DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆల్లంపల్లి గిరిజన తండాలో జగదాచార్యుల చిన్న జీయర్ స్వామి తిరునక్షత్ర వేడుకలు 

*అపరరామానుజుల చే అక్టోబర్ 26 న కె లక్ష్మినరసింహన్ కు జీయర్ పురస్కార ప్రదానం*

*అక్టోబర్ 26 నుంచి 30 వరకూ ఆధ్యాత్మిక శోభను సంతరించుకోనున్న ఏజెన్సీ*

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*    

*విశాఖపట్నం, సెప్టెంబర్ 29, 2022 (డిఎన్ఎస్):* జగదాచార్యులు, పరమహంస పరివ్రాజకాచార్య, అపరరామానుజులుగా

ఖ్యాతిగాంచిన త్రిదండి చిన్న జీయర్ స్వామి వారి తిరునక్షత్ర మహోత్సవాలు అక్టోబర్ 26, 2022 నుంచి 30 వరకూ ఆదిలాబాద్ జిల్లాలోని ఆల్లంపల్లి లో వైభవంగా జరుగనున్నాయి. ఐదు రోజుల పాటు జరిగే ఈ వేడుకల్లో మొదటి రోజు పెద్ద జీయర్ స్వామి గౌరవార్ధం వేదవిద్యకు ఎనలేని సేవ చేస్తున్న వేదపండితులకు జీయర్ పురస్కారం అందచేస్తున్నారు. ఈ

పురస్కారం 1994 నుంచి 26 మందికి ఈ పురస్కారాన్ని అందచేస్తున్నారు. ఈ ఏడాది 31 వ జీయర్ పురస్కారం ఈనెల 26 న ఉభయ వేదాంత పండితులు, వేద, దివ్య ప్రబంధ పండితులు ఒరగడం కిళాంబి లక్ష్మి నరసింహన్ కు ఈ పురస్కారాన్ని అందించనున్నారు. సాయంత్రం 5 గం.లకు ఆలయ మర్యాదలతో సత్కరించనున్నారు. తదుపరి సభనుద్దేశించి, వీరు అనుగ్రహభాషణం

అందించనున్నారు. 

ప్రతి రోజు ఉదయం తిరువారాధన అనంతరం తీర్ధ గోష్టి, ప్రసాద వితరణ, మధ్యాహ్నం ఆల్లంపల్లి గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థులచే సంస్ర్కుతిక కార్యక్రమాలు జరుగనున్నాయి. సాయంత్రం శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ, ప్రముఖ పండితులచే ప్రవచనం జరుగనున్నాయి.  
ఆఖరు రోజు 30 వ తేదీన స్వామి వారి

ఆరాధ్య పెరుమాళ్ శ్రీ సీతారామచంద్ర పెరుమాళ్ కు సహస్ర కలశాభిషేకం భక్తుల చే నిర్వహించడం జరుగుతుంది.  

జీయర్ పురస్కార గ్రహీత వీరే: 

తమిళనాడు కు చెందిన ఒరగడం కిళాంబి లక్ష్మి నరసింహన్ నవంబర్ 8 , 1963 లో జన్మించారు. వీరు నాలాయిర దివ్యప్రబంధం, దేశిక ప్రబంధం, దేశికస్తోత్రం. కృష్ణయజుర్వేదం, సంస్కృతం కావ్య

నాటకాంతం మొదలగునవి - వేద, దివ్య ప్రబంధ శాస్త్రకళాశాల మధురాంతకంలో పాంచరాత్ర ఆగమ శాస్త్రాల్లో నిష్ణాతులు. 

వీరి బిరుదులు, అవార్డులు : వేద దివ్యప్రబంధరత్నం, వేదరత్నం, దివ్యప్రబంధ రత్నం, సోలారువి, ఉభయ వేదప్రవర్తక వేద దివ్యప్రబంధ ఆగమ గానవారిధి, వేద ఆగమ తిలక, వాక్ వరిషి, రామాయణ తిలకమ్.

అల్లంపల్లి

గురుకులం ప్రత్యేకత:

అఖండ భారతావనిలో ఇంతవరకూ ప్రభుత్వాలు, ప్రయివేట్ సంస్థలు నెలకొల్పిన గురుకులాలు అన్నిఅభివృద్ధి చెందిన ప్రాంతాల్లోనే ఏర్పాటు చేయడం జరిగింది. అత్యంత వెనుకబడిన ప్రాంతాల్లోని అమాయక ప్రజలకు ఈ గురుకుల విద్య అందని ద్రాక్షగానే ఉండి పోయింది. 

 అత్యంత ఉదారులైన జగదాచార్యులు

త్రిదండి చిన్న జీయర్ స్వామి దశాబ్దాల క్రితం ఈ ప్రాంతానికి విచ్చేసినప్పుడు వీరి అమాయక భక్తికి అత్యంత ముగ్దులై, వీరికి ఉన్నతమైన విద్యతో పాటు, పౌష్టిక ఆహారాన్ని కూడా అందించాలి అనే సంకల్పంతో 2004 లో ఒక అత్యాధునిక గురుకులాన్ని ఆల్లంపల్లి తండా లో ప్రారంభించారు. ఇదే ఏజెన్సీ లో బీర్సాయి పేట, కోటరివారిపాలెం తండా గ్రామాల్లో

జీయర్ గురుకులాలను కంప్యూటర్, ఆంగ్ల భాష మాధ్యమం, వ్యక్తిత్వ వికాశం, ఆధ్యాత్మిక చింతనతో కూడిన అత్యంత ఆధునిక సాంకేతిక వసతులతో ప్రారంభించారు. 

చిన్న జీయర్ స్వామి వారి నిర్వహణల్లో నడుస్తున్న ప్రతి పాఠశాలలోనూ పూర్తిగా ఉచితంగానే విద్యను అందిస్తున్నారు. హాస్టల్ వసతి కూడా అత్యంత పౌష్టిక ఆహారం తో

అందిస్తున్నారు. ఈ పాఠశాల్లో విద్యను పూర్తి చేసిన వందలాది మంది విద్యార్థులు ఇంజనీర్లు, న్యాయశాస్త్ర, అగ్రికల్చర్ విద్యలను అభ్యసిస్తున్నారు. 

సామాన్య జన జీవన విధానానికి భిన్నంగా ఉండే ఈ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఈ గురుకులం ఏర్పాటు తో స్థానిక గిరిజనులు అత్యంత ఆనంద పరవశులయ్యారు. స్వామిజి పట్ల తమ భక్తి ని

స్వామి వారి సంస్థలు నిర్వహిస్తున్న వివిధ సేవాకార్యక్రమాల్లో విస్తృతంగా సేవలు చేయడం ద్వారా తెలియచేస్తున్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam