DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దేవాలయాల వైభవ పరిరక్షణే విశాఖ శ్రీ శారదాపీఠం సంకల్పం:స్వామి స్వరూపనంద

*శారదాపీఠం లో పంచారామ క్షేత్రాల అర్చకులతో సమీక్ష సమావేశం, సూచనలు* 

*రాజకీయ ఒత్తిళ్లకు లొంగి, ఎప్పుడు పడితే అప్పుడు అర్చనలు చెయ్యవద్దు* 

*(DNS Report: BV Satya Ganesh, Staff Reporter, Visakhapatnam)*   

*విశాఖపట్నం, అక్టోబర్ 11, 2022 (డిఎన్ఎస్):* పంచారామ క్షేత్రాల మూలవిరాట్ ల పరిరక్షణే శారదాపీఠం సంకల్పం అని విశాఖ శ్రీ శారదా

పీఠాధిపతులు స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి తెలియచేసారు. మంగళవారం చినముషిడివాడ పీఠం లో పంచారామ క్షేత్రాల అర్చకులు, అధికారులతో జరిగిన సమావేశంలో అయన కొన్ని సూచనలు చేసారు. అర్చకులు ఆలయాల్లోని భగవంతుణ్ణి చిన్న శిశువుగా సేవ చెయ్యాలని, అంత శ్రద్దగా జాగ్రత్తగా మూలవిరాట్ ను పరిరక్షించాలన్నారు.  

ఆలయంలో

పచ్చకర్పూరం కలిపిన నీళ్లు  ఔషధంగా పనిచేస్తుంది. పచ్చకర్పూరం చలువ చేస్తుంది. ఎలాంటి సమస్య రాదు అన్నారు.  అయితే కొందరు ఆర్భాటం కోసం పాలు, పళ్ళు, ముక్కలతో మూలవిరాట్ కు అభిషేకం చేస్తున్నారన్నారు. ఇలా అభిషేకం చెయ్యమని చెయ్యమని ఏ ఆగమం లోనూ చెప్పబడలేదన్నారు.  ప్రస్తుతం ఆలయాల్లో ఏ విధమైన ఆగమం ప్రకారం ఆరాధనలు

జరుగుతున్నాయో వాటినే కొనసాగించమని సూచించారు. 
ఈ క్షేత్రాలు పురాతన కాలం నుంచి మన తరానికి అందాయన్నారు. వీటిని భవిష్యత్ తరాలకు యధాతధంగా అందించవలసిన భాద్యత మనపై ఉందన్నారు. 

ఆయన చేసిన సూచనలు:

కొబ్బరి నీళ్లు కూడా ఎట్టిపరిస్థితుల్లోనూ మూల విరాట్ పై పొయ్యరాదన్నారు. కొబ్బరి కాయలు గర్భాలయం లో

కొట్టడం మంచిది కాదు. దీనిలో ఉండే యాసిడ్ ఉండడం వల్ల పాడవుతుంది. పాళ్లల్లో లాటకి యాసిడ్ ఉంటుంది.  దీనివల్ల విగ్రహం దెబ్బతింటుందన్నారు. శివుని కి మేలు చెయ్యాలి అనుకున్నప్పుడు కేవలం జలమే. కేవలం శ్రేష్టమైన గో క్షీరం, జలంతో మాత్రమే అభిషేకం చేయాలన్నారు. 

విగ్రహాలు సుద్ద శిలలు కావడం  వల్ల  వాటిని

పరిరక్షించాలి అంటే. . కేవలం జలాభిషేకమే చెయ్యాలి. ప్లాస్టిక్ సామాగ్రిని నిషేధించండి అన్నారు. 

కేవలం ఆవు పాలు శ్రేష్టం. ఇంటికో ఆవు ఉండాలి. గుడి కో ఆవు ఏర్పాటు చేస్తున్నాం. ఆలయాల్లో పాలను స్థానిక దేవస్థానం వాళ్ళే ఏర్పాటు చేస్తారన్నారు. 

నెయ్యి వాడకం పై జాగ్రత్త ఉండాలి. ఎముకలను కరిగించి నెయ్యిగా

మార్చడం వల్ల నెయ్యి నిషేధం; కల్తీ వల్ల అపచారం జరుగుతుందన్నారు. 

గోవులే గుడికి వచ్చేలా మంత్రులు ఏర్పాటు చేస్తారు. గర్భాలయం లో నెయ్యి దీపాలు వాడాలి. ఆరోగ్యానికి శ్రేష్టం. నూనె వాడకూడదు, ధూపాలు వాడడం వల్ల ఆలయాలు అపరిశుభ్రం అవుతుంది. నెయ్యి వల్ల మసిబారాదన్నారు.

మూలవిరాట్ కు కవచాలు చేయించండి

:

ఆరామ లింగాలు భిన్నమై ఉన్నాయి. బంగారం, వెండి తో మాత్రమే కవచం తయారు చేయించాలన్నారు. కవచాలపై మాత్రమే జల, క్షీర అభిషేకాన్ని నిర్వహించాలన్నారు. ఇత్తడి, ఇనుము పనికిరాదన్నారు. 
పూత వేసి,వాటికి అభిషేకం చెయ్యవచ్చు.  కేవలం శివరాత్రి రోజున స్వామి నిజ రూప దర్శనం చేయిస్తే. . . రానున్న తరాలకు ఈ వైభవాన్ని అందించగలం

అన్నారు. 

గుడి శుభ్రం చెయ్యాలి అనే లక్ష్యంతో 2003 లో గుడిమెళ్ళ శివాలయం లో పురాతన శాఖా వాళ్ళు...  ఒక ప్రయోగం చేసారు. గుడిని యాసిడ్ తో కడిగారు. దాంతో ఆరుగురు మరణించడం జరిగింది. 

రాజకీయ ఒత్తిళ్లకు లొంగవద్దు: 

ఆలయాల్లో రాజకీయ ఒత్తిళ్లకు లొంగి ఏ సమయంలో పడితే ఆ సమయంలో అభిషేకాలు చేయరాదన్నారు.

అభిషేకాలకు  ఒక  నిర్దుష్ట సమయాన్ని మాత్రమే కేటాయించండి. 

శారదా పీఠం. .మాత్రమే .అర్చకుల పక్షపాతి. . .అధికారులను సైతం తృణీకరించి అర్చకుల కోసం పోరాటం చేస్తుంది. దేవుణ్ణి తాకిన వాడు దీనావస్థలో ఉండకూడదు అనేది మా పీఠం లక్ష్యం అన్నారు. అర్చకులు మహోన్నత దశకు చేరుకోవాలి. ఆలయాల్లో మూలవిరాట్ కు అర్చనలు చేసే

అర్చకులు దీనావస్థలో ఉండకూడదు. కుటుంబ ఇబ్బందులు, పడకూడదన్నారు. 

అంతకు ముందు పంచారామ క్షేత్రాల అర్చకులు తమ ఆలయాల్లో నిర్వహించే అర్చనాది వివరాలను తెలియచేసారు. 

ఈ సమావేశంలో ఏపీ దేవాదాయ శాఖా మంత్రి కొట్టు సత్యనారాయణ, కమిషనర్ హరిజవహర్,  ఇతర అధికారులు, పాల్గొన్నారు. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam