DNS Media | Latest News, Breaking News And Update In Telugu

*BJP stand for development of AP, reannounced PM Modi* *ఏపీ అభివృద్ధి కై కోసం భాజపా కట్టుబడి ఉంది: ప్రధాని నరేంద్ర మోడీ* 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*    

*విశాఖపట్నం, నవంబర్ 12, 2022 (డిఎన్ఎస్):* ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి కోసం కేంద్రం లోని భారతీయ జనతా పార్టీ పూర్తి కట్టుబడి ఉందని, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించారు. శనివారం విశాఖ వేదికగా ఆయన సుమారు రూ. 10,500  వేల కోట్ల వ్యయం తో కూడిన కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులను

ప్రారంభించారు. రెండు రోజుల పర్యటనకు విశాఖ నగరానికి శుక్రవారం వచ్చిన అయన పలువురు అధికారులు, పార్టీనేతలు, ప్రతిపక్ష నేతలతోనూ సమావేశమయ్యారు. అందరూ కలిసి పనిచేస్తేనే దేశాభివృద్ధి కలుగుతుందని, పార్టీలకు అతీతంగా దేశ సౌఖ్యం కోసం పనిచేద్దామని పిలుపునిచ్చారు. దీనిలో భాగంగానే ఆంధ్ర లో బీజేపీ కి కనీస ఏ చట్ట సభలోనూ

ప్రాతినిధ్యం లేకపోయినా లక్షలాదిగా కోట్ల విలువ గల కేంద్ర ప్రాజెక్ట్ లను ఆంధ్ర కు కేటాయింపులు చేయడం జరిగిదన్నారు. నిబంధనల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాల సహకారం ఉంటె కేంద్రం ఇచ్చే నిధులు, ప్రాజెక్టులు ప్రజలకు సుస్పష్టమవుతాయన్నారు. 

ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో రూ. 10,500 కోట్ల విలువైన బహుళ ప్రాజెక్టులకు

శంకుస్థాపన చేసి, జాతికి అంకితం చేసారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు అన్ని రంగాలలో తమకంటూ ఒక ప్రముఖ పేరు తెచ్చుకున్నారని కొనియాడారు. “అభివృద్ధి మార్గం బహుమితీయమైనది. ఇది సాధారణ పౌరుడి అవసరాలు మరియు అవసరాలపై దృష్టి సారిస్తుంది మరియు అధునాతన మౌలిక సదుపాయాల కోసం రోడ్‌మ్యాప్‌ను అందిస్తుందన్నారు. సమ్మిళిత వృద్ధి మరియు

సమ్మిళిత అభివృద్ధి మా దృష్టి ఉందన్నారు.

ప్తపంచ ఆర్ధిక వ్యవస్థ సంక్షోభంలో ఉంది. ఇంధనం మొదలు ఆహారం వరకూ కొరత ఎదుర్కొంటున్నాయి. కానీ మనదేశం ఎన్నో అడ్డుగోడలు బద్దలు కొట్టి అభివృద్ధి దిశగా సాగుతోంది. ప్రపంచ దేశాలు ఇపుడు భారత్ వంక చూస్తోందన్నారు. రైతులకు ఏటా ఖాతాల్లోకి ఆరు వేల చొప్పున కిసాన్ సమ్మాన్ నిథి

ఇస్తున్నాం. పేదలకు అన్న యోజన కింద ఉచిత ఆహారధాన్యాలు ఇస్తున్నామన్నారు. సన్ రైజ్ సెక్టార్ల అభివృద్ధి పేరిట గేమింగ్, ద్రోన్ వంటి‌కొత్త రంగాల్లో అభివృద్ధికి యువతకు అవకాశాలు లభిస్తున్నాయన్నారు. ఆకాశం అంచులను, సముద్రం లోతులనూ భేదించి అభివృద్ధి సాధిద్దాం. చమురు సహజవాయువు వెలికితీతకు ఏపీ కేంద్రంగా మారుతోందన్నారు.

భారత అభివృద్ధి కలల సాకారం అంటే మన ప్రజల అభివృద్ధే. సముద్ర తీర ప్రాంతాల్లో అభివృద్ధి కోసం వేల కోట్ల రూపాయల పథకాలు అమలు చేస్తున్నాం. భవిష్యత్తులో ఇవి దేశాభువృద్ధికి కీలకం అన్నారు. సమగ్ర వికాసానికి తీసుకుంటున్న చర్యలు ప్రపంచంలో మన స్థాయిని పెంచుతున్నాయి. అందులో ఏపీకి ముఖ్య పాత్ర ఉందని మోడీ తెలిపారు.

 

పీఎం గతి శక్తి నేషనల్ మాస్టర్ ప్లాన్ మౌలిక సదుపాయాల కల్పనను వేగవంతం చేయడమే కాకుండా ప్రాజెక్టుల వ్యయాన్ని కూడా తగ్గించిందన్నారు. బ్లూ ఎకానమీ మొదటి సారి చాలా పెద్ద ప్రాధాన్యతగా మారిందని మోడీ తెలిపారు. ప్రజల శ్రమ శక్తి కి తగిన సహకారం లభించే విధంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి

తీసుకువచ్చే ప్రాజెక్టులు ఎన్నో అమలు చేస్తున్నామన్నారు. 

ప్రధాని మోడీ హిందీ లో చేసిన ప్రసంగానికి ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ తెలుగులో అనువాదం చేసారు. అనువాదం అందరిని ఆకట్టుకుంది. 
ఈ వేదికపై కేంద్ర రైల్వే శాఖా మంత్రి అశ్విని వైష్ణవ, ఆంధ్ర ప్రదేశ్ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ఏపీ ముఖ్యమంత్రి

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆశీనులయ్యారు. ఈ కార్యక్రమం లో పాల్గొనేందుకు అధిక సంఖ్యలో జన సమీకరణ చెయ్యడంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తి మార్కులు కొట్టేసింది. 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam