DNS Media | Latest News, Breaking News And Update In Telugu

లోకేష్ యువగళంలో మాటల తూటాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిధ్వనిస్తూన్నాయి

*అడ్డంకులు పెడుతున్నా అదరహో అనిపిస్తున్న యువగళం: పాతర్ల రమేష్* 

*(DNS నివేదిక: పి. రాజా బ్యూరో చీఫ్ అమరావతి)*

*అమరావతి, ఏప్రిల్ 3, 2023 (DNS Online):* గత నాలుగేళ్లుగా ప్రజల సమస్యలు అలాగే ఉండిపోయినా ప్రజా సంక్షేమం పట్టని పాలకులను తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మాటల తూటాలకు రాష్ట్ర

వ్యాప్తంగా రీసౌండ్ వస్తోందని టిడిపి అధికార ప్రతినిధి పాతర్ల రమేష్ అన్నారు. సోమవారం అమరావతిలో డిఎన్ఎస్ తో మాట్లాడుతూ గత 58 రోజులుగా సాగుతున్న యువగలం పాదయాత్ర  59 వ రోజు ఉమ్మడి అనంతపురం జిల్లాలో కొనసాగుతోందన్నారు. 59 వ రోజు ధర్మవరం నియోజకవర్గం లో మహిళలతో ముఖాముఖీ నిర్వహించి, సమస్యలను తెలుసుకున్నారన్నారు. చేనేత

కార్మికుల కుటుంబాలకు అండగా నిలబడతామని, ఇబ్బందుల్లో ఉన్న చేనేత కుటుంబాల్లోని పిల్లలకు మంచి విద్య అందించే భాద్యతలను తెలుగుదేశం పార్టీ తీసుకుంటుందన్నారు. మాట ఇచ్చిందే తడవుగా ఇద్దరు పిల్లల చదువు భాద్యతలను వెంటనే అమలు చేస్తున్నట్టు తెలిపారు.  

నారా లోకేష్ యువగళం పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని

అన్నారు, లోకేష్ యువగళం పాదయాత్రకు వస్తున్నా ప్రజా స్పందన చూసి  ఓర్వలేక వైసిపి ప్రభుత్వం అనేక  ఆంక్షలు, అడ్డంకులు సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు, లోకేష్ యువగళం పాదయాత్రకు ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించిన పాదయాత్ర 400 కిలోమీటర్లు కొనసాగుతుందని ఆయన తెలిపారు, రాష్ట్రంలో ఈసారి జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం విజయం

సాధిస్తుందని ఆయన తెలిపారు, 

 మళ్లీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబునాయుడే నని ఆయన అన్నారు, రాష్ట్రంలో సంపదలు సృష్టించి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగల మొనగాడు చంద్రబాబేనని ఆయన అన్నారు, ఏపీలో ప్రజలు ఒక నిర్ణయానికి వచ్చారని రానున్న ఎన్నికల్లో చంద్రబాబునే ముఖ్యమంత్రి చేయాలని ప్రజలంతా కూడా నిర్ణయానికి

వచ్చారని ఆయన తెలిపారు, ఉద్యోగులకు పెన్షన్లకు నిరాశ మిగిల్చిన  జగన్ ప్రభుత్వం అని ఆయన తెలిపారు, ఈనెల 3 తేదీన అయిన కూడా ఉద్యోగులకు అందని జీతాలు పెన్షన్లులు ఖజానా ఖాళీ కావడంతో నిధుల వేటలో జగన్ ప్రభుత్వం ఉందని ఆయన విమర్శించారు


Latest Job Notifications

Panchangam - Dec 3, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam