DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వైద్య ఆరోగ్య రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాం:తానేటి వనిత  

*DNS Report : P. Raja, Bureau Chief, Amaravati*   

*అమరావతి, మార్చ్ 31, 2023 (డిఎన్ఎస్  DNS Online ):* రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతోందని రాష్ట్ర హోం మంత్రి డా తానేటి వనిత పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం స్థానిక మంత్రి క్యాంపు కార్యాలయంలో 104

అంబులెన్స్ వాహనాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ, జిల్లాలో అదనంగా మరో పదహారు  104 వాహనాలను  కేటాయించడం జరిగిందన్నారు. ఒక్కొక్క వాహనాన్ని రూ.24 లక్షలు ఖర్చు చేసి, అత్యవసర పరిస్థితుల్లో వైద్య సేవలు అందించే సామర్థ్యం కలిగేలా మౌలిక సదుపాయాలు కల్పించడం జరిగిందన్నారు. ఇప్పటికే

జిల్లాలో అందుబాటులో ఉన్న 104 అంబులెన్స్ వాహనాలకు అదనంగా మరో 16 వాహనాలు కేటాయించినట్లు తెలిపారు. వీటిలో 15 వాహనాలను వివిధ  మండలాలకు కేటాయి చడం జరిగిందన్నారు. ఒక వాహనం స్పేర్ గా ఉంచి అవసరం మేరకు వినియోగించడం జరుగుతుందని అన్నారు. మొత్తం జిల్లా వ్యాప్తంగా ముప్పై నాలుగు 104 అంబులెన్స్ లు అందుబాటులోకి వచ్చాయని అన్నారు.నేడు

కొవ్వూరు మండలం పరిధిలో ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ఈ వాహనం అందుబాటులోకి తీసుకుని వస్తున్నట్లు ఆమె తెలిపారు.  ఆసుపత్రిలో వైద్యం అందించడంతో పాటు ఫ్యామిలీ డాక్టర్ల విధానం ద్వారా గ్రామాల్లో సైతం ప్రజలకు చెరువుగా వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు.

ఉదయం  సమయం లో అందించే సేవలు : 
అన్ని

అనారోగ్యాలకు సాధారణ వైద్య సేవలు (ఓపి) గర్భిణీ స్త్రీలకు ఆరోగ్య సేవలు
బాలింత ఆరోగ్య పరీక్షలు నిర్వహించుట 
నవజాత శిశువు మరియు చిన్నపిల్లల ఆరోగ్య పరిరక్షణ సేవలు  చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు  షెడ్యూల్ ప్రకారం జరుగుతున్న వాటిపై వైద్య సేవలు అందించడం తో పాటు మధ్యాహ్నం అందించే సేవలు వైయస్ఆర్ ఆరోగ్య సేవలు

పొంది ఇంటికి వచ్చిన పేషెంట్లకు వారి ఇంటి వద్ద చూచుట,   బడి పిల్లలు ఆరోగ్య కార్యక్రమం నిర్వహించుట వారానికి ఒకసారి ఇచ్చి ఐరన్ పోలీక్  మాత్రలు పంపిణీ కార్యక్రమం నిర్వహించడం దీర్ఘకాలిక వ్యాధులతో లేదా మంచాన పడియున్న  రోగులకు (T.B),  క్యాన్సర్ మొదలగు వారికి  ఇంటివద్దనే సందర్శించి వారికి పోలియేటివ్ కేర్ అందించుట

జరుగుతుందని వైద్య అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైద్య అధికారులు, సిబ్బంది, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam