DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బ్రాహ్మణ సంక్షేమమే ధ్యేయంగా స్వీయ కార్యాచరణ సాగుతోంది

*ఏపీ ప్రైవేట్ అర్చక, పురోహిత సంక్షేమ సంఘం వెల్లడి* 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*    

*విశాఖపట్నం, డిసెంబర్  26, 2022 (డిఎన్ఎస్):* బ్రాహ్మణ సంక్షేమమే ధ్యేయంగా  తమసంఘం ముందుకు సాగుతున్నట్టు ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అర్చక మరియు పురోహిత సంక్షేమ సంఘం రాష్ట్ర, జిల్లా కమిటీ ప్రతినిధులు

తెలియచేసారు. 
ప్రైవేటు, అర్చక పురోహిత కుటుంబాలను సంఘటితం చేసి, బ్రాహ్మణా వ్యవస్థను బలోపేతం చేసేందుకు నిర్వహించిన ఆత్మీయ కలయికకు మంచి స్పందన లభించింది. ఈ వన మహోత్సవ కార్యక్రమం మారికవలస దరి శ్రీ కాశీ విశ్వేశ్వర దేవాలయ ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అర్చక, పురోహిత సంక్షేమ సంఘం విశాఖ జిల్లా అధ్యక్షులు

అంబటిపూడి సుదీర్ కుమార్ శర్మ, కార్యదర్శి మావుడూరు సంపత్ కుమార్ శర్మ తదితరుల నిర్వహణలో జరిగింది. ముందుగా అర్చకులు వేమకోటి అనంత పద్మనాభ శర్మ రుద్రాభిషేకం నిర్వహించారు. 
అతిధులు దీప ప్రజ్వలన చేసి, కార్యక్రమం ను ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి విచ్చేసిన సంఘం రాష్ట్ర అధ్యక్షులు వెలగలేటి సతీష్ శర్మ,

రాష్ట్ర ఉపాధ్యక్షలు ఈశ్వరప్రగడ విజయ కుమార్ రాజ్ శర్మ, రాష్ట్ర కార్యదర్శి అధికారుల కాళిదాసు శర్మ, రాష్ట్ర కమిటీ సభ్యులను పూర్ణకుంభ స్వాగతంతో ఆహ్వానించారు. 
 
జిల్లా అధ్యక్షులు అంబటిపూడి సుధీర్ కుమార్ శర్మ మాట్లాడుతూ బ్రాహ్మణుల సంక్షేమం, ఎదుర్కొంటున్న సమస్యలు తోపాటు పలు అంశాలపై వివరించారు అలాగే జిల్లా

సంఘ కార్యదర్శి మావుడూరు సంపత్ కుమార్ శర్మ మాట్లాడుతూ వైదిక పూజారాదన విశిష్ట అతిథులకు గౌరవ సన్మానంకార్యక్రమం తో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించిన్నట్లు వెల్లడించారు రాష్ట్ర సంఘం అధ్యక్ష కార్యదర్శులు వెలగలేటి సతీష్ శర్మ మాట్లాడుతూ ఈ ఆత్మీయ కలయిక సభా ప్రాంగణాన్ని  మరియు ఏర్పాట్ల వీక్షించి ఆనందం

వ్యక్తపరిచారు మరిన్ని కార్యక్రమాలు నిర్వహించాలని సభాముఖంగా జిల్లా కార్యవర్గ సభ్యులుకు సలహా సూచనలు తెలియజేశారు. 

రాష్ట్ర కార్యదర్శి అధికారుల కాళిదాస్ శర్మ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూల నుంచి బ్రాహ్మణ కుటుంబాలు పాల్గొని విజయవంతం చేశారని అలాగే ఈ కార్యక్రమం ఇంత విజయవంతం అయ్యేందుకు

సహకరించిన జిల్లా కార్యవర్గ సభ్యులు, ఉత్సవ కమిటీ  చైర్మన్ రావూరి సుభ్రమణ్యం ను, కమిటీ విశేషంగా కృషి చేశారని అన్నారు. 
కార్యక్రమం లో విశాఖ జిల్లా అధికార ప్రతినిధి దుర్వాసుల రామశాస్త్రి, జిల్లా కార్యదర్శి మావుడూరి సంపత్ కుమార్, జిల్లా కార్యవర్గ సభ్యులు  అతిధులకు ఇతోధికంగా సత్కరించారు. కార్యక్రమంలో పెద్ద

సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam