DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ నుంచి జోన్ రైల్వే కూతలు. . , ఏనాటికి వినిపించనున్నాయో ?

*రైల్వే మంత్రి దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రకటన చేసి నేటికీ సరిగ్గా నాలుగేళ్లు*

*కార్యాచరణ పై బీజేపీకి ఫాలో అప్ .. ఇతర పార్టీలకు పట్టింపు లేవా?*

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार, Visakhapatnam)*    

*విశాఖపట్నం, ఫిబ్రవరి 27, 2023 (డిఎన్ఎస్):* విశాఖ రైల్వే జోన్. . . . ఉత్తరాంధ్ర వాసుల చిరకాల కోరిక, డిమాండ్

అత్యంత త్వరలో నెరవేరనుంది. విశాఖ నుంచే రైల్వే కూతలు వినిపించనున్నాయి. అయితే aa త్వరలో ఎప్పుడు అనేదే తెలియడం లేదు. ఈ మేరకు కేంద్రం చర్యలు ఉన్నట్టు తెలుస్తోంది. 2019 ఫిబ్రవరి 27 నాడు. . నాటి కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటన చేసిన విషయం తెలిసిందే. నాటి

నుంచి ప్రత్యేక అధికారి ని నియమించి, పూర్తి విభజన ప్రక్రియ కోసం ప్రాజెక్ట్ నివేదికను సిద్ధం చేయమని ఆదేశించడం జరిగింది. స్థానిక వనరులు, పరిస్థితులు, సాంకేతిక నిబంధనలకు లోబడి నివేదికను ఇప్పడికే కేంద్రానికి పంపినట్టు తెలుస్తోంది. కేంద్రం ఈ నివేదిక పై ద్రుష్టి సారించి, దాదాపుగా చిన్న సవరణలతో అంగీకార ముద్ర కూడా

వేసినట్టు తెలుస్తోంది. అయితే అధికారికంగా ప్రకటన వెలువడలేదు. దీనికి అంగీకారంలో భాగంగానే విశాఖ రైల్వే జోన్ పనుల కోసం ప్రస్తుత కేంద్ర బడ్జెట్ లో రూ. 10 కోట్ల నిధులను కూడా కేటాయించడం జరిగింది. కేంద్రం సుముఖత తో లేకుంటే. .విశాఖ రైల్వే జోన్ కు నిధులు కేటాయించే అవకాశమే లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.  

గత

ప్రభుత్వాలు విశాఖ రైల్వే జోన్ ను ఎన్నికల అజెండా గా మాత్రమే వాడుకుని, ఓట్లు దండుకున్న నాటి నుంచి స్థానికులు పార్టీల నేతలను నిలదీయడం మొదలు పెట్టారు. అయితే రాష్ట్ర విభజన సమయంలో నాటి అధికార కాంగ్రెస్ పార్టీ సైతం ఆంధ్ర ప్రదేశ్ ను, ముఖ్యానంగా విశాఖ ప్రాంతాన్ని నట్టేట ముంచడం తో ప్రజలు పార్టీలను ప్రత్యక్షంగానే

నిలదీస్తున్నారు. దీనిలో భాగంగా 2019 లో నాటి భారత ప్రధాని నరేంద్ర మోడీ విశాఖ లో బహిరంగ సభ సమయంలో భారతీయ జనతా పార్టీ కి ఇదే అంశంపై జనం చుక్కలు చూపించారు. ప్రజల ఒత్తిళ్లను తట్టుకోలేని బీజేపీ, ఫిబ్రవరి 27, 2019 నాటి సాయంత్రం కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ che దక్షిణ కోస్తా రైల్వే జోన్ ను విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా ఏర్పాటు

చేస్తున్నట్టు మీడియా ద్వారా ప్రకటన విడుదల చేశారు. 
అయితే ఈ ప్రకటన సార్వత్రిక ఎన్నికల ముందు చేయడంతో ఎన్నికల్లో విజయం సాధించడం కోసం పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాల్సిన బీజేపీ ఆంధ్ర ప్రదేశ్ శాఖా పూర్తిగా బొక్కబోర్లా పడింది. నరేంద్ర మోడీ ఇచ్చిన అక్షయపాత్ర లాంటి రైల్వే జోన్ ప్రకటనను బీజేపీ ఘనత గా ప్రచారం

చేసుకోడం చేతగాక, ఏపీ లో పోటీ చేసిన అన్ని ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో డిపాజిట్లు సైతం కోల్పోయింది. 

దీన్ని ప్రతిపక్ష పార్టీలు పూర్తిగా తమ ఖాతాలోకి వేసేసుకున్నాయి. కేంద్రంలో ఒత్తిడి తెచ్చి తామే రైల్వే జోన్ తీసుకు వాచం అంటూ ఎన్నికల్లో విస్తృత ప్రచారం చేసుకున్నాయి.

నేటికీ రైల్వే జోన్ ప్రకటన జరిగి

4 ఏళ్ళు పూర్తి అవుతున్నా. . .కేంద్రం నుంచి ఉలుకూ లేదు, పలుకూ లేదు. దీని గురించి అధిష్టానాన్ని ప్రశ్నించేందుకు బీజేపీ నేతలకు ధైర్యం లేదు, 

అయితే నాడు ఈ రైల్వే జోన్ మేమె తీసుకు వచ్చాము అని ప్రగల్బాలు పలికి ఓట్లు దండుకున్న ప్రతిపక్ష పార్టీలు నేడు ఈ అంశంపై నోరే ఎత్తేందుకు సైతం భయపడుతున్నాయి. 

ఏది

ఏమైనా కేంద్రమే దయదలిచి ఎన్నో రోజులు ఆపడం సరికాదు అని భావించి  రైల్వే జోన్ విడుదల చేస్తే  తప్ప దక్షిణ కోస్తా రైల్వే కు విముక్తి లేదు అని తెలుస్తుంది. 

 


Latest Job Notifications

Panchangam - Dec 4, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam