DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వారిజ వేద పాఠశాల ఆశ్రమాన్ని సందర్శించిన మద్రాస్ ఛీఫ్ జస్టిస్ దేవానంద్ 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*    

*వేద విద్యార్ధులకు మద్రాస్ ఛీఫ్ జస్టిస్ దేవానంద్ అభినందనలు* 

*విశాఖపట్నం, డిసెంబర్  17, 2022 (డిఎన్ఎస్):* మద్రాస్ హై కోర్ట్ చీస్ జస్టిస్ బట్టు దేవానంద్ శనివారం విశాఖ భీమిలి బీచ్ రోడ్ లో గల చిన్న జీయర్ స్వామి వారి వేద పాఠశాల ( వారిజ ఆశ్రమం ) ను సందర్శించారు.

ఆశ్రమం లోని శ్రీ లక్ష్మి హయగ్రీవ ఆలయంలో ప్రత్యేక పూజ నిర్వహించారు. ఆశ్రమ వేద అధ్యాపకులు ముడుంబై శ్రీకాంత్ స్వామి, శిష్య బృందం న్యాయమూర్తి కి వేదాశీర్వచనం అందించారు. అంతకు ముందు వీరి పేరిట నక్షత్ర జపం చేపట్టారు. అనంతరం  అదే ప్రాంగణం లో గల గోశాల, వేద పాఠశాల,  నేత్ర విద్యాలయ నిర్వహణ తదితర వివరాలను, ఆశ్రమం లో

 జరుగుతున్న కార్యక్రమాలను  నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. 

ఇటీవల కాలం వరకూ దేవానంద్ ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా భాద్యతలు నిర్వహించారు. గత నెల్లో ఐదుగురు జడ్జిలను బదిలీ చేస్తూ కొలీజియం సిఫారసు చేయడంతో వీరిని మద్రాస్ కు బదిలీ చేయడం జరిగింది.  

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam