DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ ఉక్కు ఉద్యమం లో కలిసి రానిది ఎవరు ఉద్యోగుల? పార్టీలా?

*కేంద్రాన్ని కలిసేందుకు హస్తినకు ఉక్కు ఉద్యోగ సంఘాలు*

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*    

*విశాఖపట్నం మార్చి 16, 2023 (డిఎన్ఎస్ ):* విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రయివేట్ పరం చేస్తున్నట్టు కేంద్రం చేసిన ప్రకటన తదుపరి ఉద్యోగ సంఘాలు మొదలు పెట్టిన ఉద్యమం లో ఎవరికీ వారు తమకు  అనుకూలంగా అడుగులు

వేస్తున్నట్టుగానే ఉంది. ఉద్యోగులు తమ డిమాండ్లను నెరవేర్చుకునేందుకు  చేసుకున్న ప్రణాలికను అమలు చేసే విధంగా మాత్రమే ఉండడంతో వివిధ రాజకీయ పార్టీలు సైతం చేతులు  దులుపుకున్నట్టుగానే ఉన్నాయి.

రాజకీయ పార్టీల సహకారం లేదు. . . 

తమ ఉద్యమానికి రాజకీయ పార్టీల సహకారం లేదంటూ ఉద్యోగ సంఘాలు గురువారం

నిర్వహించిన విలేకరుల సమావేశంలో ప్రకటించాయి. 

ఉక్కు ఉద్యమం అజెండా పెట్టుకుని బీజేపీ మినహా ఇతర రాజకీయ పార్టీలన్నీ విశాఖపట్నం స్థానిక ఎన్నికలకు వెళ్లాయి. వీళ్ళకి ఉద్యోగ సంఘాలు సైతం మద్దతు ఇచ్చాయి. ఎన్నికల తదుపరి పార్టీలు, ఉద్యమాన్ని ప్రక్కన పెట్టేశాయి. దీంతో ఉద్యోగ సంఘాలు కేంద్రాన్ని కలిసి తమ గోడు

వినిపించేందుకు  హస్తినకు బయలు దేరుతున్నాయి. 

రాజకీయ పార్టీలు, ఎంపీలు, ఎమ్మెల్యే లు ఎవరి దారిన వాళ్ళే ఉన్నారని, తమను పట్టించుకునే తీరిక లేదంటూ ఉద్యోగ సంఘాలు  ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. 

ఉద్యోగ సంఘాలు కలిసి రాలేదు:

ఉద్యమాన్ని అందరూ కలిసి భారీ ఎత్తున తీసుకువెళదాం అంటే ఉద్యోగ

సంఘాలు తో పాటు ఇతర రాజకీయ పార్టీలు కూడా కలిసి రావడం లేదని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో చేసిన ప్రకటనలతో ఉద్యోగ సంఘాలు ఉలిక్కి పడ్డాయి. 

దీంతో ఉక్కు ఉద్యమం లో ఉన్న సమాచార లోపం బహిర్గతమైంది. 
 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam