DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నితిన్ గడ్కరీ బీజేపీ లో మరో అద్వానీ కానున్నారా? అందుకేనా వేటు? 

*సీఈసీ, పార్లమెంటరీ కమిటీ ల నుంచి గడ్కరీ కి ఉద్వాసనపై భిన్నాభిప్రాయాలు*

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*   

*విశాఖపట్నం, ఆగస్టు  18, 2022 (డిఎన్ఎస్):* 2024 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, భారతీయ జనతా పార్టీ బుధవారం ప్రకటించిన తన కేంద్ర ఎన్నికల కమిటీ మరియు పార్లమెంటరీ కమిటీల నుంచి

కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ని తప్పించడం పై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మోడీ తర్వాత దాదాపు అదే స్థాయి జోష్, ఛరిష్మా, ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి నితిన్ గడ్కరీ. ఈ గౌరవం ఆయన చేసే పని తీరు వల్ల ఆయనకు లభించింది. పార్టీలో గడ్కరీ కి పెరుతున్న ఫాలోయింగ్, ఇతర రాజకీయ పార్టీల నుంచి సైతం సత్సంబంధాలు, తదితర అన్ని అంశాలు

దృష్ట్యా మోడీ తర్వాత ఆ స్థానంలోకి వెళ్ళబోయేది గడ్కరీ యే అంటూ పార్టీ లోనే విస్తృతంగా ప్రచారం జరగడం తో బీజేపీ అగ్రనేతలకు మింగుడుపడడం లేదు. ఎన్నికలకు ఇంకా రెండేళ్ల కాలం ఉన్నప్పడికి బలోపేతం పేరుతొ తమ చెప్పుచేతల్లో ఉండే వారితో రెండు కమిటీలను హడావిడిగా నియమించేశారు. ఈ కమిటీల్లో గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహన్ వంటి

అగ్రనేతల పేర్లు లేకపోవడంతో ఈ నిర్ణయం కేవలం గడ్కరీ కి బ్రేక్ వేసేందుకే అంటూ పార్టీలో అధికశాతం అభిప్రాయం పడుతున్నారు. అయితే దక్షిణాది నుంచి యడ్యూరప్ప, బి ఎల్ సంతోష్,  డా. కె లక్ష్మణ్, వినతి శ్రీనివాస్, వంటి వారికి స్థానం కల్పించడం ఈ ప్రాంతంలో పార్టీ ని బలోపేతం చెయ్యడానికే అని ప్రకటించింది. 
అయితే గడ్కరీ ని

ఎందుకు తొలగించాలి అనే ప్రశ్నకు మాజీ అధ్యక్షులకు విశ్రాంతి ఇస్తున్నట్టు చెప్పడం గమనార్హం. ఇదే కమిటీ లో పార్టీ పూర్వ అధ్యక్షులు అమిత్ షా, రాజనాధ్ సింగ్ లు కొనసాగుతుండడం కోన మెరుపు.

ఈ ప్రక్షాళన మొత్తం పార్టీలో పెద్దలకు తలనొప్పిగా మారుతున్న నితిన్ గడ్కరీ ని నిరోధించడానికి అనే బహిర్గతం అవుతోంది అనే

అభిప్రాయాలూ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతున్నాయి. 

అయితే గడ్కరీ కి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ అగ్రనేతలతో సత్సంబంధాలు ఉండడమే కాక, ఆర్ ఎస్ ఎస్ ప్రధాన కార్యాలయం ఉన్న నాగపూర్ కు చెందినవారు కావడం గడ్కరీ కి అదనపు బలం.       

జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బుధవారం న్యూఢిల్లీలో కొత్త కమిటీలను

ప్రకటించారు. ఈ కమిటీలు ఇలా ఉన్నాయి
కేంద్ర ఎన్నికల కమిటీ:
1. JP నడ్డా, అధ్యక్షుడు.
2. నరేంద్ర మోడీ, ప్రధాన మంత్రి
3. అమిత్ షా, హోం మంత్రి
4. రాజ్‌నాథ్ సింగ్, రక్షణ మంత్రి
5. బి.ఎస్. యడ్యూరప్ప,
6.సర్బానంద సోనోవాల్,
7. కె లక్ష్మణ్,
8. ఇక్బాల్ సింగ్ లాల్‌పురా,
9. శ్రీమతి సుధా యాదవ్,
10. సత్యనారాయణ జాతీయ
11.

భూపేందర్ యాదవ్,
12. దేవేంద్ర ఫడ్నవిస్,
13. ఓం మాధుర్,
14. బి ఎల్ సంతోష్, (కార్యదర్శి).
15. శ్రీమతి వినతి శ్రీనివాస్ (పాతేన్)

పార్లమెంటరీ కమిటీ:
1. JP నడ్డా, అధ్యక్షుడు.
2. నరేంద్ర మోడీ, ప్రధాన మంత్రి
3. రాజ్‌నాథ్ సింగ్, రక్షణ మంత్రి
4. అమిత్ షా, హోం మంత్రి
5. బి.ఎస్. యడ్యూరప్ప,
6.సర్బానంద సోనోవాల్,
7. కె

లక్ష్మణ్,
8. ఇక్బాల్ సింగ్ లాల్‌పురా,
9. శ్రీమతి సుధా యాదవ్,
10. సత్యనారాయణ జాతీయ
11. B L సంతోష్, (కార్యదర్శి).
CEC నుండి తొలగించబడిన పేర్లలో, కేంద్ర మంత్రి, నితిన్ గడ్కరీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, శివరాజ్ సింగ్ చౌహాన్, బిజెపి జాతీయ అధికార ప్రతినిధి, షానవాజ్ హుస్సేన్ మరియు మాజీ క్యాబినెట్ మంత్రి జుయల్ ఓరమ్ పేర్లు

ఉన్నాయి.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam