్థాయిలో ఉంది.

9. ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర విభజన జరిగిన

ఆరు నెలలలోపే విజయవాడ ఆకాశవాణి, దూరదర్శన్ కేంద్రాలను ప్రత్యేక కేంద్రాలుగా చేసి మొత్తం కార్యకలాపాలు అన్నీ అక్కడి నుం చే నడుపుతున్నారు. పింగళి వెంకయ్య పేరును విజయవాడ ఆకాశవాణి కేంద్రానికి పెట్టారు. దాంతో పాటు ఆకాశవాణి విశాఖపట్నం లో కూడా వార్తా విభాగాన్ని విస్తారం చేస్తున్నారు. 

10. విజయవాడలో కొత్త రీజనల్

పాస్ పోర్ట్ కేంద్రం ఏర్పాటయ్యింది. అలాగే పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలో కొత్త పాస్ పోర్టు కేంద్రాన్ని కేంద్రప్రభుత్వం ప్రారంభించిం ది. విభజన చట్టంలో పేర్కొనకపోయినా, ఈ పది సంస్థ లను కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవతో ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు చేసింది

= = =
వీటికి అదనంగా  

ప్రధానమంత్రి ఆవాస్ యోజన

(పీఎంఎవై) అర్బన్ కిం ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం మొత్తం 20,71,776 ఇళ్లను మంజూరు చేసింది. కేంద్ర ప్రభుత్వం తన వాటాగా 31,555.35 కోట్ల రూపాయలు మంజూరు చేసిం ది. 

మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట : జాతీయ రహదారుల అభివృద్ధికి లక్ష కోట్ల రూపాయల పెట్టుబడి లో భాగంగా 2014 సంవత్సరం తర్వాత రాష్ట్రం లో 3720 కిలోమీటర్ల జాతీయ

రహదారులు అభివృద్ధికి నోచుకున్నాయి. 

విభజన చట్టం లో లేకున్నా పెట్రోలియం మరియు సహజవాయువుల రంగంలో ప్రభుత్వ రంగ సంస్థ లు 1,40,000 కోట్ల పెట్టుబడి పెట్టడానికి సిద్ధం గా ఉన్నాయి. ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి.

• హెచ్ పీసీఎల్ మరియు గెయిల్ 30,000 కోట్ల పెట్టు బడితో కాకి నాడ వద్ద గ్రీన్ ఫీల్డ్ పెట్రో కెమికల్

కాంప్లె క్స్ ప్రారంభిం చడానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తోం ది.

• కృష్ణా , గోదావరి బేసిన్ లో ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కంపెనీ 68,000 కోట్ల రూపాయల ఆఫ్ షోర్ పెట్టు బడి పెట్టనుం ది.

• హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ విశాఖపట్నం రిఫైనరీని 20,928 కోట్ల రూపాయల పెట్టు బడి వ్యయంతో ఆధునికీకరణ

చేపడుతోం ది.

• ఆంధ్ర ప్రాంత పారిశ్రామిక ముఖ చిత్రాన్ని మార్చే విశాఖపట్నం – చెన్నై పారిశ్రామిక కారిడార్ కు 4,211 కోట్ల రూపాయలు కేంద్రం మంజూరు చేసింది. మొదటి విడతగా ఆసియన్ డెవలప్ మెం ట్ బ్యాంక్ 2500 కోట్ల రూపాయలను విడుదల చేసిం ది. 

• కృష్ణా జిల్లా నిమ్మకూరు వద్ద రక్షణ రంగంలో ఉపయోగించే నైట్ విజన్

ఆప్టిక్ డివైసెస్ తయారు చేసే కర్మాగారం శంకుస్థాపన జరిగింది. నిర్మాణపనులు కొనసాగుతున్నాయి. 

• విజయనగరం జిల్లా బొబ్బి లి వద్ద బాడంగిలో నౌకాదళ విమానాశ్రయాన్ని, కృష్ణా జిల్లా నాగాయలంక గుల్లలమోద గ్రామంలో డిఆర్డీవో మిసైల్ టెస్ట్ ఫెసిలిటీ, కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద నేషనల్ ఓపెన్ ఎయిర్ రేం జ్ ఎవాల్యుయేష

న్ సెంటర్, విశాఖపట్నం జిల్లా రాంబిల్లి వద్ద నేవల్ ఆల్టర్నే టివ్ ఆపరేషనల్ బేస్ ల ఏర్పాటు కు సూత్రప్రాయ అంగీకారం జరిగింది. వీటికి సంబంధించి న కార్యా చరణ ప్రారంభమైం ది.

• కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వారి మల్టీ మోడల్ లాజిస్టిక్ హబ్ విశాఖపట్నం లో నిర్మాణం జరుగుతోం ది.

• బకింగ్ హామ్ కెనాల్ ను 7,015

కోట్ల రూపాయల వ్యయంతో మూడు దశలలో భాగంగా ముక్త్యాల నుంచి విజయవాడ వరకు మొదటిదశ పనులు ఇప్పటికే మొదలయ్యా యి, ఈ కాలువ అభివృద్ధి పరచడం ద్వారా జలరవాణాకు శ్రీకారం చుట్టవచ్చును. ముఖ్యం గా అమరావతి రాజధాని నిర్మాణానికి సరకుల రవాణాకు ఇది దోహదపడుతుం ది. ఈ అభివృద్ధి కార్యక్రమం విభజన చట్టం లో లేదు.

• ఆసియాలోనే

మొట్టమొదటి వైద్య పరికరాల తయారీ పార్క్ విశాఖపట్నం లో ఏర్పాటవుతోం ది. ఈ పార్కు ద్వారా 20,000 కోట్ల రూపాయల పెట్టు బడులు రాగలవని అంచనా. ఇది కూడా విభజన చట్టం లో లేదు.

• 2400 మెగావాట్ల బొగ్గు ఆధారిత విద్యుత్తు కర్మాగారం ఏర్పాటుకు ఏపీ జెన్ కోకు ఒడిషాలో బొగ్గు గనుల కేటాయిం పు జరిగింది. ఇది కూడా విభజన చట్టం లో

లేనిది.

• ఆంధ్రప్రదేశ్ లోని రైల్వే ప్రాజెక్టులకు బడ్జెట్ 2009-14తో పోల్చి చూస్తే 2014-19 మధ్య 214 శాతం పెరిగింది. 47,989 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులు అమలులో ఉన్నాయి. రైల్వే మౌలిక వసతుల అభివృద్ధి పనులు, కొత్త రైల్వే లైన్లు , రైల్వే లైన్ల డబ్లిం గ్ పనులు, రైల్వే లైన్ల విద్యుదీకరణ, కొత్త రైళ్ల ఏర్పాటు ఇందులో

ఉన్నాయి.

ఇండియన్ ఇన్ స్టిట్యూ ట్ ఆఫ్ ప్యాకేజిం గ్ (ఐఐపి) ను కాకినాడ ఎస్ఈజడ్ లో ప్రారంభిస్తున్నారు. దీని కోసం 25 ఎకరాల స్థ లాన్ని కేటాయిం చారు. ఈ సంస్థ భవనాల నిర్మాణానికి శంకుస్థాపన కూడా జరిగింది. ఇది విభజన చట్టం లో లేదు.

• ఇండియన్ ఇన్ స్టిట్యూ ట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ (ఐఐఎఫ్ టి)ని కూడా కాకి నాడ ఎస్ఈజడ్ లో

ప్రారంభిస్తున్నారు. దీనికి కూడా శంకుస్థాపన జరిగింది. (ఇది కూడా విభజన చట్టం లో లేదు)

• గుంటూరు జిల్లాలో సుగంధ ద్రవ్యాల పార్కు ఏర్పాటు కానుంది. ఇది కూడా విభజన చట్టంలో లేదు.

• సెం టర్ ఫర్ ఎలక్ట్రో మాగ్నెటిక్ ఎన్విరాన్ మెం ట్ ఎఫెక్ట్స్ (SAMEER) కు చెం దిన పరిశోధన, అభివృద్ధి సెం టర్ ను విశాఖపట్నం లో

నెలకొల్పుతోం ది. ఈ సంస్థ మొదటిదశ నిర్మాణం పూర్తయ ్యింది. ఈ ఏడాది అంతానికి ఇది పూతిర్ కానుం ది. ఇది విభజన చట్టం లో లేదు.

• విశాఖపట్నం లో ఎస్టిపిఐ – వి ఎం ఆర్ డీఏ ఆధ్వర్యంలో ఇన్ఫర్మేషన్ టెక్నా లజీ ఇంక్యుబేషన్ సెం టర్ ప్రారంభం కానుంది. ఇది కూడా విభజన చట్టం లో లేదు.

• చిత్తూరు జిల్లా వికృతమాల గ్రామంలో

339.8 కోట్ల వ్యయంతో గ్రీన్ ఫీల్డ్ ఎలక్ట్రాని క్స్ మాన్యుఫ్యా క్చరిం గ్ క్లస్టర్ అభివృద్ధి చేస్తున్నారు . ఇది కూడా విభజన చట్టం లో లేదు.

• హుడ్కో ద్వారా రాష్ట్ర రాజధాని నిర్మాణానికి 7500 కోట్ల రూపాయల రుణ సహాయం.

• ఆంధ్రప్రదేశ్ లో తిరుపతి, విశాఖపట్నం , కాకి నాడ, అమరావతి స్మార్ట్ సిటీలుగా

ఎంపిక.

• ఆంధ్రప్రదేశ్ లోని 33 నగరాలను అటల్ మిషన్ ఫర్ రిజువినేషన్ అండ్ అర్బన్ ట్రాన్ఫర్ మేషన్(అమృత్) పథకం కిం ద అభివృద్ధి చేయడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణ యించిం ది. అలాగే అమరావతిని కూడా ప్రత్యేక సహాయం కిం ద ఇందులో చేర్చారు.

• అమరావతిని వారసత్వ నగరంగా సమగ్రాభివృద్ధి చేయడానికి “హృదయ్” పథకం కిం

ద ఎంపిక చేశారు. ఇది విభజన చట్టం లో లేదు.

• ప్రైమ్ మినిస్టర్ ఆవాస్ యోజన (గ్రామీణ) కిం ద గడిచిన మూడేళ్లలో రాష్ట్ రంలో 1,23,112 ఇళ్లను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిం ది. వీటి నిర్మాణానికి అవసరమైన మేరకు నిధులు కూడా మంజూరయ్యా యి.
• విజయవాడ, అనంతపురం నగరాల్లోని ప్రభుత్వ వైద్యశాలల్లో సౌకర్యాల మెరుగుకు కేంద్ర

సహాయం

• ఈ ఎస్ ఐసీ ద్వారా విశాఖపట్నం నగరంలో 300 పడకల సూపర్ స్పెషా లిటీ ఆసుపత్రి నిర్మాణం

• కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పదవీ విరమణ చేసిన పెన్షనర్ల కోసం విశాఖపట్నం లో సిజిహెచ్ఎస్ వెల్ నెస్ సెంటర్ ప్రారంభం.

• కృష్ణా జిల్లాలో సెం ట్రల్ రిసెర్చ్ ఇన్ స్టిట్యూ ట్ ఫర్ యోగ అండ్ నాచురోపతి

ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అంగీకరించిం ది. (ఇది విభజన చట్టం లో లేదు)

• కాకి నాడలో హోప్ ఐలాం డ్ అభివృద్ధి , నెల్లూరు లో కోస్టల్ టూరిజమ్ సర్క్యూట్. ఇవి ప్రాధాన్యం గల టూరిజం ప్రాజెక్టులు (విభజన చట్టం లో పేర్కొని లేదు)

• ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి, విశాఖపట్నం , విజయవాడ విమానాశ్రయాలను అంతర్జా తీయ

విమానాశ్రయాలుగా కేంద్ర పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ అప్ గ్రేడ్ చేసిం ది. అలాగే తిరుపతిలో విమానాల నిర్వహణ, మరమ్మతులకు సంబంధించి న ఒక కేంద్రాన్ని ఇటీవలే ఏర్పాటు చేసిం ది.

నేషనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైప్ లైన్ (ఎన్ఐపి) ద్వా రా 8,16,583 కోట్ల పెట్టుబడులు

= = = 
ప్రభుత్వ పరిశీలనలోని ప్రాజెక్టులు

కేంద్ర ప్రభుత్వం పరిశీలిం చాలని విభజన చట్టం లో పేర్కొన్న వాటిలో కడపలో ఇంటిగ్రేటెడ్ స్టీ ల్ ప్లాం ట్ ఏర్పాటు ప్రతిపాదన ఉంది. స్పెష ల్ టాస్క్ ఫోర్స్ నివేదిక ఆధారంగా ఇక్కడ స్టీ ల్ ప్లాంట్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది.

ఇక పరిశీలనలో ఉన్న మరో భారీ ప్రాజెక్టు, నెల్లూరు జిల్లా తీర

ప్రాంతంలోని దుగరాజపట్నం లో ఓడరేవు నిర్మాణం. అయితే, సాంకే తిక నిపుణుల కమిటీ నివేదిక ప్రకారం సమీపంలోని పోర్టు ల కారణంగా తీవ్ర పోటీ ఎదురవుతుం దని పేర్కొం ది. దీం తో ఓడరేవు ఏర్పాటుకు మరో ప్రాంతాన్ని ఎంపిక చేసి ప్రతిపాదిం చాల్సిం దిగా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిం ది. అయితే ఇంతవరకు దీనిపై ఏవిధమైన స్పం దన

లేదు.


పెండిం గ్ లో నేషనల్ ఇన్వెస్ట్ మెంట్ అండ్ మాన్యుఫ్యాక్ఛరిం గ్ జోన్:- 

ఇండస్ట్రియల్ కారిడార్లు: - 
కేంద్ర ప్రభుత్వం గుర్తించి న పారిశ్రామిక కారిడార్ల లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీదుగా మూడు పారిశ్రామిక కారిడార్లు వెళ్తు న్నాయి.  విశాఖపట్నం – చెన్ నై పారిశ్రామిక కారిడార్ (VCIC),

 చెన్ నై – హైదరాబాద్ పారిశ్రామిక కారిడార్ (CHIC), చెన్ నై-బెంగు ళూరు పారిశ్రామిక కారిడార్ (CBIC) ఉన్నాయి. 

వీటి ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో విశాఖపట్నం , కృష్ణపట్నం , శ్రీకాళహస్తి (చిత్తూ రు), కడప, ఓర్వకల్లు ప్రాంతాలను పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి నిర్ణయిం చారు.

విశాఖపట్నం – చెన్ నై

కారిడార్ పరిధిలో శ్రీకాళహతిస్ (చిత్తూరు ), విశాఖపట్నం , కడప ప్రాంతాలను గుర్తించిం ది. అలాగే చెన్నై – బెం గుళూరు ఇండస్ట్రియల్ కారిడార్ (సీబీఐసీ) పరిధిలో కృష్ణ పట్నం , హైదరాబాద్ – బెం గుళూరు ఇండస్ట్రియల్ కారిడార్ (హెచ్ బిఐసీ) పరిధిలో ఓర్వకల్లు ను పారిశ్రామికంగా
అభివృద్ధి చేయడానికి

గుర్తించింది.

విశాఖపట్నం చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ (VCIC) :  కోల్ కతా-చెన్నై- ట్యుటికోరిన్ లను కలిపే ఈస్ట్ కోస్ట్ ఎకనామిక్ కారిడార్ లో కీలకమైన భాగంగా గుర్తిం చబడిం ది. దీన్ని జాతీయ రహదారి స్వర్ణ చతుర్భుజితో అనుసంధానిం చారు.ఈ పారిశ్రామిక కారిడార్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ రంలోని 800 కిలోమీటర్ల కంటే ఎక్కువ తీర

ప్రాంతంతో పాటు ఏపీ లోని తొమ్మిది జిల్లాలను అనుసంధానిస్తూ వెళుతుం ది. 

విశాఖపట్నం – చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్ లో ఐదు నోడ్ లు గుర్తిం చబడ్డాయి,

1. విశాఖపట్నం 2. మచిలీపట్నం 3. దొనకొం డ 4. శ్రీకాళహస్తి -ఏర్పేడు (చిత్తూరు ) 5. వైఎస్ఆర్ కడప కేంద్రాలుగా అయిదు ఇండస్ట్రియల్ నోడ్స్ గుర్తిం చారు. ఈ అయిదు నోడ్

లలో మూడు ఇండస్ట్రియల్ క్లస్టర్స్ ను ఆసియన్ డెవలప్ మెం ట్ బ్యాంక్ (ఏడీబీ) నిధులతో అభివృద్ధి చేస్తారు . 

విశాఖపట్నం లోని నక్కపల్లి, రాం బిల్లి, చిత్తూరు నోడ్ లోని దక్షిణ చిత్తూరు ఇండస్ట్రియల్ కస్టర్లు ఇందులో ఉన్నాయి. విశాఖ – చెన్నై పారిశ్రామిక కారిడార్ లో ఈ ప్రతిపాదించి న క్లస్టర్ల అభివృద్ధి కి ఏడీబీ

అంగీకరించింది.

ప్రత్యేక హోదా.. ప్రత్యేక సాయం: -

రాష్ట్ర విభజన చట్టం ప్రకారం నవ్యాంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వలేదని పదే పదే కేంద్రం పై పలువురు రాజకీయ వేత్త లు విమర్శలు గుప్పిస్తున్నారు . దీనిపై కేంద్రాన్ని విమర్శిస్తూ ప్రజలలో ఒక రకమైన అయోమయాన్ని సృష్టిం చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

వాస్త వంగా రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఎందుకు రాలేదు? దీనికి గల కారణాలను పరిశీలించి నపుడు, రాష్ట్ర విభజన సమయంలోనే
అప్పటి యూపీఏ ప్రభుత్వం దీనిని చట్టబద్ధం చేయకపోవడం వల్ల నే అమలుకు నోచుకోలేదు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam