DNS Media | Latest News, Breaking News And Update In Telugu

యుపిలో గంగానది పుష్కరాలకై యోగి కు జివిఎల్ సూచనలు

*(DNS Report: Sairam CVS, राष्ट्रवादी पत्रकार,)*    

*విశాఖపట్నం, మార్చ్ 26  2023 (డి ఎన్ ఎస్ ):* ఏప్రిల్ 23, 2023 నుంచి మే 4 వరకూ జరుగనున్న గంగానది పుష్కరాల కోసం పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ ను  కోరినట్టు రాజ్యసభ సభ్యులు జి వి ఎల్ నర్సింహారావు తెలియచేసారు. ఆదివారం విశాఖ లో

జరిగిన చర్చ గోష్టి లో పలు అంశాలు వివరించారు. తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు అధిక సంఖ్యలో గంగానది పరివాహక ప్రాంతాలకు ఉత్తర ప్రదేశ్ వెళ్లనున్నారన్నారు. అయితే పుష్కరాల పట్ల ఉత్తరాది వారికీ అంత ప్రాధాన్యత ఉండదని, అయితే తెలుగు రాష్ట్రాల ప్రజలు పవిత్ర స్నానాల కోసం, వైదిక క్రియల కోసం లక్షలాది గా వారణాసి, దేవ ప్రయాగ

క్షేత్రం, ఋషీకేశ్, హరిద్వార్, ప్రయాగ, తదితర ప్రాంతాలకు  వెళ్లడం జరుగుతుందన్నారు. వీళ్ళందరికీ వైద్య శిబిరాలు, స్నాన ఘాట్ ల ఏర్పాటు, మౌలిక వసతులు, పొలిసు చెక్ పోస్ట్ లు, ఆహార, మంచినీటి తదితర ఏర్పాట్లు చేసే విధంగా తగిన సూచనలు చేయడం జరిగిందన్నారు. దీని కోసమే యోగి బృందం రెండు రోజుల క్రితం యుపి లోని అధికార విభాగాలు,

స్థానిక తెలుగు సంఘాల తోనూ  సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు. ఈ సమావేశంలో పాల్గొనవలసిందిగా తనను  ఆహ్వానించారన్నారు. కనీస ఏర్పాట్లు ఏ విధంగా చెయ్యాలో వివరించామన్నారు. ఇప్పడికే వారణాశి లోని తెలుగు ఆశ్రమాలు, సంఘాల ప్రతినిధులతో మాట్లాడమన్నారు. తెలుగు వాళ్ళు ఎక్కువమంది వెళ్లే అవకాశం ఉన్నందున వారణాసి లో

వాలంటీర్లు గా సేవ చేసేందుకు తెలుగు వారిని ఏర్పాటు చేసే అవకాశం ఉందన్నారు. తన రాజ్యసభ నియోజక వర్గ నిధులతో వారణాశి లో ఘాట్ ల వద్ద వృద్దులకు ఉపయోగించే బాటరీ వాహనాలను ఏర్పాటు చేశామన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam