DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మహిళా పొదుపు సంఘాలకు ఆసరాగా నిలబడ్డాం, సీఎం వైఎస్ జగన్

*బాబు వల్ల దెబ్బతిన్న సంఘాలకు..వైకాపా హామీ నెరవేర్చింది*

*DNS Report : P. Raja, Bureau Chief, Amaravati*   

*అమరావతి, మార్చ్ 25, 2023 (డిఎన్ఎస్):*  వైఎస్సార్‌ ఆసరా పథకం ద్వారా మూడో విడత  రూ.6,419.89 కోట్ల ఆర్థిక సాయాన్ని నేటి నుండి ఏప్రిల్ 5 వరకు 10 రోజుల పాటు పండగ వాతావరణంలో 7,98,395 స్వయం సహాయక పొదుపు సంఘాల్లోని 78,94,169 మంది అక్కచెల్లెమ్మల

ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాన్నీ  ఏలూరు జిల్లా దెందులూరులో  సీఎం వై.ఎస్. జగన్ ప్రారంభించారు. నేడు అందిస్తున్న రూ. 6,419.89 కోట్లతో కలిపి వైఎస్సార్‌ ఆసరా కింద ఇప్పటివరకు సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ. 19,178 కోట్లు అని సీఎం వై.ఎస్. జగన్. 

*చంద్రబాబు వల్ల దెబ్బతిన్న పొదుపు సంఘాలకు...

మేనిఫెస్టోలో ఇచ్చిన మాట మేము నెరవేర్చాము*

గత ప్రభుత్వ రుణాలు కట్టొద్దు పొదుపు సంఘాల తరపున మేమే చెల్లిస్తామని 2014లో హామీ ఇచ్చి ఎగ్గొట్టిన కారణంగా.. రాష్ట్రవ్యాప్తంగా చితికిపోయిన దాదాపు 7.98 లక్షల స్వయం సహాయక సంఘాల్లోని సుమారు 78.94 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఊరటనిస్తూ.. 2019 ఎన్నికల నాటికి SLBC తుది జాబితా ప్రకారం

ఉన్న రూ. 25,571 కోట్ల రుణాన్ని తామే చెల్లిస్తామని మేనిఫెస్టోలో ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ, ఇప్పటికే 2 విడతల్లో రూ. 12,758 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించామని సీఎం జగన్ తెలిపారు.


*అక్కచెల్లెమ్మలు అండగా జగన్ అన్న ప్రభుత్వం*

"అక్కచెల్లెమ్మలు వారి కాళ్ళ మీద వారు నిలబడేటట్టుగా చేసి, వారి జీవనోపాధి

మెరుగుపడేలా.. అమూల్, హిందూస్తాన్ యూనిలివర్, ఐ.టి.సి., పి & జి, అల్లానా, అజియో రిలయన్స్, గ్రామీణ వికాస కేంద్రం, టేనేజర్, కాల్గుడి, జియాన్, నినె, ఇర్మా, ఆయేకార్ట్, మహేంద్ర & భేతి వంటి వ్యాపార దిగ్గజాలతో, బ్యాంకులతో ఒప్పందాలు చేసుకొని వారికి చక్కటి వ్యాపార మార్గాలు చూపించడంతో పాటు ఆసరా, చేయూత, సున్నా వడ్డీ వంటి పథకాలతో

సుస్థిరమైన ఆర్థికాభివృద్ధికి బాటలు వేసాము," అని సీఎం జగన్ తెలిపారు. 


కార్పొరేట్ సంస్థలు, బ్యాంకులతో అనుసంధానం చేసి  ప్రభుత్వం అందించిన సహకారంతో ఇప్పటి వరకు 9,86,616 మంది అక్కచెల్లెమ్మలు కిరాణా దుకాణాలు, ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకల పెంపకం, వస్త్ర వ్యాపారం తదితర వ్యాపారాలు చేపట్టి నెలకు రూ. 7,000 నుండి రూ.

10,000ల వరకు అదనపు ఆదాయం పొందుతున్నారని, అలానే అమూల్ తో ఒప్పందం కారణంగా మార్కెట్లో పోటీ పెరిగి లీటర్ పాలపై రూ.5 నుండి రూ.15 వరకు అదనపు ఆదాయం సంపాదిస్తున్నారని  సీఎం జగన్ అన్నారు. 


*సంక్షేమ పథకాలలో లంచాలు లేవు, వివక్ష లేదు*

అందిస్తున్న సంక్షేమ పథకాలలో ఎక్కడ కూడా లంచాలు లేవని, వివక్ష లేదని సీఎం జగన్

అన్నారు. స్వయం ఉపాధి పొందాలనుకుంటే ప్రభుత్వం పరంగా మహిళలకు తోడ్పాటు.. సలహాలు ఇస్తూ, అండగా ప్రభుత్వం నిలబడుతుందని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. 9 లక్షల మందికి  అక్క చెల్లెమ్మలకు రకరకాల వ్యాపారాలు చేసుకుంటున్నారు వారికీ రూ.4355 కోట్లు బ్యాంకుల ద్వారా  అనుసంధానం చేశామని సీఎం జగన్ తెలిపారు. 

*దేశానికి

రోల్‌మోడల్‌గా ఏపీ పొందుపు సంఘాలు*

దేశానికి రోల్‌మోడల్‌గా ఏపీ పొందుపు సంఘాలు నిలుస్తున్నాయని.. బ్యాంకులతో మాట్లాడి వడ్డీ శాతాలను తగ్గించాం అని సీఎం జగన్ అన్నారు. ఇంకా తగ్గించేలా బ్యాంకర్లమీద ఒత్తిడి తీసుకువస్తున్నామని అయన తెలిపారు. "ఈ 45 నెలల కాలంలో మీ తమ్ముడి ప్రభుత్వం… మహిళా పక్షపాత

ప్రభుత్వంగా అడుగులు ముందుకేసింది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటివరకూ రూ.2,25,330.76 కోట్లు అక్క చెల్లెమ్మలకు ఆర్థిక సహాయం అందించాము," అని తెలిపారు సీఎం జగన్. 

*మహిళ వివక్ష పై పోరాటం*

మహిళ వివక్షమీద పోరాటం చేస్తోంది ఈప్రభుత్వం. కోట్లమంది అక్కచెల్లెమ్మలు.. రక్షా బంధనం కట్టిన ప్రభుత్వం మనది.

 ప్రతి రూపాయి అక్క చెల్లెమ్మలకు ఇవ్వాలి, కుటుంబాలు బాగుపడతాయని నమ్మిన ప్రభుత్వం ఇది. గుడి ఛైర్మన్‌, ఏంఎసీ.. ఇలా నామినేటెడ్‌ పదవుల్లో 50శాతం అక్కచెల్లెమ్మలకు ఇచ్చాం. అక్క చెల్లెమ్మలకు ఎలాంటి హానీ కలగకూడదనే ఉద్దేశంతో దిశ యాప్‌ను తీసుకు వచ్చాం. 1.17 లక్షల మంది రిజస్టర్‌ చేసుకున్నారు. 21 శతాబ్దపు ఆధునిక మహిళ మన

రాష్ట్రంలో ప్రతి గ్రామం నుంచి రావాలని తపనపడుతున్నాను, అని సీఎం జగన్ వ్యాఖ్యానించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam