DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జాతీయ అంశాలపై విస్తృతంగా మాట్లాడే జివిఎల్ నోటికి తాళం ఎందుకు పడింది? 

*జివిఎల్ యోచన పదును తగ్గిందా లేక అధిష్ఠానం అదుపులో ఉంచారా?*

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*    

*విశాఖపట్నం, అక్టోబర్ 03 , 2022 (డిఎన్ఎస్):* జాతీయ అంశాలపై అనర్గళంగా మాట్లాడగలిగిన భారతీయ జనతా పార్టీ ఎంపీ జివిఎల్ నర్సింహారావు ఇటీవల కాలంలో వాటిపై విలేకరుల అడిగినా కనీసం నోరెత్తక పోవడానికి

కారణాలేంటి? ఇదే ప్రశ్న ప్రస్తుతం పార్టీ వర్గాల్లోనూ, మీడియా వర్గాల్లోనూ తలెత్తుతోంది. గత కొన్నాళ్లుగా జివిఎల్ విశాఖ నగరంలో విస్తృతంగా పర్యటిస్తూ, ఇక్కడే స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు. జాతీయ స్థాయిలో జరుగుతున్నా అంశాలపై స్పందించే స్థాయి గానీ, అవగాహనా గానీ ఆంధ్ర బీజేపీ నాయకులూ ఎవరికీ లేకపోవడంతో ఒక ఎంపీ హోదా లో

ఉన్న జివిఎల్ ను జాతీయ అంశాలపై విలేకరులు ఎన్నోమార్లు ప్రశ్నించినా మాటాడతావేయ్యడం చూస్తే. . .అధిష్టానం ఈయన నోటికి తాళం వేసిందా అనే సందేహం కలుగుతోంది.
జాతీయ స్థాయిలో సంచలనంగా మారిన అంశాల్లో బీజేపీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ పై వేటు అంశంగానీ, తెలంగాణలో హిందూ ద్వేషి మునావర్ కార్యక్రమం గానీ, తెలంగాణ గోషా మహల్

ఎమ్మెల్యే రాజాసింగ్ పై టాడా కేసు విషయం గానీ, దేశ వ్యాప్తంగా బ్యాన్ చేసిన పిఎఫ్ఐ అంశం పై గానీ, కేంద్ర ప్రభుత్వం పై ప్రతిపక్షాలు బురద  జల్లుతున్న ఇతర అంశాలపై గానీ,  ఇలా ఎన్నో అంశాలపై విలేకరుల సమావేశంలో ప్రశ్నించినా వాటిపై స్పందించేందుకు జివిఎల్ సుముఖత వ్యక్తం చేయలేదు.

జాతీయ స్థాయి అంశాలపై స్పందించే

నాయకుడు బీజేపీ విశాఖ శాఖా లో గానీ, ఆంధ్ర ప్రదేశ్ శాఖా లో గానీ లేకపోవడం తో చాలా అంశాలపై బీజేపీ పార్టీ జాతీయ కమిటీ స్టాండ్ ఏంటి అనేది తెలియకుండా పోతోంది. అన్ని అంశాలు కేంద్ర కమిటీ దృష్టి కి వెళ్లకపోవచ్చు. అలాంటి అంశాలపై స్థానికంగా పార్టీ స్టాండ్ తెలియచేయగలిగే నాయకులూ బీజేపీ లో లేకపోవడం పార్టీ కి పెద్ద నష్ఠంగానే

చెప్పాలి. 

జాతీయ పార్టీ కేవలం స్థానిక అంశాలపై మాత్రమే దృష్టి పెడితే దాని స్థాయి దిగజారి పోయే అవకాశం ఉంది. జాతీయ అంశాలను కూలంకషంగా వివరించగలిగిన జివిఎల్ లాంటి నాయకుల నోటికి తాళాలు వేస్తె బీజేపీ భారీ నష్టం మూల్యం గా చెల్లించుకోక తప్పదు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam