DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గోదావరి జిల్లాల్లో 8 భారీ జాతీయ ప్రాజెక్టులకు గడ్కరీ శంఖుస్థాపన

*(DNS Report: P Raja, Burau Chief, Amaravati)*    

*అమరావతి, సెప్టెంబర్ 22, 2022 (డి ఎన్ ఎస్) :* కేంద్ర రోడ్డు రవాణా రహదారులు శాఖ మంత్రి నితిన్ గడ్కరి గురువారం రాజమహేంద్రవరం ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పూర్వపు ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో  రు.3,000 కోట్లుతో చేపట్టనున్న ఎనిమిది జాతీయ రహదారుల పనులకు శంకుస్థాపన

చేశారు.

ఈ పనుల్లో భాగంగా 5 పై వంతెన పనులు, మూడు రహదారుల నిర్మాణం పనులు చేశారు.

ఇందులో భాగంగా - 

1) వాకలపూడి - ఉప్పాడ - అన్నవరం ఎన్ హెచ్ - 516 ఎఫ్   లేనింగ్‌కు శంకుస్థాపన, ప్రాజెక్ట్ పొడవు 40.621 కిమీ  ప్రాజెక్ట్ వ్యయం : రు.1345 కోట్లు.

 2) సామర్లకోట - అచ్చంపేట జంక్షన్ ఎన్ హెచ్ - 516 ఎఫ్ నాలుగు

రహదారులు, ప్రాజెక్ట్ పొడవు: 12.25 కి.మీ, ప్రాజెక్ట్ వ్యయం: రు. 710 కోట్లు,

3) రంపచోడవరం నుండి కొయ్యూరు ఎన్ హెచ్ - 516 ఈ వరకు రెండు లైన్ల నిర్మాణం, ప్రాజెక్ట్ పొడవు: 70.12 కి.మీ, ప్రాజెక్ట్ వ్యయం: రు. 570 కోట్ల, 

4) కైకరం ఎన్ హెచ్ - 216 ఏ వద్ద నాలుగు లైన్ల ఫ్లైఓవర్ నిర్మాణం, ప్రాజెక్ట్ పొడవు: 1.795 కిమీ, ప్రాజెక్ట్ వ్యయం: రు.70

కోట్లు,

5) మోరంపూడి ఎన్ హెచ్ - 216 ఏ  వద్ద నాలుగు లైన్ల ఫ్లైఓవర్ పని ప్రారంభం, ప్రాజెక్ట్ పొడవు: 1.42 కి.మీ, ప్రాజెక్ట్ వ్యయం: రు. 60 కోట్లు.

6) ఉండ్రాజవరం ఎన్ హెచ్ - 216 ఏ వద్ద నాలుగు లైన్ల  ఫ్లైఓవర్ నిర్మాణం, ప్రాజెక్ట్ పొడవు: 1.25 కి.మీ, ప్రాజెక్ట్ వ్యయం: రు.35 కోట్లు,

7) తేతాలి ఎన్ హెచ్ - 216ఏ  వద్ద నాలుగు లైన్ల

 ఫ్లైఓవర్ నిర్మాణం, ప్రాజెక్ట్ పొడవు: 1.03 కి.మీ, ప్రాజెక్ట్ వ్యయం: రు. 35 కోట్లు,

8) జొన్నాడ ఎన్ హెచ్ - 216 ఏ వద్ద నాలుగులైన్ల  ఫ్లైఓవర్ నిర్మాణం, ప్రాజెక్ట్ పొడవు: 0.93 కి.మీ, ప్రాజెక్ట్ వ్యయం: రు. 25 కోట్లు.

కార్యక్రమంలో ఆర్ అండ్ బి మంత్రి దాడిశెట్టి రాజా,  ఆర్ అండ్ బి ప్రిన్సిపల్ సెక్రటరీ  ఎం.టి. కృష్ణ బాబు,

నేషనల్ హైవే పీ డీ సురేంద్ర బాబు, జాతీయ రహదారుల అధికారులు, జిల్లా కలెక్టర్ డా. మాధవీలత, ఎంపీలు రాజమహేంద్రవరం , ఎంపీ మార్గాని భరత్  రామ్, కాకినాడ ఎంపీ వంగా గీత, అమలాపురం ఎంపీ చింతాఅనురాధ, అరకు ఎంపీ జి. మాధవి, శాసన సభ్యులు  జక్కంపూడి రాజా, తలారి వెంకటరావు, రూరల్ ఆర్డినేటర్ చందన నాగేశ్వర్ , స్థానిక ప్రజాప్రతినిధులు,

అధికారులు పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam