DNS Media | Latest News, Breaking News And Update In Telugu

హిందూ సత్రాలు, ధార్మిక భవనాలు అన్యమత కార్యక్రమాలకు ఇవ్వద్దు: విహెచ్పి

*హిందువుల్లో ఐక్యత లేనందునే ధార్మిక సత్రాల్లో అన్యమత కార్యక్రమాలు*

*పార్టీల నేతలకు చిత్తశుద్ధి లేదు: విజయవాడ విహెచ్పి అధ్యక్షుడు మండిపాటు*

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*    

*విశాఖపట్నం, సెప్టెంబర్ 12 , 2022 (డిఎన్ఎస్):* హిందూ ధార్మిక సంస్థలకు చెందిన భవనాలను అన్యమత కార్యక్రమాలకు

అద్దెకు లేదా లీజుకు ఇవ్వడరాదని విశ్వ హిందూ పరిషత్ విజయవాడ అధ్యక్షుడు సానా శ్రీనివాస్ హితవు పలికారు. గత కొంతకాలంగా హిందూ ధార్మిక భవనాలను లీజుల పేరిట, ఆదాయ వనరుల పేరిట అన్యమత ప్రచార కార్యక్రమాలకు ఇబ్బడి ముబ్బడిగా ఇవ్వడం పై మండిపడ్డారు. గతం లో గురజాడ కళాశాల ను అన్యమత కార్యక్రమాలకు అద్దెకు ఇవ్వడాన్ని

అడ్డుకున్నామని, తెలిపారు. బ్రాహ్మణా వీధిలోని కౌతా వారి ధర్మ సత్రం ఎదుట అన్యమత ప్రచార కార్యక్రమం బోర్డు ఒకటి వెలిసిందన్నారు. దాన్ని తప్పు పడుతూ సంబంధిత భవనం నిర్వాహకులను సంప్రదించామన్నారు. ఇది రెండు నెలల క్రితం ఘటనగా తెలిపారు. అప్పుడే దీని పై వివరణ కోరేందుకు విశ్వహిందూ పరిషత్, భజరంగ్ దళ్ సభ్యులు కల్సి గతంలోనే ఈ

భవనం కార్యాలయానికి వెళ్లామన్నారు. 
తమకు అందిన సమాచారం ప్రకారం ఈ సత్రం ప్రైవేట్ వ్యక్తుల చేతిలోనే ఉందని, దేవాదాయ శాఖా పరిధిలో లేదన్నారు. అయితే పూర్తి వివరాలు తెలియవలసి ఉందన్నారు. సంబంధిత కార్యాలయం లో క్రింద స్థాయి ఉద్యోగి మాత్రమే ఉన్నారని, కమిటీ ప్రతినిధులు అందుబాటులో లేరన్నారు. అయినప్పడికి హిందూ ధార్మిక

సంస్థల్లో అన్యమత ప్రచారాలకు అద్దెకు ఇవ్వడం సరి కాదని, నిర్వాహక ప్రతినిధి తెలిపామన్నారు.  
బాటసారుల కోసం కొన్నేళ్ల క్రితమే కౌతా వారు ఎన్నో దర్మ సత్రాలు నిర్మించారని, విజయవాడ లోనే పలు భవనాలు ఉన్నాయన్నారు. ఈ భవనం బ్రాహ్మణా వీధిలోనే ఉందని. ఈ భవనం కు అత్యంత సమీపంలోనే మాజీ మంత్రి, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్

నివాసం ఉందన్నారు. 

హిందువుల్లో ఐక్యత లేనందునే. .. 

అన్యమత అధికశాతం హిందూ సమాజం ఉన్న ప్రాంతాల్లోనే జరగడానికి ప్రధాన కారణం హిందువుల్లో ఐక్యత లేకపోవడమేనని విహేచిపి నేత మండిపడ్డారు. తమ సంస్థ ప్రతి రోజు ధర్మ పోరాటమే చేస్తోందన్నారు. నిత్యం  ఏదో ఒక ప్రాంతంలో హిందువుల పట్ల అఘాయిత్యాలు, దౌర్జన్యాలు

జరుగుతూనే ఉన్నాయన్నారు. అయితే వీరికి సంఘీభావంగా మరో హిందువు రావడం లేదన్నారు. తాము ఎన్నో సార్లు ధార్మిక చైతన్యం కోసం సమావేశాలు నిర్వహింఛామన్నారు. అయితే  హిందువు బంధువుల సంఖ్యా పెద్దగా రావడం లేదన్నారు.  హిందువుల్లో చైతన్యం రానంతవరకూ ఇలాంటి దుర్ఘటనలు కోకొల్లలుగా జరుగుతూనే ఉంటాయన్నారు. 

ప్రస్తుతం

బ్రాహ్మణా వీధిలో ఈ కౌతా వారి భవనం చుట్టూ అన్ని బ్రాహ్మణా కుటుంబాలే ఉంటున్నాయని, అయినప్పడికి ఈ దుశ్చర్యను అడ్డుకున్న వాళ్ళు లేరన్నారు. వీళ్లల్లో కూడా చైతన్యం రావాలన్నారు. 

రాజకీయ పార్టీల్లో నేతల కంటే స్వార్థపరులు ఎక్కువగా ఉన్నారన్నారు. కేవలం వాళ్లకి పార్టీ లో పదవులే ముఖ్యమని, హిందూ సమాజం ఎలా ఉన్న

సంబంధం ఉండదన్నారు. దీనికి ప్రధాన నిదర్శనమే మాజీ మంత్రి, ఎమ్మెల్యే లు దీన్ని నిరోధించడక పోవడమేనన్నారు. 

ప్రస్తుతం ఈ భవనం లో అన్యమత కార్యాచరణను తొలగింప చేయడం జరిగిందని, ఇక పై ఏ హిందూ సంప్రదాయ భవనం కూడా అన్యమత కార్యక్రమాలకు లీజుకు లేదా అద్దెకు ఇవ్వడారని సూచించారు. పెద్దలు చేసిన భూరి విరాళ కార్యక్రమాన్ని

కేవలం ఆదాయ వనరుగా చూడవద్దని హితవు పలికారు.,

ఈ దుర్ఘటనను అంతసులభంగా విడిచి పెట్టేది లేదని, ఇలాంటి ఘటనలపై విశ్వ హిందూ పరిషత్ దృష్టిపెడుతుందన్నారు. 

పూర్వీకులు ఇచ్చిన భూ విరాళాలు, వాళ్ళ ఆశయాలకు తగినట్టు సద్వినియోగం అవుతున్నాయా లేదా అనేది చూడవలసిన భాద్యత పాలకులపైనే ఉంది.  వీళ్ళు ఈ భాద్యతలను

పూర్తిగా విస్మరించడమే ఈ రాష్టంలో అత్యంత దురదృష్టకరమైన విషయం గా తెలుస్తోంది. 

ఇలాంటి దుర్ఘటనలో విశాఖపట్నం లోను, అనకాపల్లి, రాజమహేంద్రవరం, ఏలూరు, శ్రీశైలం, శ్రీకాళహస్తి, ద్వారకా తిరుమల, అన్నవరం, కాణిపాకం, తదితర ప్రాంతాలు అన్నింటిలోనూ బ్రాహ్మణా, ధార్మిక భవనాలు, ఆస్తులు అన్యమత ప్రార్థనలకు స్వాధీనం లేదా

లీజుల పేరుతో కట్ట పెట్టినట్టు సమాచారం తెలుస్తోంది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam