DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏపీ లో పెద్దఎత్తున ఐఏఎస్ ల స్థానచలనానికి రంగం సిద్ధం     

*ఎన్నికలకు వైకాపా ముందుకు వెళ్తోందా? అందుకేనా మార్పులు?* 

(DNS నివేదిక: పి. రాజా బ్యూరో చీఫ్ అమరావతి)

అమరావతి, ఏప్రిల్ 3, 2023 (DNS ఆన్‌లైన్): ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లా కలెక్టర్లతో సహా శాఖల అధిపతులలో త్వరలో భారీ మార్పులు జరగనున్నట్టు తెలుస్తోంది. త్వరలో జరుగనున్న ఎన్నికల కోసం అధికార పార్టీ

సిద్దపడుతున్నట్టు సూచనగా ఈ కసరత్తు జరుగుతోందనే ఊహాగానాలకు ఈ చర్య తెరతీస్తోంది. 
దాదాపు కసరత్తు పూర్తి చేసి ముఖ్యమంత్రి ఆమోదం కోసం ఎదురుచూశారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, రాష్ట్రంలో వచ్చే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఇది జరుగుతుంది. ఐఏఎస్ అధికారులను ఇప్పుడున్న స్థానాల నుంచి పెద్ద ఎత్తున తరలించాలని

రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. రాష్ట్రంలో ఆయా జిల్లాల కలెక్టర్లు, మున్సిపల్ కమీషనర్లుగా కొనసాగుతున్న ఐఏఎస్‌లను బదిలీ చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ?

ఒకట్రెండు రోజుల్లో బదిలీ ఉత్తర్వులు వెలువడనున్నాయి. ఈ జాబితాలో వివిధ జిల్లాల కలెక్టర్లు కూడా ఉన్నారు. రాయలసీమ ప్రాంతంలో చిత్తూరు,

అనంతపురం, కర్నూలు, కడప, నెల్లూరు జిల్లాల కలెక్టర్లు, ఉత్తర కోస్తా ఏపీలోని ఏలూరు నుంచి ఒకరు.

ఉత్తరాంధ్రలోని రాజమండ్రి, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల కలెక్టర్లు టాప్ లిస్ట్‌లో ఉన్నారని వారు తెలిపారు. కలెక్టర్లతో పాటు పలు జిల్లాల జాయింట్ కలెక్టర్లు కూడా ఎలివేషన్‌తో బదిలీ కానున్నారు.

కర్నూలు,

అనంతపురం, నెల్లూరు, రాజమండ్రి, గుంటూరు సహా ప్రధాన మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లు బదిలీ అయ్యే అవకాశం ఉంది. ఐఏఎస్ ల బదిలీల కసరత్తు దాదాపు పూర్తయినట్లు సమాచారం. వివిధ శాఖల కార్యదర్శులు, కమిషనర్లను కూడా బదిలీ చేస్తారని వినిపిస్తోంది.

 

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 21, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam