DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సంక్షేమ ఫలాలను అందచేసే క్రమంలో "ఎవ్వరినీ వదిలిపెట్టవద్దు" 

*DNS Report : P. Raja, Bureau Chief, Amaravati*   

*అమరావతి, ఫిబ్రవరి 28, 2023 (డి ఎన్ ఎస్ ):* సంక్షేమ, అభివృద్ధి ఫలాలను అందరికీ అందచేసే క్రమంలో "ఎవ్వరినీ వదిలిపెట్టవద్దు" అనే లక్ష్యంతో అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయ్య గలిగితే సుస్థిర అభివృద్ధి లక్ష్యాల 2016-2030 మిలీనియం అభివృద్ధి లక్ష్యాలను సాధించ గలుగుతామని రాష్ట్ర ప్లానింగ్

కార్యదర్శి జి. ఎస్ ఆర్ కే. ఆర్. విజయ కుమార్ పేర్కొన్నారు. ఈ సమస్య మనది అనే దృక్పథం కలిగిన  పనిచేస్తే  తప్పక సమస్య కి పరిష్కారం లభిస్తుందని అన్నారు. 

మంగళవారం ఉదయం పూట స్థానిక శ్రీ వేంకటేశ్వర ఆనం కళా కేంద్రంలో రాష్ట్ర ప్రణాళిక శాఖ ఆధ్వర్యంలో తూర్పు గోదావరి, కాకినాడ, కోనసీమ జిల్లాల కలెక్టర్ లు, ఎస్పీ లు,

క్షేత్ర స్థాయి అధికారులతో  ఎస్ డి జి మరియు స్పందన  పై  ఓరియంటేషన్ మరియు సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కార్యదర్శి విజయ కుమార్ మాట్లాడుతూ, సుస్థిర అభవృద్ధి లక్ష్యాలను సాధించడానికి రాష్ట్ర ప్రభుత్వం 17 అంశాలను పలు సూచికలు నిర్దేశించినట్లు పేర్కొన్నారు. 2016-2030 మిలీనియం సమీకృత అభివృద్ధికి  

అభివృద్ధి లక్ష్యాల సాధనకు ప్రపంచ వ్యాప్తంగా 8 అంశాలు, 18 లక్ష్యాలు, 56 సూచికలు తో ప్రణాళిక సిద్ధం చెయ్యడం జరిగిందన్నారు. సమిష్టి కృషి ద్వారా పరస్పరం చర్చించు కోవడం ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. కార్యశాల లో భాగస్వామ్యం అయి సంస్థాగత నిర్మాణం కోసం కార్యశాల ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజల నుంచి

అర్జీలు తీసుకుని పరిష్కారం కోసం చర్యలు దశాబ్దల కాలంగా జరుగుతున్న, అందులో ప్రాధాన్యత కల్పించే ఉద్దేశంతో గత మూడున్నర ఏళ్లలో చేపట్టిన చర్యలు చెప్పిన సమయంలో పరిష్కారం, నాణ్యత తో కూడిన పరిష్కారం, సమయ పాలన ముఖ్యం మైన అంశాలుగా ఆయన పేర్కొన్నారు.

సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు పేదరికం ప్రధాన అడ్డంకిగా

మారిందని యునిసేఫ్ గుర్తించి, అందుకు అనుగుణంగా పలు ప్రతిపాదనల తో కూడి సూచికలు ఇవ్వడం జరిగిందని ఆయన అన్నారు. దుర్భర పేదరికం, ఆకలి ప్రాలదొరడం, ప్రాథమిక విద్య, లింగ సమానత్వం, పిల్లల్లో పౌష్టిక విలువలు, శిశు మరణాలు, గర్భిణీ మరణాలు, వ్యాధులు, పర్యావరణ కాలుష్యము,  త్రాగునీరు, పరిశ్రమలు, కనీస అవసరాలు తీర్చడం, అవినీతి కి

తావులేకుండా చూడడం, సమన్యాయం, సమానత్వం, తదితర పలు అంశాలను అధ్యయనం చేసి వాటిని సమర్థవంతంగా రూపుమాపడానికి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకుని అమలుకు కృషి చేయాలని పేర్కొనడం జరిగిందన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతున్న, వాటి యొక్క ఫలితాలు ప్రతిబింబించక పోవడానికి ప్రధాన కారణం

వాటి వివరాలు ఎప్పటి కప్పుడు నమోదు కాకపోవడం ముఖ్య కారణం గా విజయ కుమార్ తెలిపారు. చేపట్టిన పనులు, వాటికి అనుగుణంగా వాటి వివరాలు ప్రతిబింబించడం పై క్షేత్ర స్థాయి అధికారులు దృష్టి పెట్టాలని స్పష్టం చేశారు. ప్రకృతిని పరిరక్షిస్తూ, అభివృద్ధి చేయడం ద్వారా మాత్రమే సుస్థిర అభివృద్ధి సాధ్యం అన్న విషయం ప్రతి ఒక్కరూ గుర్తు

ఉంచుకోవాలని స్పష్టం చేశారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి మరింత సరళీకృతం చేసే విధానం లో 20 ప్రాధాన్యత సూచికలను రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించడం జరిగిందన్నారు. వాటిలో ఆరు ఆరోగ్య , రెండు స్త్రీ శిశు సంక్షేమ , నాలుగు విద్య , ఒక పురపాలక , ఐదు హోం , ఒక పంచాయతీ రాజ్ , ఒక వ్యవసాయ శాఖ కి చెందినవి ఉన్నట్లు

పేర్కొన్నారు.

కాకినాడ జిల్లా కలెక్టర్ డా . కృత్తిక శుక్లా మాట్లాడుతూ ఎస్ డి జీ లక్ష్యాలను , స్పందన అర్జీల పరిష్కారం సాధించడానికి అవసరమైన సూచనలు చేసే విధానం లో ఈ సమావేశానికి ఒక ప్రాధాన్యత కలిగి ఉందన్నారు. అన్ని పథకాలను సమగ్రంగా అమలు చేయడం ఎంతో ప్రాధాన్యత కలిగి ఉందని ఆమె అన్నారు. జిల్లా పరిధిలో ఉన్న 10

అసెంబ్లీ నియోజక వర్గాల స్థాయి లో ప్రజల మధ్య స్పందన కార్యక్రమం నిర్వహించడం జరిగిందన్నారు. ప్రతి వారం సగటున 380 నుంచి 400 వరకు ఆర్జీలు వస్తున్నాయని, వాటిలో రెవెన్యూ శాఖ వి 25%, పోలీస్ శాఖకు చెందినవి 20% అర్జీలు నమోదు అవుతున్నట్లు పేర్కొన్నారు. సివిల్ తగాదాలకు చెందిన వాటికి సంబందించిన అర్జిలే ఎక్కువగా ఉన్నట్లు కృతిక శుక్లా

పేర్కొన్నారు.

డా బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమన్ష్ శుక్లా మాట్లాడుతూ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనకు విభిన్న ఆలోచనలు ఉంటాయని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా 17 అంశాలపై దిశా నిర్దేశం చేయడం లో భాగంగా 116 సూచికలు రూపొందించినట్లు పేర్కొన్నారు. సమస్య ను గుర్తించి, పరిష్కారం కోసం

దృష్టి పెడితే తప్పక మంచి ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు. అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి ఒకదానికి ఒకటి మిళితమై ఉంటాయని, ప్రతి ఒక్క శాఖ అధికారులు, సిబ్బంది సమన్వయం చేసుకుంటూ అడుగులు వేయాల్సి ఉంటుందన్నారు.

డ్రాప్ అవుట్ కి సంబంధించి బాల్య వివాహాలు, చిన్న వయస్సులో పిల్లల్ని కనడం, పిల్లలో వయస్సు కు తగ్గ

ఎదుగుదల లేకపోవడం, రక్త హీనత, తగిన బరువు లేకపోవడం వంటి పలు కారణాలు బడి బయట పిల్లలు ఉండేందుకు కారణాలు ఉండే అవకాశం ఉందని ఉదహరించారు. సమస్యను గుర్తించి మూలాల నుండి పరిష్కారం చెయ్యగలిగితే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను సాధించగలమన్నారు. స్పందన అర్జీల పరిష్కార విషయంలో కూడా సమస్య మూలం తెలుసుకుని పరిష్కారం చెయ్యడం ముఖ్యం

అని పేర్కొన్నారు.

మునిసిపల్ కమిషనర్ కె. దినేష్ కుమార్ మాట్లాడుతూ ప్రతి సమస్య కు పరిష్కారం ఒక స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలన్నారు. ఎస్ డి జీ లక్ష్యం సాధన దిశగా చేపట్ట వలసిన విషయం పై ఎంతో స్పష్టంగా వివరించడం జరిగిందన్నారు. మనందరం ఒకరికొకరు సమిష్టి బాధ్యత కలిగి అడుగులు ముందుకు వెయ్యడం ద్వారా సుస్థిర సాధించ

గలుగుతానన్నారు.  పరిష్కారం కోసం ఒకదానికి ఒకటి అనుసంధానం చేయడం, సమన్వయం చేసుకుంటూ అడుగులు వేయడం ముఖ్యం అన్నారు. మానవీయ విలువలు, సామాజిక అంశాలను దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి లక్ష్యాలను సాధించడానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

ఈ కార్యశాలలో స్పందన పై ఆర్ టి జి ఎస్ అధికారి జీవన్, గ్రామ

వార్డు సచివాలయం డేటా నమోదు పై ప్రాజెక్ట్ అధికారి అనూష, ఆరోగ్య సూచికలపై   కే. శివ శంకర్ బాబు, విద్య పై విజయ దుర్గ, పౌష్టి కాహరం పై రోజా రాణి, స్పందన పై ప్రసాద్, పురపాలక పై  పూర్ణచంద్రరావు, పర్యావరణం పై రాజేంద్ర రెడ్డి లు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది.  తొలుత  జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని

ప్రారంభించారు.  ఈ సందర్భంగా సదస్సుకు  హాజరైన పలువురు అధికారులు   స్పందన అర్జీలు, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలపై పలు అంశాలు సమావేశం దృష్టికి తీసుకురాగా పరిష్కారం పై వివరణ అందించారు. 

ఈ కార్య్రమానికి ముఖ్య వాఖ్యత గా డి ఆర్ వో జీ. నరసింహులు, మూడు జిల్లాల జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు

పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam