DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అధికార పార్టీ అబద్దాల ఫ్యాకర్టీగా మారింది: టిడిపి నేత పాతర్ల రమేష్

*DNS Report : P. Raja, Bureau Chief, Amaravati*   

*అమరావతి, ఏప్రిల్ 15, 2023 (డిఎన్ఎస్ ):* అధికార పార్టీ అబద్దాల ఫ్యాకర్టీగా తయారైందని, దీని చైర్మన్ గా జగన్ రెడ్డి వ్యహరిస్తున్నారని టీడీపీ అధికార ప్రతినిధి పాతర్ల రమేష్ మండిపడ్డారు. శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ యువగళం పాదయాత్రలో

భాగంగా   శుక్రవారం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలను అధికార పార్టీ నేతలు వక్రీకరించారని టీడీపీ అధికార ప్రతినిధి పాతర్ల రమేష్ మండిపడ్డారు. 
నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గం, జక్కసానిపల్లి గ్రామంలో యువతతో జరిగిన ముఖాముఖీ లో లోకేష్ ఎటువంటి తప్పుడు వ్యాఖ్యలు చేయలేదన్నారు.

అంకులప్ప అనే వ్యక్తి విదేశీ విద్యపై అడిగిన ప్రశ్నకు లోకేష్ చెప్పిన సమాధానాన్ని వక్రీకరిస్తూ సాక్షి, అధికార పార్టీ భజన బృందాలు అవాస్తవాలను అదేపనిగా దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.

చంద్రబాబు నాయుడు పెట్టిన విదేశీ విద్యను  జగన్ రెడ్డి తొలగించి తన పేరు పెట్టుకున్నారని మాత్రమే లోకేశ్ అన్నారు. టిడిపి

అధికారంలోకి వస్తే తిరిగి పూర్వం ఉన్న పేరును విదేశీ విద్యకు పునరుద్దరిస్తామని లోకేష్ చెప్పారన్నారు.  

గతంలో చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పధకాలను అన్నింటినీ జగన్ రెడ్డి ప్రభుత్వం తుంగలోకి తొక్కిందన్నారు. జగన్ వ్యక్తిగత కరపత్రం గతంలోనూ చంద్రబాబునాయుడిపై, లోకేష్ పై ఇలాంటి అనేక తప్పుడు వార్తలు

ప్రచారం చేసిందన్నారు. తప్పుడు ప్రచారం చేస్తూ జగన్ భజన బృందాలు అడ్డంగా దొరికిపోయాయన్నారు. 

తెలుగుదేశం పార్టీ సభ్యులకు ఎవ్వరికి ఏమాత్రం సంబంధం లేని వివేకా హత్య కేసును టిడిపి కి అంటగట్టే ప్రయత్నం చేసిన ఘనులు ఈ పాలకునన్నారు. సిబిఐ విచారణలో మొత్తం దుర్మార్గం బయటపడిందన్నారు. 
శ్రీవారి పింక్ డైమండ్

చంద్రబాబునాయుడి ఇంట్లో ఉందంటూ నీతి మాలిన రాజకీయం చేశారు. డీఎస్పీ ప్రమోషన్ లలో చంద్రబాబు సామాజిక వర్గానికే కట్టబెట్టారంటూ దుష్ప్రచారం చేశారు. అమరావతిలో ఇన్ సైడర్ ట్రేడింగ్, పోలవరం, పట్టిసీమల్లో అవినీతి అని తప్పుడు ప్రచారం చేశారు. 

151 మంది ఎమ్మెల్యే లతో అధికారాన్ని కట్టబెట్టిన పాలనా చేతగాక, వైసీపీ నేతలు

ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా అవే అబద్దాలు చెబుతూ ప్రజల్ని తప్పు దారి పట్టిస్తున్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - Nov 23, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam