DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మహోన్నతం విశాఖ వేదపండితుల 30 రోజుల భారత పరిక్రమ యాత్ర 

*దేశ శాంతి కోసం సప్త ఋషి ట్రస్ట్ 30 రోజుల అవిశ్రాంత యాత్ర పరిపూర్ణం* 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*    

*విశాఖపట్నం, జనవరి 21, 2022 (డిఎన్ఎస్):*  అత్యంత పురాతనమైన, పవిత్రమైన వేద వాఙ్మయాన్ని గ్రామగ్రామాన వినిపించేందుకు విశాఖ కు చెందిన సప్త ఋషి చారిటబుల్ ట్రస్ట్ చేపట్టిన భారత దేశ పరిక్రమ

యాత్ర శనివారం దిగ్విజయంగా పూర్తి అయ్యినట్టు ట్రస్ట్ నిర్వాహకులు  మావళ్లపల్లి మాధవ శర్మ DNS మీడియా కు  తెలియచేసారు. గత ఏడాది డిసెంబర్ నెల 21 వ తేదీన విశాఖ లోని శ్రీవరాహలక్ష్మి నృసింహ స్వామి దేవస్థానం సింహాచలం నుంచి బయలు దేరిన ఈ యాత్ర భారత దేశంలోని పలు దివ్యక్షేత్రాలు, పవిత్ర ప్రాంతాల్లో పర్యటించి జనవరి 21, 2023 తిరిగి

సింహాచల నాధుని సన్నిధిలో వేదపారాయణం తో పరిపూర్ణం అయ్యిందన్నారు. తమ యాత్ర రథాన్ని పరమహంస పరివ్రాజకాచార్య త్రిదండి అహోబిల జీయర్ స్వామి 
విశాఖలోని తమ వేదపాఠశాలలో ప్రారంభించి వేదపండితులకు మంగళశాసనములు అందించడం జరిగిందన్నారు.   

ఈ వేద పరిశ్రమ యాత్ర లో 25 మంది వేదపండితులు చేసిన వేదం స్వరం ద్వారా దేశ

వ్యాప్తంగా వైదిక, దైవిక తరంగాలు ప్రసరించి ప్రజలు సుభిక్షంగా ఉంటారని ఆశాభావాన్ని వ్యక్తం చేసారు. 
ఆదిశంకరులు నడిచిన యాత్ర లోని ప్రాంతాలలో గత మూడేళ్లు గా పర్యటిస్తూ తాము నాలుగు వేదాలను పారాయణ చేసామన్నారు. ఋగ్వేదం, శుక్ల యజుర్వేదం, కృష్ణ యజుర్వేదం, సామవేదం, అధర్వ వేదం పారాయణ తో పాటు, మహిళా సభ్యులచే శ్రీ లలితా

సహస్రనామ పారాయణ, చిన్నారులచే కనకధారా స్తవం, 24 లక్షల గాయత్రీ జపం కూడా నిరాఘాతంగా పఠించడం జరిగిందన్నారు. 
గత 70 ఏళ్ళ తర్వాత కాశ్మీర్ రాష్ట్రంలో వేదపారాయణం చేసిన ఘనత సప్తఋషి చారిటబుల్ ట్రస్ట్ దే నన్నారు. అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో మాధవ శర్మ బృందం  2022 లో శ్రీనగర్ లో వేద దివస్ ను వైభవంగా 4 రోజుల పాటు కాశ్మీర్ లో

నిర్వహించడం విశాఖ కె గర్వకారణం అన్నారు.  
వివిధ ప్రాంతాలకు చెందిన 25 వేదపండితులు, మహిళలు, చిన్నారులు ఒక ప్రత్యేక బస్సులో ఈ యాత్రలో పాల్గొన్నారు. 
ఈ యాత్ర  విశాఖ నుంచి సింహాచలం, అన్నవరం, యానాం, మురుముళ్ల, అమలాపురం, రావులపాలెం, ఏలూరు, విజయవాడ, శ్రీశైలం, మహానంది, యాగంటి, మంత్రాలయం, కర్నూల్, అహోబిలం, నెల్లూరు,

శ్రీకాళహస్తి, తిరుపతి, కాంచీపురం, శ్రీకాళహస్తి, తిరుపతి, అరుండరాంబరం, వెల్లూరు, పాలక్కాడ్, కాలడి, శృంగేరి, మురుడేశ్వర్, శివమొగ్గ, కొల్హాపూర్, మహాబలేశ్వర్, భీమశంకర్, మహేశ్వర్, ఓంకారేశ్వర్, ఉజ్జయిని, నిష్కల్ంక్ (భావనగర్), సోమనాథ్, ద్వారక, నాగేశ్వర్, ఉదయపూర్, జైపూర్, బ్రహ్మసరోవరం, కురుక్షేత్రం, జమ్మూ, శంకరల్ లాచార్య కొండలు ,

సింధూరివర్ ఖీర్ భవానీ ఆలయం, లాల్చౌక్, శృంగేరి నిర్మించిన ఆలయం, ధర్మశాల, హరిద్వార్, రిషికేశ్, జోషిమఠ్, జాగేశ్వర్, నైమిశారణ్య, అయోధ్య. ,ప్రయాగ్‌రాజ్, మీర్జాపూర్, వారణాసి, అమర్‌కంటక్, బిలాస్‌పూర్, రాయ్‌పూర్, భువనేశ్వర్, కోణార్క్, పూరి,
సోంపేట, ఇచ్ఛాపురం, శ్రీకాకుళం, విజయనగరం ల్లో పర్యటించి సింహాచల క్షేత్రానికి

చేరుకుందన్నారు. 

యాత్ర ఆరంభంలో కంచి పీఠాధిపతులు విజయేంద్ర సరస్వతుల ఆశీస్సులు పొందడం జరిగిందని, యాత్ర ముగింపు రోజున కూడా వారు విశాఖలో వేంచేయడంతో వారిని దర్శించి, యాత్ర విశేషాలను తెలియచేయడం జరిగిందన్నారు. 

ఈ యాత్రలో సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు తెలియచేసారు. 
 


Latest Job Notifications

Panchangam - Dec 4, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam