DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ కు ఉక్కు ఉద్యమంలో కేసీఆర్ పాల్గొనున్నారా? బిఆర్ఎస్ సుముఖం 

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*    

*విశాఖపట్నం, ఫిబ్రవరి 24, 2023 (డిఎన్ఎస్):* గత 740 రోజులుగా సాగుతున్న విశాఖ ఉక్కు ఉద్యమం మరింత ఊపు అందుకోనుంది. ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకు వెళ్లేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి, భారత్ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్ర శేఖర్ రావు రంగంలోకి దిగే అవకాశం కనపడుతోంది. ఈ మేరకు

బి.ఆర్.ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ సుముఖు సంకేతాన్ని తెలియచేస్తున్నారు. ఆయన్ని హైదరాబాద్, బంజారాహిల్స్ లో ఆయన నివాసంలో ఉత్తరాంధ్ర పరిరక్షణ జేఏసీ కన్వీనర్ ప్రియాంక దండి శుక్రవారం కలిశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటికరణకు వ్యతిరేకంగా 740 రోజుల పై బడి కార్మిక సంఘాలు రిలే

నిరాహార దీక్షలు చేస్తున్నారని. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విచ్చేసి కార్మికులు చేస్తున్న పోరాటానికి సంగీభవం తెలపాలని ఆమె కోరారు, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం పై పోరాడటంలో వెనకడుగు వేస్తోందని,స్టీల్ ప్లాంట్ విషయంలో వైసీపీ ప్రభుత్వ వైఖరి నష్టం చేకూర్చేలా ఉందని ప్రియాంక అన్నారు. పలు

సందర్భాలలో కెసిఆర్ ఆంధ్రప్రదేశ్ కి కష్టం వస్తే నేను అండగా ఉంటానని చెప్పారని పలు వేదికల మీద కెసిఆర్ విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం పార్లమెంట్ లో మా ఎం.పిలతో పోరాటం చేయిస్తానని అన్నారని ఇప్పుడు సమయం వచ్చిందని, కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖ స్టీల్ ప్లాంట్  కార్మికులకు, నిర్వాశితులకు ద్రోహం చేసే పని

తలపెట్టాయని,రాష్ట్రంలో అతి పెద్ద ప్రభుత్వ రంగ కర్మాగారం 32 మంది ప్రాణ త్యాగాలతో ఏర్పడిన స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేసి లక్షల కోట్ల విలువ చేసే భూములను చౌకగా కొట్టేయాలని చూస్తున్నారని ప్రియాంక అన్నారు. స్టీల్ ప్లాంట్ కి సొంతంగా ఘనులు కేటాయించకపోయిన కార్మికులు కష్టపడి లాభాలలో నడిపిస్తున్నారని, కేంద్రం కేవలం 5

వేల కోట్లు మాత్రమే పెట్టుబడి పెట్టిందని, స్టీల్ ప్లాంట్ కార్మికులు తిరిగి 50 వేల కోట్లు పన్ను రూపంలో కేంద్రానికి ఇచ్చారాని ప్రియాంక వివరించారు, మోడీ ప్రభుత్వం తీసుకున్న పబ్లిక్ సెక్టార్ సంస్థల  ప్రైవేటికరణ విధానానికి దేశంలో వ్యతిరేకంగా గళం ఎత్తిన ఒకేఒక వ్యక్తి కెసిఆర్ అని ప్రియాంక కొనియాడారు,తెలంగాణలో

సింగరేణిని కూడ ప్రైవేట్ పరం చేయాలని కేంద్రం ప్రణాళిక చేస్తే కెసిఆర్ కి బయపడి వెనక్కి తగ్గిందని, స్వయంగా ప్రధాని మోడీ హైదరాబాద్ సాక్షిగా సింగరేణిని ప్రైవేట్ చేయమని ప్రకటించారని విశాఖ స్టీల్ ప్లాంట్ కి కూడ కెసిఆర్ అండగా నిలిస్తే కేంద్రం వెనక్కి తగ్గుతుందని ప్రియాంక తోట చంద్రశేఖర్ ని కోరారు, ఈ సందర్బంగా ఆమె

వినతిపత్రం అందజేశారు.

తోట చంద్రశేఖర్ స్పందిస్తూ విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం పార్లమెంట్ లో మా ఎం.పి తో పోరాడతాం అని కెసిఆర్ అనేక సందర్భాలలో చెప్పారని,స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు కోరితే కెసిఆర్ అప్పోయింట్మెంట్ ఇప్పిస్తానని, అంతే కాకుండ కెసిఆర్ ని విశాఖపట్నం తీసుకువచ్చే బాధ్యత నేను తీసుకుంటానని,

పార్లమెంట్ లో బి.ఆర్.ఎస్ ఎం.పి లు స్టీల్ ప్లాంట్ కోసం పోరాడతారని తోట చంద్రశేఖర్ భరోసా ఇచ్చారు, కార్మికులు కోరితే స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం కాకుండ దేశంలో బీజేపీ వ్యతిరేక రాజకీయ శక్తులను ఏకం చేసి పోరాడతాం అని హామీ ఇచ్చారు. ఆయనని కలిసిన వారిలో కార్యనిర్వాహక కార్యదర్శి జగన్ మురారి కూడ ఉన్నారు.

 


Latest Job Notifications

Panchangam - Dec 4, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam